Top Headlines Today: పోలవరం ప్రాజెక్టు పరిశీలించిన చంద్రబాబు - తప్పుడు రాతలతో దెబ్బతీయలేరన్న హరీష్ రావు
AP Telangana Latest News 17 June 2024: నేటి ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టాప్ హెడ్ లైన్స్ మీకోసం.. ఒక్క క్లిక్ చేసి 5 ప్రధాన వార్తలు చదవండి.
Andhra Pradesh News Today | పోలవరం చేరుకున్న సీఎం చంద్రబాబు- ప్రాజెక్టు పరిశీలిస్తూ అధికారులతో సమీక్ష
పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్న చంద్రబాబు నేరుగా వెళ్లి పరిశీలించారు. అనుకున్నట్టుగానే ఉదయం 11 గంటలకు విజయవాడ నుంచి పోలవరం చేరుకున్నారు. హెలికాప్టర్‌లో అక్కడకు చేరుకున్న చంద్రబాబు... నేరుగా పోలవరం సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. కొన్నేళ్లుగా సాగుతున్న పనుల గుర్తించి అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు- జనసేనకు డిప్యూటీ- పోటీలో బొలిశెట్టి, మండలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగమైన జనసేనకు మరో కీలక పదవి వరించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రివర్గంలో జనసేనకు సముచిత స్థానం కల్పించారు. మూడు మంత్రిపదవులు ఇచ్చారు. పవన్ కల్యాణ్‌కి ఉప ముఖ్యమంత్రి చేశారు. ఈ క్రమంలోనే మరో కీలకమైన బాధ్యతను జనసేన నేతలకు అప్పగించాలని చంద్రబాబు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో జనసేన 21 ఎమ్మెల్యే స్థానాల్లో విజయం సాధించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తప్పుడు రాతలతో నిజాయితీని దెబ్బతీయొద్దు- లేకు చర్యలు తప్పవు- మీడియాకు హరీష్ స్వీట్ వార్నింగ్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని, పార్టీ మారుతున్నారని హరీష్‌రావుపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తమ నాయుడు కేసీఆర్ చెప్పిన పని చేసుకుంటూ వెళ్లడమే తనకు తెలుసన్నారు. వ్యూస్ కోసం, లైక్స్ కోసం ఇలాంటి తప్పుడు రాతలు రాస్తే ఇకపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తూ మాజీ మంత్రి హరీష్‌రావు బీఆర్‌ఎస్ కార్యాలయంలో ప్రెస్‌మీట్ పెట్టారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్, ధ్రువపత్రాల పరిశీలనకు 24 వేలమంది ఎంపిక - షెడ్యూలు ఇదే
తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాలకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ధ్రువపత్రాల పరిశీలనకు మొత్తం 24,030 అభ్యర్థులు ఎంపికయ్యారు. అంటే పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1: 3 నిష్పత్తిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎంపిక చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కంచెల నుంచి తాడేపల్లి వాసులకు విముక్తి- బారికేడ్లు తొలగించిన పోలీసులు
వైసీపీ అధినేత జగన్ ఇంటికి సమీపంలోని రోడ్డుపై ఉన్న ఆంక్షలు ప్రభుత్వం ఎత్తివేసింది. ఇకపై ఆక్కడ ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చని స్పష్టం చేసింది. దీంతో ఉదయాన్ని రోడ్డుపై ఉన్న బారికేడ్లను పోలీసులు తొలగించారు. రాకపోకలకు మార్గాన్ని సుగుమం చేశారు. ఉండవల్లి నుంచి మంగళగిరి వెళ్లేందుకు ఉన్న రోడ్డును జగన్ సీఎం అయ్యాక మూసివేయించారు. ఎన్నో ఏళ్ల నుంచి ఆ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు ఈ నిర్ణయంతో ఇబ్బందులు పడ్డారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి