India Pak War : ఇక ఉగ్రవాద చర్యలన్నీ యుద్ధ చర్యలుగానే పరిగణన - భారత్ సంచలన నిర్ణయం
Act of war: ఉగ్రవాదాన్ని ఇకపై యుద్ధంగానే పరిగణించాలని భారత్ నిర్ణయించింది. ఆ దిశగానే చర్యలు తీసుకోనున్నారు.

Act of terror will be considered an act of war : భారత్‌లో ఇకపై ఏ ఉగ్రవాద చర్య భారత్ లో జరిగినా అది Act of War కింద పరిగణించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వ వర్గాలుచెబుతున్నాయి. వెంటనే దానిపై రియాక్ట్ అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో జరిగిన అత్యున్న స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Any future 'act of terror' will be considered an 'act of war' against India: Top govt sources
— ANI Digital (@ani_digital) May 10, 2025
Read @ANI Story | https://t.co/Wf5qjlhjdZ#India #Pakistan #Government pic.twitter.com/nyqakphVQv
ఈ నిర్ణయం ద్వారా భారతదేశంలో ఏదైనా ఉగ్రవాద దాడి జరిగితే దానిని యుద్ధంగా పరిగణిస్తామని భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు స్పష్టమైన సందేశం ఇచ్చినట్లయింది. భవిష్యత్తులో జరిగే ఏదైనా ఉగ్రవాద చర్యను భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధ చర్యగా పరిగణిస్తామని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. భారతదేశంలో పాకిస్తాన్ ఏదైనా ఉగ్రవాద దాడి చేస్తే, దానిని యుద్ధంగా పరిగణించి అదే రీతిలో స్పందించనుంది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ TRF ఉగ్రవాదులు 26 మందిని చంపేశారు. భారత్ ఉగ్రవాదులపై దాడి చేస్తే.. పాకిస్తాన్ భారత్ పై దాడులు చేస్తోంది.
పశ్చిమ సరిహద్దులో డ్రోన్లు, లాంగ్ రేంజ్ ఆయుధాలు ,యుద్ధ విమానాలను ఉపయోగించి పౌర ప్రాంతాలను, సైనిక మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతోదంి. పాకిస్తాన్ చేసిన రెచ్చగొట్టే చర్యను సమర్థవంతంగా తిప్పికొట్టామని భారత సైన్యం శనివారం తెలిపింది. పాకిస్తాన్ తన దళాలను సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తోంది. ఇది పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చడానికి కారాణం అవుతోంది. అందుకే భారత సైన్యం కూడా పూర్తి కార్యారణకు సిద్ధం అవుతోంది.
Any future act of terror will be treated as an act of war against India.
— Anil K Antony (@anilkantony) May 10, 2025
The initial escalation came in the form of an unprovoked, brutal, state-sponsored terrorist attack targeting innocent civilians in Pahalgam. Indian army has so far responded in a measured and non escalatory… https://t.co/rmmITsASzm pic.twitter.com/e4j86I0lFL
భారత సైన్యం ఇప్పటికే ఉన్నత స్థాయి సన్నద్ధతలో ఉంది, ఈ నిర్ణయం సైనిక బలగాలకు ఏ ఆలస్యం లేకుండా ప్రతిస్పందించే అధికారాన్ని ఇస్తుంది. “అన్ని శత్రు చర్యలను సమర్థవంతంగా ఎదుర్కొని, సముచితంగా ప్రతిస్పందిస్తున్నాయి” అని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ప్రకటించారు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయం ఉగ్రవాద గ్రూపులకు మద్దతు ఇవ్వడం లేదా వాటిని ప్రోత్సహించడం వంటి చర్యలు పాకిస్తాన్ చేపడితే నేరుగా సైనిక చర్య చేపట్టవచ్చు. ఈ నిర్ణయం భారత్ యొక్క దౌత్యపరమైన స్థానాన్ని బలోపేతం చేస్తుంది. ఈ విధానం అంతర్గత భద్రతను బలోపేతం చేయడానికి దారితీస్తుంది, ఇందులో జమ్మూ కాశ్మీర్, పంజాబ్ వంటి సరిహద్దు ప్రాంతాలలో సైనిక శక్తి పెంపు, ఇంటెలిజెన్స్ . సరిహద్దు రక్షణ వ్యవస్థల్ని బలోపేతం చేసుకుంటుంది.





















