అన్వేషించండి

Andhra Pradesh : ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభం- ఒకే కుటుంబంలో భర్త, భార్య, కుమార్తెకు పింఛన్ ఇచ్చిన చంద్రబాబు

Chandra Babu: ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే పెంచిన పింఛన్లతోపాటు బకాయిలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేస్తోంది. కార్యక్రమాన్ని పెనుమాకలో చంద్రబాబు ప్రారంభించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో హామి ఇచ్చినట్టుగానే ఆంధ్రప్రదేశ్‌లో పెంచిన సామాజిక పింఛన్లు పంపిణీ ప్రారంభమైంది. ఉదయం ఆరు గంటలకే లబ్ధిదారుల ఇంటికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్లు అందజేశారు. వారితో మాట్లాడి వారి కుటుంబ స్థితిగతులు తెలుసుకున్నారు. ఆ డబ్బులను వారు ఎలా ఉపయోగిస్తున్నారో అడిగారు. వారితో సుమారు అరగంట పాటు మాట్లాడారు. అనంతరం పింఛన్ డబ్బులను నేరుగా అందజేసి సచివాలయ సిబ్బందితో అధికారిక కార్యక్రమాలు పూర్తి చేశారు. 

ఉండవల్లి నివాసం నుంచి ఉదయం 5.45కి బయల్దేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు పెనుమాక గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఇద్దరు లబ్ధిదారులకు 6.20 గంటలకు ఎన్టీఆర్ భరోసా పింఛన్‌ అందజేశారు. ఎస్టీ కాలనీలోని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా అందివ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. 
లబ్ధిదారులతో మాట్లాడిన చంద్రబాబు... పిల్లలను బాగా చదివించాలని అప్పుడే కుటుంబాలు బాగుపడతాయని సూచించారు. అలా చేయకుంటే వచ్చే జనరేషన్ కూడా పేదరికంలో ఉండిపోతుందన్నారు. రెండు కుటుంబాలతో చాలా సేపు మాట్లాడిన చంద్రబాబు వారి పిల్లలతో కూడా ముచ్చటించారు. బాగా చదువుకోవాలని సూచించారు. 

గుంటూరు జిల్లా పెనుమాకలోని ఎస్టీ కాలనీలో నివాసం ఉంటున్న బాణావత్‌ పాములు నాయక్‌ కుటుంబానికి చంద్రబాబు పింఛన్ అందజేశారు. పాముల నాయక్‌కు వృద్ధాప్య పింఛన్‌, ఆయన భార్యకి కూడా రాజధానిలో భూమిలేని వారికి ఇచ్చే పింఛన్‌,  కూతురు సాయికి వింతంతు పింఛన్ అందజేశారు. 

పింఛన్ పంపిణీ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామంలోని మసీదు సెంటర్‌లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పింఛన్‌తోపాటు మూడు నెలల బకాయిలను కూడా అందజేసినట్టు చెప్పారు. ప్రతి కుటుంబం తమ పిల్లలను చదివించుకుంటే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు చంద్రబాబు. తాను తొలి పింఛన్ ఇచ్చిన కుటుంబానికి ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. చుట్టూ పక్కా భవనాలు ఉంటే ఈ ఒక్క కుటుంబం మాత్రం పూరిగుడిసెలో ఉందన్నారు. అందుకే వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget