Breaking News : చీకోటి ప్రవీణ్‌కు మరోసారి నుంచి ఈడీ పిలుపు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
LIVE
Background
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కుమారులతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమీపంలోని తామర చెరువులో దూకి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల వివరాలు- మృదుల అనే తల్లి ఎనిమిదేళ్ల ప్రజ్ఞాన్, ఐదేళ్ల మహాన్ కలిసి ఆత్మహత్య చేసుకున్నారు.
చీకోటి ప్రవీణ్‌కు మరోసారి ఈడీ పిలుపు
క్యాసినోలు నిర్వహించే చీకోటి ప్రవీణ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి పిలుపు వచ్చింది. ఈనెల 15న విచారణకు రావాలని ఈడీ నోటీసులు పంపింది. గతంలో కూడా ఈడి ఈయన్ని విచారించింది. ఇప్పుడు మరోసారి పిలవడం ఆసక్తిగా మారింది. ఈయనతోపాటు చిటటిదేవేందర్, మాధవరెడ్డి, సంపత్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరుకావాలని పిలుపునిచ్చింది.
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విషాదం- కుమారులతో కలిసి తల్లి ఆత్మహత్య