Live Updates: మెగాస్టార్ చిరంజీవికి సీఎం జగన్ నుంచి ఆహ్వానం
LIVE
Background
శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని గార మండలానికి చెందిన ముగ్గురు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి ఆచూకీ లేకుండా పోయారు. గారకు చెందిన పలువురు మత్స్యకారులు శనివారం తెల్లవారుజామున చేపల వేటకు సముద్రంలోకి వెళ్లారు. ఈ క్రమంలోనే ముగ్గురు గల్లంతయ్యారు. తోటి మత్స్యకారులు గాలించగా ఒకరి మృతదేహం దొరికినట్లు స్థానికులు తెలిపారు. మిగతా ఇద్దరి కోసం వెతుకుతున్నారు.
మెగాస్టార్ చిరంజీవికి సీఎం జగన్ నుంచి ఆహ్వానం
మెగాస్టార్ చిరంజీవికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ నుంచి ఆహ్వానం అందింది. మంత్రి పేర్ని నాని చిరంజీవితో ఫోన్ లో మాట్లాడారు.
దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న రాష్ట్రపతి
75వ సాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్ నాథ్ ప్రసంగిస్తున్నారు.
కోటి రూపాయల విలువైన శ్రీ గంధం చెక్కలు పట్టివేత
అనంతపురం జిల్లా అమరాపురం మండలం బసవనపల్లెలో ఉన్న యునైటెడ్ ఆయిల్ ఇండస్ట్రీ లో శ్రీ గంధం చెక్కలను అక్రమంగా నిల్వ ఉంచారు. అక్రమ నిల్వలను అమరాపురం పోలీసులు పట్టుకున్నారు. వాటి విలువ దాదాపు రూ. కోటి 27 లక్షల 3500 ఉంటుందని అంచనా వేశారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి అక్రమంగా చెక్కలను నిందితులు తరలించినట్టు తెలుస్తోంది. పోలీసులకు పట్టుబడకుండా.. ఆయిల్ ఇండస్ట్రీలోని అండర్ గ్రౌండ్లో శ్రీ గంధం చెక్కలను నిల్వ ఉంచారు. నిందితుల నుంచి దాదాపు 3,983 కిలోల శ్రీ గంధం చెక్కలు, 16 కిలోల శాండిల్ వుడ్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. కేరళ రాష్ట్రానికి చెందిన కృష్ణన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
దళితబంధుపై హుజూరాబాద్‌లో ఆందోళన
దళిత బంధు విషయంలో హుజూరాబాద్‌లో ఆందోళన జరుగుతోంది. అర్హులైన వారందరికీ దళిత బంధు రావట్లేదని ఎస్సీలు డిమాండ్ చేస్తూ నిరసన చేశారు. పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం, పెద్దపాపయ్యపల్లి క్రాస్ రోడ్ వద్ద ఎస్సీలు ఆందోళన చేపట్టారు. వీరి ఆందోళనతో వరంగల్-కరీంనగర్ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.
రాహుల్ గాంధీ ట్విటర్ అకౌంట్ పునరుద్ధరణ
కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ట్విటర్ అకౌంట్ తిరిగి పని చేస్తోంది. రాహుల్ అకౌంట్‌ను బ్లాక్ చేసిన ట్విటర్ ఇప్పుడు మళ్లీ పునరుద్ధరించింది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో అత్యాచారం, హత్యకు గురైన బాధితురాలి కుటుంబ సభ్యుల ఫోటోలను రాహుల్ గాంధీ ట్విటర్‌లో ఉంచారు. దానిపై వివాదం రేగడంతో ట్విటర్ ఆ అకౌంట్‌ను స్తంభింపజేసింది. తాజాగా ఆయన ఖాతాను ట్విటర్ అన్‌లాక్ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాహుల్ అకౌంట్‌తో పాటు పార్టీ నేతల అందరి ఖాతాలు కూడా తిరిగి పని చేస్తున్నాయని కాంగ్రెస్ ప్రకటించింది.
In my conversations w/@Twitter I took strong exception to the policy of automatically locking accounts, whether @RahulGandhi’s or @rsprasad’s. If there is a violation of law, whether POSCO or copyright, it should suffice to withhold the offending tweet& issue notice to the user.
— Shashi Tharoor (@ShashiTharoor) August 14, 2021