Andhra Pradesh News: తెలుగులో ప్రమాణం చేసిన కేంద్రమంత్రి రామ్మోహన్- సైకిల్‌పై పార్లమెంట్‌కు వెళ్లిన అప్పలనాయుడు
Lok Sabha : ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు ఎంపీలు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఒకరు కేంద్రమంత్రి రామ్మోహన్ అయితే ఇంకొంకరు విజయనగరం ఎంపీ అప్పలనాయుడు
Ram Mohan Naidu And Kishan Reddy: తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్నికై పార్లమెంట్‌లో అడుగు పెట్టిన ఎంపీలు తెలుగులోనే ప్రచారం చేశారు. 18వ లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి కేంద్రమంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన ఐదుగురు కూడా ఇవాళ ఎంపీలుగా లోక్‌సభలో ప్రమాణం చేశారు.
మొదట కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రమాణ చేశారు. అనంతరం రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బండి సంజయ్, భూపతిరాజు శ్రీనివాసవర్మతో ప్రొటెం స్పీకర్ బర్తృహరి ప్రమాణం చేయించారు. వీళ్లంతా అచ్చ తెలుగులోనే ప్రమాణం చేశారు.
మంత్రులుగా ఉన్న ఎంపీలే కాకుండా ఇతర ఎంపీలు కూడా కొందరు తెలుగులో ప్రమాణం చేశారు. శ్రీభరత్, అప్పలనాయుడు, పురందేశ్వరి, బాలశౌరి, కేశినేని చిన్ని, శ్రీకృష్ణ దేవరాయలు తెలుగులోప్రమాణం చేశారు. మిగతా వాళ్లంతా ఇంగ్లిష్, హిందీలో ప్రమాణం చేశారు.
తొలిరోజు లోక్‌సభకు హాజరైన మంత్రి కిషన్ రెడ్డి, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు పంచెకట్టులో సభకు హాజరయ్యారు. తొలిసారిగా లోక్‌సభలోఅడుగు పెట్టిన విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు సైకిల్‌పై చేరుకున్నారు. సభా ప్రాంగణానికి నమస్కరించుకొని సభలోకి ప్రవేశించారు. కేంద్రమంత్రుల ప్రమాణం తర్వాత మొదట ప్రమాణం చేసింది అప్పలనాయుడే.