(Source: ECI/ABP News/ABP Majha)
GatiShakti Launch: రూ.100 లక్షల కోట్లతో 'పీఎం గతి శక్తి'కి మోదీ శ్రీకారం.. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో సెటైర్లు
పీఎం గతి శక్తి కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రూ.100 లక్షల కోట్లతో రూపొందించిన పీఎం గతిశక్తి ద్వారా 21వ శతాబ్దంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని మోదీ అన్నారు.
ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పీఎం గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గతిశక్తితో పాటు భారత వర్తక ప్రోత్సాహక సంస్థ కోసం నిర్మించిన నూతన ఎగ్జిబిషన్ కాంప్లెక్స్‌లను సైతం మోదీ ప్రారంభించారు. దిల్లీలోని ప్రగతి మైదానంలో ఈ కార్యక్రమం జరిగింది. రూ.100 లక్షల కోట్లతో రూపొందించిన పీఎం గతిశక్తి ద్వారా 21వ శతాబ్దంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని మోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్ సహా పలువురు పాల్గొన్నారు.
Delhi: PM Narendra Modi inaugurates PM GatiShakti-National Master Plan for multi-modal connectivity & new exhibition complexes of ITPO pic.twitter.com/bHDJ5xG9kx
— ANI (@ANI) October 13, 2021
ప్రతిపక్షాలపై విమర్శలు..
అభివృద్ధి ప్రాజెక్టులు చేస్తుంటే ప్రతిపక్షాలు వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని మోదీ ఈ సందర్భంగా అన్నారు.
జీ-20 ఇక్కడే..
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పీఎం గతిశక్తి ద్వారా ఎన్నో అభివృద్ధి ప్రణాళికలు, పెట్టుబడులకు జోష్ వచ్చిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో 2023 జీ-20 సదస్సు ఇదే ప్రగతి మైదాన్‌లో జరగనుందని తెలిపారు.
ఏంటీ ప్రాజెక్ట్?
మౌలిక రంగాన్ని సమూలంగా మార్పు చేసి, శాఖల మధ్య సమన్వయం తీసుకొచ్చేలా గతి శక్తి ప్రాజెక్ట్‌ను సిద్ధం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో మాట్లాడుతూ గతి శక్తి కార్యక్రమాన్ని ప్రధాని మోదీ తొలిసారి ప్రస్తావించారు. గతిశక్తి కార్యక్రమంలో భాగంగా చేపట్టే పనులను 2024-25 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read:Lakhimpur Violence: రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ బృందం.. ఇదే ప్రధాన డిమాండ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి