Top Headlines Today: ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభం, మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు- నేటి టాప్ న్యూస్
Andhra Pradesh Telangana Latest News 1 July 2024: నేటి ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టాప్ హెడ్ లైన్స్ మీకోసం.. ఒక్క క్లిక్ చేస్తే 5 ప్రధాన వార్తలు ఒకేచోట మీకోసం.
Telangana News Today | ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభం- ఒకే కుటుంబంలో భర్త, భార్య, కుమార్తెకు పింఛన్ ఇచ్చిన చంద్రబాబు
అసెంబ్లీ ఎన్నికల్లో హామి ఇచ్చినట్టుగానే ఆంధ్రప్రదేశ్‌లో పెంచిన సామాజిక పింఛన్లు పంపిణీ ప్రారంభమైంది. ఉదయం ఆరు గంటలకే లబ్ధిదారుల ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్లు అందజేశారు. వారితో మాట్లాడి వారి కుటుంబ స్థితిగతులు తెలుసుకున్నారు. ఆ డబ్బులను వారు ఎలా ఉపయోగిస్తున్నారో అడిగారు. వారితో సుమారు అరగంట పాటు మాట్లాడారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
వలంటీర్ వ్యవస్థ లేనట్టేనా? పవన్ వ్యాఖ్యల వెనుక అర్థమేంటీ?
వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడూ వలంటీర్ వ్యవస్థదే కీలక పాత్ర. పింఛన్ల పంపిణీ నుంచి కీలకమైన సమాచారం తెప్పించుకునేంత వరకు అన్ని బాధ్యతలు వారిదే. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. వారే ప్రభుత్వానికి కళ్లూ చెవులూ అంటూ వాదిస్తూ వచ్చింది. వారి లేకుంటే అసలు రాష్ట్రంలో చాలా వరకు సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయే పరిస్థితి ఉందని చెప్పుకుంటూ వచ్చింది. వలంటీర్ వ్యవస్థ అనేది ఫెసిలిటేటర్ మాత్రమేనని వారి లేకపోయే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏదీ ఆగిపోదని ఇవాల్టి పింఛన్ల పంపిణీతో స్పష్టత ఇచ్చింది చంద్రబాబు సర్కారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు - ఆ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు (KCR) షాక్ తగిలింది. విద్యుత్ కమిషన్ ఏర్పాటును రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ పిటిషన్‌లో పేర్కొనగా.. నిబంధనల మేరకే విద్యుత్ కమిషన్ వ్యవహరిస్తోందని ఏజీ తెలిపారు. కేసీఆర్ పిటిషన్‌కు విచారణార్హత లేదని వాదించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలంగాణ ఉచిత బస్సు ప్రయాణంలో మరో వెసులుబాటు- ఈసారి ఆ టెన్షన్ లేకుండా చర్యలు
మహాలక్ష్మి పేరుతో తెలంగాణలో మహిళలకు అందిస్తున్న ఉచిత బస్ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపించి మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. అందుకే దీన్ని మరింత సులభతరం చేసేందుకు ఆర్టీసీ ఆలోచన చేస్తోంది. ఉచిత ప్రయాణం లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కొత్త చట్టాలు న్యాయం చేయడం కోసమే తప్ప శిక్షించడం కోసం కాదు - అమిత్ షా కీలక వ్యాఖ్యలు
కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చిన వేళ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు ముగింపు పలికామని వెల్లడించారు. ఇప్పటి నుంచి స్వదేశీ చట్టాలే కొనసాగుతాయని స్పష్టం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే వీటిని రూపొందించినట్టు తెలిపారు. పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాక ఇవి ఆదర్శంగా నిలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని ఎన్నో వర్గాలకు న్యాయం జరిగే విధంగా వీటిని రూపొందించినట్టు వివరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి