Top Headlines Today: చంద్రబాబు 5 సంతకాలకు ఏపీ కేబినెట్ ఆమోదం, కాంగ్రెస్ తలవంచక తప్పదని కేటీఆర్ వార్నింగ్ - నేటి టాప్ న్యూస్
Andhra Pradesh Telangana Latest News 24 June 2024: నేటి ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టాప్ హెడ్ లైన్స్ మీకోసం.. ఒక్క క్లిక్ చేసి 5 ప్రధాన వార్తలు చదవండి.
ఢిల్లీలో రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలు - కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్
తెలంగాణ సీఎం , పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఆయన కంటే ముందే పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీ వెళ్లారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెండింగ్ లో ఉన్న కీలకమైన అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు హైకమాండ్ ఆమోదం కోసం రేవంత్ రెడ్డి ఢిల్లీ వచ్చారు. మంత్రివర్గంలో ఇంకా ఆరు ఖాళీలు ఉన్నాయి. కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఈ క్రమంలో కేబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాల్లో నాలుగైదు స్థానాలను భర్తీ చేసేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
సీఎం చంద్రబాబు 5 సంతకాలకు మంత్రివర్గం ఆమోదం - ఏపీ తొలి కేబినెట్ భేటీ నిర్ణయాలివే
ఏపీ కేబినెట్ తొలి భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై పలు అంశాలపై చర్చించింది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా ఇతర శాఖల మంత్రులు హాజరయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
అధికార బలం కంటే ప్రజాబలం గొప్పది- కాంగ్రెస్ తలవంచక తప్పదు- కేటీఆర్ సీరియస్ వార్నింగ్
తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అధికారంలో ఉన్న వారి బలం కంటే ప్రజల బలం గొప్పదని అన్నారు. రోజుకో ఎమ్మెల్యే కారు దిగిపోయి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. బీఆర్‌ఎస్‌కు 2004-06 మధ్య ఇలాంటి ఎమ్మెల్యే ఫిరాయింపులు చాలా ఎదుర్కొన్నామన్నారు కేటీఆర్. ప్రజాస్వామ్యంలో ప్రజల శక్తి ఎప్పుడు అధికారంలో ఉన్నవారి కన్నా బలంగా ఉంటుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలుగులో ప్రమాణం చేసిన కేంద్రమంత్రి రామ్మోహన్- సైకిల్‌పై పార్లమెంట్‌కు వెళ్లిన అప్పలనాయుడు
తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నికై పార్లమెంట్‌లో అడుగు పెట్టిన ఎంపీలు తెలుగులోనే ప్రచారం చేశారు. 18వ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి కేంద్రమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన ఐదుగురు కూడా ఇవాళ ఎంపీలుగా లోక్‌సభలో ప్రమాణం చేశారు. మొదట కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రమాణ చేశారు. అనంతరం రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాసవర్మతో ప్రొటెం స్పీకర్ బర్తృహరి ప్రమాణం చేయించారు. వీళ్లంతా అచ్చ తెలుగులోనే ప్రమాణం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.14 లక్షల కోట్లు - కేబినెట్ ముందుకు ఆర్థిక శాఖ ప్రాథమిక నివేదిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై ఆర్థిక శాఖ కీలక నివేదిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ అన్నీ కలుపుకొని రూ.14 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లు రాష్ట్ర కేబినెట్ (AP Cabinet) ముందు ప్రాథమిక నివేదిక ఉంచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో సోమవారం మంత్రివర్గం తొలిసారిగా సమావేశమైంది. ఈ భేటీలో సూపర్ సిక్స్ పథకాల అమలుపై చర్చించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి