![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
AP CM YS Jagan: మంత్రి రోజాకు క్రికెట్ ఎలా ఆడాలో నేర్పిన జగన్ - ‘ఆడుదాం ఆంధ్ర’లో సరదా వీడియో
CM Jagan News: గుంటూరు నల్లపాడు లయోలా ప్రాంగణంలో జగన్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం (డిసెంబర్ 26) ప్రారంభించారు.
![AP CM YS Jagan: మంత్రి రోజాకు క్రికెట్ ఎలా ఆడాలో నేర్పిన జగన్ - ‘ఆడుదాం ఆంధ్ర’లో సరదా వీడియో AP CM Jagan Mohan Reddy Teaching Cricket To Minister Roja AP CM YS Jagan: మంత్రి రోజాకు క్రికెట్ ఎలా ఆడాలో నేర్పిన జగన్ - ‘ఆడుదాం ఆంధ్ర’లో సరదా వీడియో](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/26/f4a0892b7438bce959bed32c446d6e841703598376801234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Adudam Andhra Videos: ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ క్రికెట్ ఆడారు. ఎప్పుడూ ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉంటూ, వివిధ చోట్లకు వెళ్తూ ఉండే ఆయన ఒక్కసారిగా బ్యాట్ పట్టేసరికి అందరూ ఆశ్చర్యంగా చూశారు. గుంటూరు నల్లపాడు లయోలా ప్రాంగణంలో జగన్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం (డిసెంబర్ 26) ప్రారంభించారు. జగన్ కు వైసీపీ నేత, స్పోర్ట్స్ అథారటీ (శాప్) ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి బౌలింగ్ చేశారు. అక్కడే మంత్రి రోజా కూడా ఉండి తాను కూడా బ్యాటింగ్ చేయడానికి ఉత్సాహం చూపారు. రోజా కూడా బ్యాట్ పట్టుకొని బరిలోకి దిగగా.. ఆమెకు ఎలా బ్యాట్ పట్టుకోవాలో జగన్ చూపించారు. బ్యాటింగ్ ఎలా చేయాలో జగన్ సూచనలు ఇచ్చారు.
ఆ తర్వాత జగన్ వాలీబాల్ కోర్టుకు కూడా వెళ్లారు. అక్కడ వాలీబాల్ ఆటగాళ్లతో కలిసి బాల్ ను విసిరి ఆటను ప్రారంభించారు. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చేపడుతోంది. జగన్ క్రికెట్ పట్టిన సందర్భంలో తోటి మంత్రులు రోజా, విడదల రజినీ, అంబటి రాంబాబు పక్కనే ఉన్నారు. అధికార యంత్రాగం కూడా సంబరంగా చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా కనిపించారు.
Minister Roja ki cricket nerpistunna CM jagan. #Coach pic.twitter.com/c3uLZiwERZ
— Hanu (@HanuNews) December 26, 2023
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)