Lakhimpur Violence: రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ బృందం.. ఇదే ప్రధాన డిమాండ్
లఖింపుర్ ఖేరీ ఘటనపై చర్చించేందుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కాంగ్రెస్ బృందం కలిసింది. వీరిలో ప్రియాంక గాంధీతో పాటు పలువురు సీనియర్ నేతలు ఉన్నారు.
![Lakhimpur Violence: రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ బృందం.. ఇదే ప్రధాన డిమాండ్ Lakhimpur Violence: Congress Delegation Meets President Ramnath Kovind To Discuss Lakhimpur Case Lakhimpur Violence: రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ బృందం.. ఇదే ప్రధాన డిమాండ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/13/0f17e717711e766839f9aae89652d701_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం కలిసింది. లఖింపుర్ ఖేరి ఘటనపై రాష్ట్రపతితో కాంగ్రెస్ నేతలు చర్చించారు. రాష్ట్రపతిని కలిసిన బృందంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేతలు గులాం నబీ అజాద్, మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ ఉన్నారు.
A delegation of Indian National Congress leaders comprising Mallikarjun Kharge, AK Antony, Ghulam Nabi Azad, Rahul Gandhi and Priyanka Gandhi Vadra called on President Kovind at Rashtrapati Bhavan: Rashtrapati Bhavan pic.twitter.com/jt1MO9vqbG
— ANI (@ANI) October 13, 2021
'మెమొరాండం ఆఫ్ ఫ్యాక్ట్స్' పేరిట ఓ వినతిపత్రాన్ని సమర్పించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని వీరు ప్రధానంగా డిమాండ్ చేశారు. రాష్ట్రపతితో జరిగిన చర్చపై రాహుల్ గాంధీ మాట్లాడారు.
ఇదీ కేసు..
కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలపై నిరసన వ్యక్తం చేస్తోన్న రైతులపైకి ఓ వాహనం దూసుకెళ్లిన ఘటనలో నలుగురు అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు. ఆ హింసాత్మక ఘటనలో మరో ఇద్దరు భాజపా కార్యకర్తలు, ఓ డ్రైవర్ సహా ఓ జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. అక్టోబర్ 3న జరిగిన ఈ ఘటన యావత్ దేశాన్నే షాక్‌కు గురి చేసింది.
అయితే రైతులపైకి దూసుకువచ్చిన కారులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఎట్టకేలకు కేంద్ర మంత్రి కుమారుడ్ని పోలీసులు అరెస్టే చేశారు. ఆయనతో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)