అన్వేషించండి

YS Jagan On Train Accident: విజయనగరంలో రైలు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం

YS Jagan ex-gratia for Train Accidnt Victims: విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

YS Jagan ex-gratia Rs 10 Lakh over Train Accident:

అమరావతి: విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైలు ప్రమాదం మృతుల్లో ఏపీ వారికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ.2 లక్షల సహాయం అందించనున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ఈ ప్రమాదంలో ఇతర రాష్ట్రాలకు చెందినవారు మరణిస్తే వారి కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడ్డవారికి రూ 50వేల చొప్పున సహాయం అందించనున్నారు. 

విశాఖపట్నం నుంచి రాయగడ వెళ్తున్న ప్యాసింజర్‌ రైలు.. అదే లైనులో సిగ్నల్ కోసం వేచి ఉన్న విశాఖ - పలాస రైలును ఢీకొట్టడంతో విషాదం చోటుచేసుకుంది. రెండు రైళ్లు ఢీకొన్న ఈ ప్రమాదంలో కనీసం ఏడుగురు ప్రయాణికులు మృతిచెందారు. గాయపడ్డ వారిని అంబులెన్స్ లలో విశాఖ, విజయనగరం ఆసుపత్రులకు తరలిస్తున్నారు రైలు ప్రమాదంలో బాధితులకు వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. 

విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లినుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని, మంచి వైద్య అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్య, పోలీసు, రెవిన్యూ సహా ఇతర ప్రభుత్వ శాఖలు సమన్వయంతో వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు సత్వర వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం జగన్ ఆదేశాలు జారీచేశారు. ఘటన సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

ఏపీ హోం మంత్రి తానేతి వనిత దిగ్భ్రాంతి..
కొవ్వూరు: విజయనగరం సమీపంలో రైలు ప్రమాద ఘటనపై మంత్రి తానేటి వనిత తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.. ఇంకా వేగంగా సేవలు అందించేందుకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు వెళ్లాలని అధికారులకు హోంమంత్రి ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని, సాధ్యమైనంత త్వరగా అంబులెన్స్ లను ఘటనా స్థలానికి పంపి బాధితులను ఆసుపత్రులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న నేతలు.. 
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎస్పీ దీపికా, స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. విశాఖపట్నం- రాయ్ పూర్ మార్గంలో ప్యాసింజర్ రైళ్లను సోమవారం రద్దు చేశారు. కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లను దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.

రైలు ప్రమాద బాధితుల సహాయం కోసం, సమాచారం అందించడం కోసం విజయనగరం కలెక్టర్ స్ నాగలక్ష్మి కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు.
- బాధితుల సహాయ సమాచారం కోసం కలెక్టర్ కార్యాలయంలో 9493589157 తో హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు
- బాధితుల సహాయ సమాచారం కోసం ఏర్పాటు చేసిన రైల్వే హెల్ప్ లైన్ నంబర్ 8978080006 కు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు అని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి సూచించారు.

రాయగడ ఎస్ ప్రెస్ రైల్ ప్రమాదం ఘటనపై విశాఖ రైల్వే స్టేషన్ లో హెల్ప్ లైన్ ఏర్పాటు.
హెల్ప్ లైన్ నెంబర్లు ఇవే
0891 2746330, 08912744619
ఎయిర్ టెల్
81060 53051
8106053052
బీఎస్ ఎన్ ఎల్ 
8500041670
8500041671

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

GV Reddy Effect: జీవీ రెడ్డి రాజీనామా ఎఫెక్ట్‌- ఏపీ ఫైబర్‌ నెట్‌ ఎండీ దినేష్‌ బదిలీ
జీవీ రెడ్డి రాజీనామా ఎఫెక్ట్‌- ఏపీ ఫైబర్‌ నెట్‌ ఎండీ దినేష్‌ బదిలీ
SLBC Tunnel : SLBC నిర్మాణంలో ఆది నుంచి నిర్లక్ష్యమే, పాలకుల తప్పునకు కార్మికులకు శిక్ష!
SLBC నిర్మాణంలో ఆది నుంచి నిర్లక్ష్యమే, పాలకుల తప్పునకు కార్మికులకు శిక్ష!
GV Reddy Resign: టీడీపీకి షాకిచ్చిన జీవీ రెడ్డి - పార్టీకి, పదవికి రాజీనామా - ఫైబర్ నెట్ వివాదంలో ఏం జరిగింది
టీడీపీకి షాకిచ్చిన జీవీ రెడ్డి - పార్టీకి, పదవికి రాజీనామా - ఫైబర్ నెట్ వివాదంలో ఏం జరిగింది
Good news for AP Mirchi farmers: మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం
మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Minister Narayana Team in Maha Kumbh 2025 | పుష్కరాల కోసం మహాకుంభమేళాలో అధ్యయనం | ABP DesamGV Reddy Resign AP Fibernet Chairman | ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీరెడ్డి రాజీనామా | ABP DesamBJP MLC Candidate Anji Reddy Interview | కిషన్ రెడ్డి ప్రచారం చేసేంత ప్రాధాన్యత అంజిరెడ్డికి ఎందుకు?Tesla Company for Andhra Pradesh | ఎలన్ మస్క్ కార్ల కంపెనీ ఆంధ్ర ప్రదేశ్ కు వస్తోందా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GV Reddy Effect: జీవీ రెడ్డి రాజీనామా ఎఫెక్ట్‌- ఏపీ ఫైబర్‌ నెట్‌ ఎండీ దినేష్‌ బదిలీ
జీవీ రెడ్డి రాజీనామా ఎఫెక్ట్‌- ఏపీ ఫైబర్‌ నెట్‌ ఎండీ దినేష్‌ బదిలీ
SLBC Tunnel : SLBC నిర్మాణంలో ఆది నుంచి నిర్లక్ష్యమే, పాలకుల తప్పునకు కార్మికులకు శిక్ష!
SLBC నిర్మాణంలో ఆది నుంచి నిర్లక్ష్యమే, పాలకుల తప్పునకు కార్మికులకు శిక్ష!
GV Reddy Resign: టీడీపీకి షాకిచ్చిన జీవీ రెడ్డి - పార్టీకి, పదవికి రాజీనామా - ఫైబర్ నెట్ వివాదంలో ఏం జరిగింది
టీడీపీకి షాకిచ్చిన జీవీ రెడ్డి - పార్టీకి, పదవికి రాజీనామా - ఫైబర్ నెట్ వివాదంలో ఏం జరిగింది
Good news for AP Mirchi farmers: మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం
మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ - కనీస ధర రూ. 11,781కి కొనుగోలు చేయాలని నిర్ణయం
India In Semi Final: సెమీస్ లో ఇండియా, న్యూజిలాండ్.. బంగ్లా ప‌రాజ‌యంతో ఇరుజ ట్లు నాకౌట్ కు.. టోర్నీ నుంచి పాక్, బంగ్లా ఔట్
సెమీస్ లో ఇండియా, న్యూజిలాండ్.. బంగ్లా ప‌రాజ‌యంతో ఇరు జట్లు నాకౌట్ కు.. టోర్నీ నుంచి పాక్, బంగ్లా ఔట్
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి మరిన్ని చిక్కులు - గన్నవరంలో చేసిన అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం నియామకం
వల్లభనేని వంశీకి మరిన్ని చిక్కులు - గన్నవరంలో చేసిన అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం నియామకం
Revanth Reddy Hot Comments: మెట్రో విస్తరణ, మూసి అభివృద్ధి అడ్డుకుంది కిషన్‌రెడ్డేనని కేంద్రమంత్రులే చెప్పారు: రేవంత్ సంచలన ఆరోపణలు
మెట్రో విస్తరణ, మూసి అభివృద్ధి అడ్డుకుంది కిషన్‌రెడ్డేనని కేంద్రమంత్రులే చెప్పారు: రేవంత్ సంచలన ఆరోపణలు
YS Jagan: మరో 30 ఏళ్లు రాజకీయాలు చేస్తా - పార్టీ నేతలకు జగన్  భరోసా
మరో 30 ఏళ్లు రాజకీయాలు చేస్తా - పార్టీ నేతలకు జగన్ భరోసా
Embed widget