అన్వేషించండి

ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు మనోబాల కన్నుమూత

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Key Events
AP Telangana Breaking News Telugu Live Updates 3 May 2023 Chiyaan Vikram suffers rib injury at Thangalaan shoot ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు మనోబాల కన్నుమూత
ప్రతీకాత్మక చిత్రం

Background

తంగళన్ షూటింగ్‌ టైంలో చియాన్ విక్రమ్ గాయపడ్డట్టు సమాచారం. ఈ ప్రమాదంలో విక్రమ్ పక్కటెముకులు విరిగినట్టు కూడా తెలుస్తోంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. పా రంజిత్ దర్శకత్వంలో తంగళన్ సినిమాలో వైవిధ్యమైన పాత్రలో విక్రమ్ నటిస్తున్నాడు. చియాన్ విక్రమ్ నటిస్తున్న 'తంగలన్'లో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తమిళ టాప్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. 2023 మోస్ట్ అవైటెడ్ మూవీగా క్రేజ్ దక్కించుకుంది 'తంగలన్'. ఈ మూవీ మొదలైన నాటి నుంచి అభిమానులను ఆసక్తిగా గమనిస్తున్నారు. విక్రమ్ గతంలో ఏ చిత్రంలోనూ కనిపించని రీతిలో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. స్పెషల్ కంటెంట్ తో ఆకట్టుకోబోతున్నారు.

స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం 1800ల కాలంలో సాగే పీరియాడికల్ డ్రామాగా రూపొందుతోంది. కోలార్ బంగారు గనుల నేపథ్యంలో ‘కేజీఎఫ్’ రూపొందింది. అయితే, అదే కేజీఎఫ్ గనుల్లో జరిగిన కొన్ని నిజఘటనల ఆధారంగా ‘తంగలన్’ రూపొందుతోందని తెలుస్తోంది. ఈ చిత్రం 3Dలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా ఈ చిత్రాన్ని విడుదలచేయనున్నారు.

ఇటీవలే విడుదలైన పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 2లో ఆదిత కరికాలన్ పాత్రలో చియాన్ విక్రమ్ అలరించాడు.  ఈ చిత్రం ప్రమోషన్‌ కోసం హైదరాబాద్ వచ్చిన విక్రమ్ చాలా ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నారు. 'పీఎస్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విక్రమ్ తెలుగులో మాట్లాడి, అందర్నీ ఆకర్షించారు. తెలుగు ప్రజలు చూపిస్తున్న ఉత్సాహం ఎక్కడా చూడలేదంటూ వ్యాఖ్యానించారు. తాము పలు రాష్ట్రాల ప్రేక్షకులను కలుసుకున్నామన్న విక్రమ్.. ఇక్కడ మీరు చూపిస్తున్న ఉత్సాహం ఇంకెక్కడా చూడలేదని చెప్పారు. పలు తెలుగు సినిమాల చిత్రీకరణ కోసం హైదరాబాద్‌లో తిరిగానని, పంజాగుట్ట సర్కిల్‌, బంజారాహిల్స్‌ లాంటి కొన్ని ప్రదేశాలు తనకు బాగా గుర్తున్నాయంటూ విక్రమ్ చెప్పుకొచ్చారు.

తనకు అప్పట్లో టాలీవుడ్‌ అగ్ర దర్శకులతో పనిచేయాలని కోరిక ఉండేదని, కానీ.. అది నెరవేరలేదని విక్రమ్ చెప్పారు. కానీ ఓటీటీకి ఈ సందర్భంగా థ్యాంక్స్‌ చెప్పే అవకాశం వచ్చిందని తెలిపారు. ఎన్నో సరిహద్దులను అది చెరిపేసిందన్న ఆయన.. ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ ద్వారా పెద్ద విజయం అందుకున్నామని చెప్పారు. ఇది నేరుగా తాను తెలుగు సినిమాలో నటించినంత ఆనందాన్ని ఇచ్చిందంటూ విక్రమ్‌ ఆనందం వ్యక్తం చేశారు. 

ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ప్రచార ఇంటర్వ్యూలో మాట్లాడిన విక్రమ్... తాను ప్రారంభంలో 'పొన్నియిన్ సెల్వన్'లో నటించే అవకాశాన్ని తిరస్కరించినట్లు వెల్లడించారు. గతంలో ఎమ్‌జి రామచంద్రన్ నుంచి 'పొన్నియిన్ సెల్వన్' హక్కులను పొందిన నటుడు కమల్ హాసన్ .. దాన్ని టీవీ సిరీస్ గా చేయాలని నిశ్చయించుకున్నారు. ఆ తర్వాత తనకు ఫోన్ చేసి 'పొన్నియన్ సెల్వన్' నవలను టీవీ సిరీస్ గా తీయాలనుకుంటున్నానని, అందులో నీకిష్టమైన పాత్ర ఏదైనా ఎంచుకోమని ఆఫర్ ఇచ్చినట్టు హీరో విక్రమ్ తెలిపారు. కానీ తాను చిన్న స్క్రీన్‌లో నటించే ఉద్దేశం లేదని, ప్రస్తుతానికి వెండితెరపై నటించడానికే ఇష్టపడుతున్నట్టు సున్నితంగా కమల్ ఆఫర్ ను తిరస్కరించినట్టు ఆయన పేర్కొన్నారు. అయితే ఆ సమయంలో 'పొన్నియన్ సెల్వన్' కథలో తనకు ఎలాంటి పాత్రనైనా ఎన్నుకునే స్వేచ్ఛను ఇచ్చినందుకు గానూ కమల్ హాసన్ కు హీరో విక్రమ్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

18:15 PM (IST)  •  03 May 2023

Hetero Labs: హెటిరో ల్యాబ్స్ కెమికల్స్ మిక్స్ చేసే యంత్రంలో పడి  ప్రొడక్షన్ ఆపరేటర్ మృతి

జీడిమెట్ల పీఎస్ పరిధిలోని హెటిరో ల్యాబ్స్ లో మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రమాదవశాత్తూ కెమికల్స్ మిక్స్ చేసే యంత్రంలో పడి ప్రొడక్షన్ ఆపరేటర్ మహేందర్ (28) పడి మృతి చెందాడు. నిజామాబాద్ కి చెంది మహేందర్ గత మూడు సంవత్సరాలుగా హెటరో  ఫార్మా యూనిట్ 3లో ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. మిక్స్ డ్ యంత్రంలో కెమికల్ ను మార్చే క్రమంలో మహేందర్ కు తీవ్ర గాయాలు కావడంతో దగ్గరలో ఉన్న మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించగా, అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహేందర్ మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

17:22 PM (IST)  •  03 May 2023

Siddipet News: మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్ల పరిశీలన

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఈ నెల 5 వ తేదీన మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్, బహిరంగ సభ వేదిక ఏర్పాట్లను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే సతీష్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈనెల 5వ తేదీన శుక్రవారం ఉదయం 10 గంటలకు హెలికాప్టర్ ద్వారా హుస్నాబాద్ కు రానున్న మంత్రి కేటీఆర్ మినీ స్టేడియంలో ల్యాండ్ అయిన తర్వాత అక్కడే సమీపంలో ఉన్న ఇండోర్ స్టేడియం, డిగ్రీ కళాశాల, ఎస్టీ ఉమెన్స్ హాస్టల్ లను ప్రారంభిస్తారన్నారు. అనంతరం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు ఇంటి పట్టాల పంపిణీ, బస్తీ దావకాన, టిటిసి బిల్డింగ్, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లను ప్రారంభించడంతోపాటు ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. అక్కడినుండి స్థానిక బస్ డిపో గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభకు హాజరవుతారని పేర్కొన్నారు. దాదాపు 50 వేల మందికి పైగా ప్రజలు, కార్యకర్తలు ఈ బహిరంగ సభకు హాజరవుతున్నారని, మొట్టమొదటిసారి హుస్నాబాద్ కు వస్తున్న మంత్రి కేటీఆర్ పర్యటనను నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Land Pooling: త్వరలో అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - ఏపీ మంత్రి నారాయణ 
అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
SP Balu Statue Controversy: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
Telangana Rising 2047: రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
Samantha Wedding Saree: సమంత సంతోషం... పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్... రాజ్ నిడిమోరుతో ఏడడుగుల్ - ఫోటోలు చూశారా?
సమంత సంతోషం... పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్... రాజ్ నిడిమోరుతో ఏడడుగుల్ - ఫోటోలు చూశారా?
Advertisement

వీడియోలు

Alphonso Davies | శరణార్థి శిబిరం నుంచి లెజెండరీ ఫుట్‌బాలర్‌ వరకూ.. అల్ఫాన్జో స్టోరీ తెలుసా? | ABP
Virendra Sehwag Comments on Virat Kohli | వైరల్ అవుతున్న సెహ్వాగ్ కామెంట్స్
Hardik Pandya in Ind vs SA T20 | టీ20 సిరీస్‌ లో హార్దిక్ పాండ్య ?
Gambhir vs Seniors in Team India | టీమ్‌ఇండియాలో ఏం జరుగుతోంది?
Ashwin Comments on Team India Selection | మేనేజ్‌మెంట్ పై అశ్విన్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Land Pooling: త్వరలో అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - ఏపీ మంత్రి నారాయణ 
అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు
SP Balu Statue Controversy: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటుపై వివాదమేంటి? ఎందుకు వ్యతిరేకిస్తున్నారు
Telangana Rising 2047: రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
రేవంత్ రెడ్డి 'విజన్ డాక్యుమెంట్'.. రెండు దశాబ్దాల తెలంగాణ ప్రగతికి 'రోడ్ మ్యాప్'!
Samantha Wedding Saree: సమంత సంతోషం... పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్... రాజ్ నిడిమోరుతో ఏడడుగుల్ - ఫోటోలు చూశారా?
సమంత సంతోషం... పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్... రాజ్ నిడిమోరుతో ఏడడుగుల్ - ఫోటోలు చూశారా?
Sabarimala Special Trains: శబరిమలకు 10 ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచే బుకింగ్స్ ప్రారంభం
శబరిమలకు 10 ప్రత్యేక రైళ్లు.. నేటి నుంచే బుకింగ్స్ ప్రారంభం
Bigg Boss Telugu Day 87 Promo : టికెట్ టూ ఫినాలే టాస్క్ హైలెట్స్.. తనూజ vs సుమన్ శెట్టి, సపోర్ట్ చేయని భరణి
టికెట్ టూ ఫినాలే టాస్క్ హైలెట్స్.. తనూజ vs సుమన్ శెట్టి, సపోర్ట్ చేయని భరణి
Crime News: ఎంతకు తెగించార్రా..! ఇన్సూరెన్స్ చేపించి మరీ అన్నను హత్య చేసిన తమ్ముడు.. ఇంత దారుణమా!
ఎంతకు తెగించార్రా..! ఇన్సూరెన్స్ చేపించి మరీ అన్నను హత్య చేసిన తమ్ముడు..
Revanth Reddy On Temples: దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
దేవుళ్లపైనే ఏకాభిప్రాయం లేనప్పుడు..రాజకీయ నాయకులపై ఏముంటుంది? - రేవంత్ వ్యాఖ్యలతో దుమారం
Embed widget