News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Savarkar Remark: 'ఆయన హిందూ వ్యతిరేకి, చరిత్ర గురించి తెలియదు'- రాహుల్‌పై అసోం సీఎం ఫైర్

Savarkar Remark: సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను అసోం సీఎం హిమంశ బిశ్వ శర్మ తప్పుబట్టారు.

FOLLOW US: 
Share:

Savarkar Remark: వినాయక్ దామోదర్ సావర్కర్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తాజాగా స్పందించారు. రాహుల్ గాంధీ దేశ వ్యతిరేకి, హిందూ వ్యతిరేకి అని హిమంత తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

" రాహుల్ గాంధీకి భారతదేశ చరిత్రపై అవగాహన లేదు. వీర్ సావర్కర్‌పై రాహుల్ వాడిన పదాలు ఆయన భావజాలాన్ని వెల్లడిస్తున్నాయి. ఆయన దేశ వ్యతిరేకి, హిందూ వ్యతిరేకి. ప్రజలు దీనికి ప్రతీకారం తీర్చుకుంటారు.                                     "
-       హిమంత బిశ్వ శర్మ, అసోం సీఎం

రాహుల్ ఏమన్నారు?

'భారత్‌ జోడో యాత్ర'లో భాగంగా వాసిం జిల్లాలో నిర్వహించిన ఓ సభలో రాహుల్‌ గాంధీ సావర్కర్‌పై విమర్శలు చేశారు.

" భారతీయ జనతా పార్టీకీ, ఆరెస్సెస్‌కు సావర్కర్ ఓ చిహ్నం. అండమాన్‌ జైల్లో 2-3 ఏళ్ల పాటు ఉన్న సావర్కర్‌.. క్షమాభిక్ష కోరుతూ బిట్రీష్‌ వారికి అర్జీలు పెట్టుకున్నారు. సావర్కర్‌ గొప్ప ధైర్యసాహసాలు కలిగిన వ్యక్తి అంటూ ఆయనే వేరే పేరుతో పుస్తకాలు రాశారు. బ్రిటీషర్ల నుంచి పింఛన్‌ తీసుకుంటూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సావర్కర్ పనిచేశారు. బ్రిటీషర్లకు భయపడి మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, సర్దార్‌ పటేల్‌ వంటి నేతలను సావర్కర్ మోసం చేశారు.                                    "
-         రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

శివసేన రియాక్షన్ 

ఈ వ్యవహారంపై ఉద్ధవ్‌ ఠాక్రే స్పందించారు. సావర్కర్‌పై రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.

" సావర్కర్‌పై ఆయన వ్యాఖ్యలను అంగీకరించబోను. సావర్కర్‌ అంటే మాకు ఎనలేని అభిమానం ఉంది. అది ఎన్నటికీ చెదిరిపోదు. మమ్మల్ని విమర్శించే ముందు.. జమ్ముకశ్మీర్‌లో పీడీపీతో కలిసి అధికారం పంచుకున్నారో లేదో భాజపా సమాధానం చెప్పాలి.                                          "
-  ఉద్ధవ్ ఠాక్రే, శివసేన

మహారాష్ట్రలో మొన్నటి వరకు కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలిసి ఉద్ధవ్‌ ప్రభుత్వాన్ని నడిపారు. ఇటీవల భారత్‌ జోడో యాత్రలో ఉద్ధవ్‌ కుమారుడు ఆదిత్య ఠాక్రే పాల్గొన్నారు.

Also Read: Gujrat Elections 2022: ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై ఈసీ సీరియస్- ఐఏఎస్‌ అధికారిపై వేటు!

Published at : 18 Nov 2022 05:12 PM (IST) Tags: 'Anti-Hindu India's History Assam CM On Rahul Gandhi's Savarkar Remark

ఇవి కూడా చూడండి

Telangana Election 2023 LIVE Updates: తెలంగాణలో మొదలైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ - క్రమంగా బూత్‌ల వద్దకు చేరుతున్న ఓటర్లు

Telangana Election 2023 LIVE Updates: తెలంగాణలో మొదలైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ - క్రమంగా బూత్‌ల వద్దకు చేరుతున్న ఓటర్లు

Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ డ్యాం వద్ద హైటెన్షన్, 500 మంది ఏపీ పోలీసుల మోహరింపు, సగం ప్రాజెక్టు స్వాధీనానికి యత్నం

Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ డ్యాం వద్ద హైటెన్షన్, 500 మంది ఏపీ పోలీసుల మోహరింపు, సగం ప్రాజెక్టు స్వాధీనానికి యత్నం

Telangana Election: సెలబ్రిటీలు ఓటు వేసేది ఈ బూత్‌లలోనే - మహేశ్‌బాబు, మోహన్‌బాబు ఒకేచోట

Telangana Election: సెలబ్రిటీలు ఓటు వేసేది ఈ బూత్‌లలోనే - మహేశ్‌బాబు, మోహన్‌బాబు ఒకేచోట

Weather Latest Update: రెండ్రోజులు మోస్తరు వర్షాలు, ఈ జిల్లాల్లో అధికంగా: ఐఎండీ

Weather Latest Update: రెండ్రోజులు మోస్తరు వర్షాలు, ఈ జిల్లాల్లో అధికంగా: ఐఎండీ

ABP Desam Top 10, 30 November 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 30 November 2023:  ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

టాప్ స్టోరీస్

Telangana Elections 2023 : ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం - 7 గంటల నుంచి పోలింగ్ !

Telangana Elections 2023 : ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం - 7 గంటల నుంచి పోలింగ్ !

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో ప్రముఖ నేతలు ఓటు వేసేది ఈ బూత్‌లలోనే

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో ప్రముఖ నేతలు ఓటు వేసేది ఈ బూత్‌లలోనే

Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం

Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం

Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి

Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి