Election 2022 Dates, Full Schedule: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల... ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఎన్నికలు
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కోవిడ్ కారణంగా పోలింగ్ బూత్ ల సంఖ్య తగ్గించినట్లు ప్రకటించారు.
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమయింది. కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలనే వివిధ పార్టీలు కోరాయి. కానీ భారత ఎన్నికల సంఘం శనివారం 5 రాష్ట్రాలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికలను7 దశల్లో నిర్వహిస్తున్నట్లు సీఈసీ సుశీల్ చంద్ర వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలు 2022 కోసం ఈసీ ముమ్మరంగా సన్నాహాలు చేసిందన్నారు.
Uttar Pradesh to go to poll in 7 phases from 10th Feb to 7th March; Punjab, Uttarakhand and Goa to vote on 14th February & Manipur to vote on 27th Feb & 3 March; Counting of votes on 10th March: ECI pic.twitter.com/hxKms5e8hi
— ANI (@ANI) January 8, 2022
ఉత్తర్ ప్రదేశ్ లో 7 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు సీఈసీ తెలిపారు. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి. మణిపూర్ లో రెండు ఫేజ్ లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మణిపూర్ లో ఫిబ్రవరి 27, మార్చి 3 న ఎన్నికల నిర్వహించనున్నారు. ఈ రాష్ట్రాల ఓట్ల కౌంటింగ్ మార్చి 10న చేపట్టనున్నారు.
7 దశల్లో ఎన్నికల నిర్వహణ
- మెుదటి దశ పోలింగ్ తేదీ : ఫిబ్రవరి 10
- రెండో దశ పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 14(పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్)
- మూడో దశ పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 20
- నాలుగో దశ పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 23
- ఐదో దశ పోలింగ్ తేదీ: ఫిబ్రవరి 27(మణిపూర్)
- ఆరోదశ పోలింగ్ తేదీ : మార్చి 3(మణిపూర్)
- ఏడో దశ పోలింగ్ తేదీ : మార్చి 7
- ఓట్ల లెక్కింపు : మార్చి 10
'ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్రంతో చర్చించాం. అన్ని పార్టీలతో చర్చించిన తర్వాత ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నాం. మార్చిలో 4 రాష్ట్రాలకు అసెంబ్లీ పదవీకాలం ముగుస్తుంది. యూపీ అసెంబ్లీ పదవీకాలం మే నెలలో ముగుస్తుంది. కరోనా దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వైద్య ఆరోగ్య, భద్రతా నిపుణులతో చర్చించిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించాం. ' అని సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు.
Also Read: ఉత్తరాఖండ్‌లో ఎన్నికల ర్యాలీలు నిషేధం.. పూర్తి స్థాయిలో కరోనా ఆంక్షలు అమలు !
ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో 18 కోట్ల మందికి పైగా ఓటర్లు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈసారి 18.34 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. యూపీలో 403, పంజాబ్‌లో 117, గోవాలో 40, ఉత్తరాఖండ్‌లో 70, మణిపూర్‌లో 60 మొత్తం 690 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: ఎలక్షన్ టైం కదా.. రైతులు కొట్టినా తియ్యని దెబ్బే..! ఉత్తరాది బీజేపీ ఎమ్మెల్యేకు ఎంత కష్టమో...?
సి-విజిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా కోవిడ్ నిబంధనలతో సేఫ్ ఎన్నికలు నిర్వహిస్తున్నామని సీఈసీ సుశీల్ చంద్ర తెలిపారు. కోవిడ్ సోకిన వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. సి-విజిల్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలను ఈ యాప్ ద్వారా ఈసీ దృష్టికి తీసుకురావొచ్చని తెలిపారు. నిబంధనల ప్రకారం ఈసీ చర్యలు తీసుకుంటుందన్నారు.
Also Read: 'యూపీ ఎలక్షన్లు 2024 సాధారణ ఎన్నికలకు సెమీస్ కావు'
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి