అన్వేషించండి

ఏ తప్పూ చేయలేదు, నా అడ్డు తొలగించుకోడానికి బీజేపీ చేస్తున్న కుట్ర ఇది - ఈడీ సమన్లపై కేజ్రీవాల్

Arvind Kejriwal: తాను ఏ తప్పూ చేయలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తేల్చి చెప్పారు.

Arvind Kejriwal on ED Summons: 


కేజ్రీవాల్‌ కామెంట్స్..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారన్న ఊహాగానాలు వస్తున్న క్రమంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రచారం చేయకుండా తనను అడ్డుకోడానికే బీజేపీ ఈ కుట్ర చేస్తోందని మండి పడ్డారు. తాను ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. ఈడీ ఇచ్చిన సమన్లు లీగల్‌గా చెల్లవని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఈడీకి ప్రత్యేకంగా లేఖ రాశారు కేజ్రీవాల్. తనకు సమన్లు పంపడం వెనక ఉద్దేశమేంటో చెప్పాలని ఆ లేఖలో ప్రస్తావించారు. ఈడీ ముందు హాజరు కావాలంటూ పంపిన సమన్లను ఆయన ఖండించారు. హాజరయ్యే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రత్యేకంగా ఓ వీడియో విడుదల చేశారు. లిక్కర్ పాలసీ స్కామ్‌లో భాగంగా విచారణకు రావాలని ఈడీ కేజ్రీవాల్‌కి సమన్లు పంపింది. 

"కేవలం నన్ను అడ్డుకోడానికి బీజేపీ చేస్తున్న కుట్ర ఇది. నేనే తప్పు చేయలేదన్నది నిజం. కానీ బీజేపీ మాత్రం ఏదో జరిగిపోయిందని చెప్పి నన్ను అరెస్ట్ చేయాలని చూస్తోంది. నా నిజాయతీయే నాకున్న ఆస్తి. ఈడీ పంపిన సమన్లు చెల్లవని ఇప్పటికే మా లాయర్లు చెప్పారు. నాపై విచారణ జరిపించాలని కాదు...లోక్‌సభ ఎన్నికల ముందు ప్రచారం చేయకుండా కట్టడి చేసేందుకే ఇదంతా"

- అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి

 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో విచారణకు హాజరు కావాలని ఇప్పటికే మూడు సార్లు సమన్లు పంపింది ఈడీ. మూడుసార్లూ విచారణకు కేజ్రీవాల్ హాజరు కాలేదు. వాళ్లు పంపిన సమన్లు ఎందుకు చట్టబద్ధం కావో వివరించానని, వాళ్ల దగ్గర ఏ సమాధానమూ లేదని విమర్శించారు. జనవరి 19న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయని, ఆ తరవాత 26న గణతంత్ర వేడుకలకు హాజరవ్వాల్సి ఉందని వివరించారు. కేజ్రీవాల్‌ ఇచ్చిన సమాధానాన్ని తాము పరిశీలిస్తున్నామని...నాలుగోసారీ సమన్లు జారీ చేసే యోచనలో ఉన్నామని ఈడీ స్పష్టం చేసింది. అయితే...లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అరవింద్ కేజ్రీవాల్ మూడు రోజుల పాటు గుజరాత్‌లో పర్యటించనున్నారు. అక్కడ పలు సమావేశాలకు హాజరవ్వడంతో పాటు బహిరంగ సభల్లోనూ పాల్గొననున్నారు. 

‘కేజ్రీవాల్‌ ఇంట్లో ఈడీ సోదాలు జరపనున్నట్లు మాకు సమాచారం అందుతోంది. బహుశా ఆయన్ను అరెస్ట్‌ చేయొచ్చు’ అంటూ ఆప్‌ కీలక నేత అతిశీ సోషల్ మీడియా ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ఆప్‌ జాతీయ అధికార ప్రతినిధి సౌరభ్‌ భరద్వాజ్‌ సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. కేజ్రీవాల్‌ ఇంట్లో ఈడీ సోదాలు జరుగుతాయని విశ్వసనీయ వర్గాల సమాచారం ఉందని ‘డైలాగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కమిషన్‌ ఆఫ్‌ దిల్లీ’ ఛైర్‌పర్సన్‌ జాస్మిన్‌ షా పేర్కొన్నారు. 

Also Read: Petro Rates: ప్రజల ఆశలపై పెట్రోల్‌ చల్లిన ప్రభుత్వం, పైసా కూడా తగ్గించదట

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy Love Story: ప్రేమ కోసం బైక్‌పై ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. సీఎం లవర్ బాయ్ మూమెంట్ వైరల్!
ప్రేమ కోసం బైక్‌పై ఢిల్లీకి వెళ్లిన రేవంత్‌రెడ్డి.. సీఎం లవర్ బాయ్ మూమెంట్ వైరల్!
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
IT Raids At Sneha Group: పౌల్ట్రీ దిగ్గజం స్నేహ ఫామ్స్‌కు ఐటీ షాక్.. ఏపీ, తెలంగాణలో 16 చోట్ల తనిఖీలు
పౌల్ట్రీ దిగ్గజం స్నేహ ఫామ్స్‌కు ఐటీ షాక్.. ఏపీ, తెలంగాణలో 16 చోట్ల తనిఖీలు
KL Rahul Milestone: సచిన్, కోహ్లీ సరసన చేరేందుకు అడుగు దూరంలో రాహుల్.. సేనా దేశాల్లో తొలి భారత ఓపెనర్‌గా అరుదైన రికార్డు
సచిన్, కోహ్లీ సరసన చేరేందుకు అడుగు దూరంలో రాహుల్.. సేనా దేశాల్లో తొలి భారత ఓపెనర్‌గా అరుదైన రికార్డు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Embed widget