Aryan Khan Drug Case: ఆర్యన్ ఖాన్‌కు మరోసారి నిరాశ.. బెయిల్‌పై విచారణ గురువారానికి వాయిదా
షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేసింది.
డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు ఈరోజు కూడా బెయిల్ దొరకలేదు. ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను విచారించిన ముంబయిలోని స్పెషల్ కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. గురువారం ఉదయం 11 గంటలకు ఈ పిటిషన్‌ను కోర్టు విచారించనుంది.
అయితే ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ పిటిషన్‌పై ఎన్‌సీబీ ప్రమాణపత్రం దాఖలు చేసింది. ఇందులో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇవ్వకూడదని ఎన్‌సీబీ కోర్టుకు తెలిపింది. ఇప్పటివరకు చేసిన దర్యాప్తులో డ్రగ్స్ దాయడం, వినియోగించడంలో ఆర్యన్ పాత్ర ఉందని ఎన్‌సీబీ పేర్కొంది.
ఈ వాయిదాతో ఆర్యన్ ఖాన్ మరో రోజు జైలులోనే గడపనున్నాడు. అక్టోబర్ 2న ఆర్యన్ ఖాన్‌ను ఎన్‌సీబీ అరెస్ట్ చేసింది.
మొత్తంగా ఇప్పటివరకు మూడుసార్లు ఆర్యన్ ఖాన్‌కు కోర్టు బెయిల్ నిరాకరించింది.
ఏం జరిగిందంటే..
ముంబయి కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఆ ప్రయాణికుల ఓడలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం అర్ధరాత్రి దాడులు జరిపారు. ఈ రేవ్ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ చెలామణి అవుతుందని విశ్వసనీయ సమాచారం రావడంతో ఎన్సీబీ అధికారులు తనిఖీలు చేశారు. పార్టీలో మత్తు పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అక్కడే ఎన్సీబీ అధికారులకు అధిక మొత్తంలో కొకైన్ సహా ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులోనే ఉన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు.
ఎన్సీబీ టీమ్ అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. ఆదివారం ఉదయం వారందరినీ ముంబయికి తీసుకొని వచ్చారు. అదుపులోకి తీసుకున్న వారిలో 8 నుంచి 10 మందిని విచారణ జరిపారు. ఆర్యన్ ఖాన్‌తో పాటు మరో ఇద్దరికి వైద్య పరీక్షలు కూడా జరిపించారు.
విచారణలో ఉన్న ఆర్యన్ ఖాన్‌కు త్వరగానే బెయిల్ లభిస్తుందని అంతా భావించారు. సోమవారం అతడిని ముంబయి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. అంతకు ముందే తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరుతూ ఆర్యన్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ, ఈ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఆర్యన్‌కు బెయిల్‌ను నిరాకరించిన న్యాయస్థానం.. అతనికి ఈ నెల 7వ తేదీ వరకూ కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఆదేశించింది.
Also Read: Malabar Maritime Exercise Pics: చైనాకు భారత్ చెక్.. 'ఆపరేషన్ మలబార్'తో డ్రాగన్ గుండెల్లో గుబులు
Also Read: Corona Cases: గత 19 రోజులుగా 30 వేలకు దిగువనే కరోనా కేసులు
Also Read:Lakhimpur Violence: రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ బృందం.. ఇదే ప్రధాన డిమాండ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి