అన్వేషించండి

Chandra Babu: పోలవరం చేరుకున్న సీఎం చంద్రబాబు- ప్రాజెక్టు పరిశీలిస్తూ అధికారులతో సమీక్ష

Polvaram : సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు ఆరేళ్ల తర్వాత పోలవరం ప్రాజెక్టు సందర్శించారు. అక్కడ ప్రాజెక్టులో జరుగుతున్న పనులు, నిర్వాసితులకు అందిన సాయంపై అధికారులతో మాట్లాడనున్నారు.

Andhra Pradesh news: పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్న చంద్రబాబు నేరుగా వెళ్లి పరిశీలించారు. అనుకున్నట్టుగానే ఉదయం 11 గంటలకు విజయవాడ నుంచి పోలవరం చేరుకున్నారు. హెలికాప్టర్‌లో అక్కడకు చేరుకున్న చంద్రబాబు... నేరుగా పోలవరం సందర్శించారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. కొన్నేళ్లుగా సాగుతున్న పనుల గుర్తించి అడిగి తెలుసుకున్నారు. 

సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత జలవనరుల శాఖాధికారులతో సమావేశమై పోలవరం పురోగతి గురించి అడిగారు. వారి ఇచ్చిన సమాధానాలపై సంతృప్తి చెందని చంద్రబాబు.. నేరుగా పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తామన్నారు. అంతే కాకుండా ప్రతి సోమవారం పోలవారంగా మార్చాలని ఎప్పటికప్పుడు అప్‌డేట్ తనకు ఇవ్వాలని సూచించారు. 

సాయంత్రం వరకు పోలవరం ప్రాజెక్టు వద్దే చంద్రబాబు ఉంటారు. అక్కడే భోజనం చేసి ప్రాజెక్టు పురోగతి, నిర్వాసితుల ప్రాజెక్టు అంశంపై అధికారులతో మాట్లాడనున్నారు. కొట్టుకుపోయిన మేజర్ కట్టడాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంపై కూడా చర్చిస్తారు. రాబోయే రోజుల్లో వరదలు భారీగా వచ్చే ఛాన్స్ ఉన్నందున ఆ టైంలో కూడా పనులు ఆగకుండా ఎలాంటి జాగ్రత్తలతో కొనసాగించాలనే విషయంపై కూడా చర్చలు జరపనున్నారు. 

2020లో వచ్చిన వరదల కారణంగా కీలకమైన కట్టడాలు కొట్టుకుపోయాయి. దీంతో ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వం కూడా దీనిపై సీరియస్‌గా దృష్టి పెట్టలేదని అంటారు. తాము అధికారం నుంచి దిగే సరిరిక అంటే 2019 నాటికి 75 శాతం పనులు పూర్తి చేశామని టీడీపీ చెబుతోంది. చిత్తశుద్ది ఉండిఉంటే మాత్రం ఈపాటికి పోలవరం పూర్తి అయ్యేదని అంటున్నారు. 

సాయంత్రం వరకు పోలవరం వద్దే ఉండబోతున్న చంద్రబాబు మూడు గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. రెండు గంటలకు అధికారులు, ప్రాజెక్టు నిర్వాహకులతో సమీక్ష చేస్తారు. అక్కడ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు ఏ పరిస్థితిలో ఉందో ప్రజలకు తెలియజేసేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 3 గంటలకు నిర్వహించే సమావేశంలో కీలకమైన విషయాలు ప్రజలకు తెలియజేయన్నారు. 

నిర్వాసితుల విషయంలో కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కొందరు నిర్వాసితులను అక్కడి నుంచి తరలించారు. మరికొంతమందిని తరలించాల్సి ఉంది. వారికి సరైన ప్యాకేజీ ఇచ్చి వారిని ఒప్పించి అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు షిప్టు చేయాల్సి ఉంటుంది. వారి ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేంద్రం చెబుతోంది. అంత బడ్జెట్ లేదని... పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా ఉన్నందున కేంద్రమే భరించాలని వాదిస్తోంది. దీంతో ఈవిషయం 2014 నుంచి పెండింగ్‌లో ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget