Kejriwal on Uniform Civil Code: అప్పుడూ హడావుడి చేసి దుకాణం సర్దేశారు, ఇప్పుడూ అదే జరుగుతుంది - యూసీసీపై కేజ్రీవాల్
Kejriwal on Uniform Civil Code: యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయాలన్న భాజపా ఆలోచనను కేజ్రీవాల్ తప్పుపట్టారు.
Kejriwal on Uniform Civil Code:
భాజపా ఉద్దేశం సరైంది కాదు..
గుజరాత్‌లో యూనిఫామ్ సివిల్ కోడ్ (Uniform Civil Code) అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా దీనిపై స్పందించారు. గుజరాత్ పర్యటనలో ఉన్న కేజ్రీవాల్ మీడియా సమావేశంలో భాజపాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. "భాజపా ఉద్దేశం సరైంది కాదు. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని రాజ్యాంగంలోని ఆర్టికల్ 44లో స్పష్టంగా రాసుంది. ఆ తరవాతే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. అన్ని వర్గాల నుంచి అనుమతి, అంగీకారం తీసుకున్నాకే అమలు చేయాలి. అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే ముందుకెళ్లాలి" అని వెల్లడించారు కేజ్రీవాల్. " బీజేపీ ఉత్తరాఖండ్ ఎన్నికల ముందు యూసీసీ అమలు చేయాలనుకుని అప్పుడు కూడా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. అక్కడ విజయం సాధించాక ఆ కమిటీ అంతా సర్దుకుని ఇంటికి వెళ్లిపోయింది. ఇప్పుడు గుజరాత్ ఎన్నికల తేదీలు ప్రకటించే ముందు ఇక్కడ కమిటీని నియమించింది. ఎన్నికల తరవాత అది కూడా బిచాణా ఎత్తేస్తుంది. ఇప్పటికిప్పుడు మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎందుకీ ఆలోచన చేయటం లేదు" అని ప్రశ్నించారు. యూసీసీని అమలు చేయడమే భాజపా ఉద్దేశమైతే..దేశవ్యాప్తంగా ఎందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. బహుశా లోక్‌సభ ఎన్నికల కోసం ఎదురు చూస్తూ ఉంటారని, ఆ సమయంలో ప్రకటిస్తారేమో అని సెటైర్లు వేశారు.
మాయావతి కూడా..
బీఎస్‌పీ (BSP) అధినేత మాయావతి కూడా ఈ వివాదంపై స్పందించారు. "యూపీ సహా మిగతా రాష్ట్రాల్లోనూ యూసీసీ అంశాన్ని పదేపదే ఎన్నికల ముందు ప్రస్తావిస్తోంది భాజపా. నిరుద్యోగం లాంటి సమస్యలను పక్కన పెట్టి వాటిని పక్కదోవ పట్టించేందుకు ఈ వివాదాన్ని
తెరపైకి తీసుకొస్తోంది. ఇప్పుడు గుజరాత్‌లోనూ ఇదే విధంగా చేస్తోంది. దీన్నో ఎన్నికల అంశంగా మార్చే ప్రయత్నం చేస్తోంది. ఆ రాష్ట్రంలో భాజపా పరిస్థితి బాగోలేదని తెలుస్తోంది" అని ట్వీట్ చేశారు మాయావతి. "ఇటీవల కేంద్రమే సుప్రీం కోర్టుకు యూసీసీపై కొన్ని కీలక విషయాలు
చెప్పింది. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. అలాంటప్పుడు గుజరాత్‌లో మాత్రం ఇది ఎందుకు చర్చకు వచ్చింది" అని ప్రశ్నించారు. అంతే కాదు. భాజపాకు కొందరు సీక్రెట్‌గా కోట్ల రూపాయల ఫండ్‌లు అందిస్తున్నారని, వాటిని ఎలా ఖర్చు చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత ఆ పార్టీకి ఉందని అన్నారు.
1. यूपी व अन्य राज्यों में भी रोजगार व विकास के बजाय बीजेपी द्वारा विवादित एवं विभाजनकारी मुद्दों की तरह समान नागरिक संहिता को चुनावी मुद्दा बनाना खास बात नहीं, किन्तु गुजरात में इसको चुनावी मुद्दा बनाने से इस आमचर्चा को बल मिलता है कि वहाँ बीजेपी की हालत वास्तव में ठीक नहीं है।
— Mayawati (@Mayawati) October 30, 2022
2. जबकि केन्द्र ने अभी हाल में स्वंय माननीय सुप्रीम कोर्ट में कहा है कि यूनिफार्म सिविल कोड के मामले पर कोई निर्णय अभी न किया जाए क्योंकि इसे वह 22वें लॉ कमीशन को सौंपेगी, तो फिर गुजरात विधानसभा चुनाव में ऐसा क्या होने जा रहा है जिससे बीजेपी विचलित है व झुक रही है।
— Mayawati (@Mayawati) October 30, 2022
Also Read: Uniform Civil Code: నాకేమీ ఆశ్చర్యంగా అనిపించటం లేదు, భాజపాకు ఇది అలవాటే - యూసీసీపై అసదుద్దీన్