అన్వేషించండి

KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు - ఆ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం

Telangana News: మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ కమిషన్ ఏర్పాటు రద్దు చేయాలంటూ ఆయన వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది. విచారణ కొనసాగించవచ్చని పేర్కొంది.

BRS Chief Kcr Petition Dismissed: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌‍కు (KCR) షాక్ తగిలింది. విద్యుత్ కమిషన్ ఏర్పాటును రద్దు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ పిటిషన్‌లో పేర్కొనగా.. నిబంధనల మేరకే విద్యుత్ కమిషన్ వ్యవహరిస్తోందని ఏజీ తెలిపారు. కేసీఆర్ పిటిషన్‌కు విచారణార్హత లేదని వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం.. ఏజీ వాదనలతో ఏకీభవించింది. కేసీఆర్ పిటిషన్ కొట్టేస్తూ.. విద్యుత్ కమిషన్ విచారణ కొనసాగించవచ్చని తెలిపింది.

మార్చి 14న కమిషన్ ఏర్పాటు

బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయంటూ ప్రభుత్వం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి నేతృత్వంలో ఈ ఏడాది మార్చి 14న కమిషన్ వేసింది. యాదాద్రి, భద్రాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ - తెలంగాణ మధ్య విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించి విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్‌కు విచారణ సంఘం నోటీసులు జారీ చేసింది. దీంతో విద్యుత్ కమిషన్ ఏర్పాటును కేసీఆర్ వ్యతిరేకించారు. నిబంధనల మేరకే విద్యుత్ కొనుగోళ్లు జరిగాయని.. కమిషన్ ఏర్పాటు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని అన్నారు. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్స్ పెట్టి మరీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఆ కమిషన్ రద్దు చేయాలని గులాబీ బాస్ హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం సోమవారం తాజాగా తీర్పు వెలువరించింది. పద్ధతి ప్రకారమే విచారణ జరుగుతోందని.. ట్రాన్స్ కో, జెన్ కో అధికారుల్ని కూడా కమిషన్ విచారించిందని.. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపించారు. కేసీఆర్ పిటిషన్‌కు విచారణ అర్హతే లేదని వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం కేసీఆర్ పిటిషన్ కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కొనసాగనుంది.

Also Read: Telangana Politics: 38మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు - మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Embed widget