Pakistan earthquake : పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ - హెచ్చరిస్తున్న ప్రకృతి - భారీ భూకంపంతో భయం భయం
Pakistan: పాకిస్తాన్ కు కష్టాలు చుట్టుముట్టాయి. వరుసగా భూప్రకంపనలతో ఆ దేశం భయపడిపోతోంది. గత రెండు రోజుల్లో నాలుగు భూ ప్రకంపనలు వచ్చినట్లుగా తెలుస్తోంది.

Pakistan hit with earthquakes: ఓ వైపు సరిహద్దుల్లో భారత్ తో ఘర్షణ పెట్టుకుని ఆ మంట ఆర్పుకోవడానికి కిందా మీదా పడుతున్న పాకిస్తాన్ కు వరుస భూకంపాలు సమస్యగా మారాయి. ఇటీవలి కాలంలో నాలుగు భూకంపాలు వచ్చాయి. శనివారం తెల్లవారుజామున కూడా భూకంపం వచ్చిటన్లుగా తెలుస్తోంది. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్, పంజాబ్, సింధ్, పాక్ ఆక్రమిత కశ్మీర్ వంటి ప్రాంతాల్లో భూకంపాల వచ్చాయి. గత 30 రోజులలో, పాకిస్తాన్‌లో 2.0 మాగ్నిట్యూడ్‌కు పైగా 25 భూకంపాలు నమోదయ్యాయి. వీటిలో అత్యధిక తీవ్రత 5.7 మాగ్నిట్యూడ్‌తో ఏప్రిల్ 19, 2025న ఆఫ్ఘనిస్తాన్‌లోని అష్కాషమ్ సమీపంలో సంభవించింది.
An earthquake with a magnitude of 4.0 on the Richter Scale hit Pakistan at 01.44 am (IST) today: National Center for Seismology (NCS) pic.twitter.com/zAuDQQ2WRQ
— ANI (@ANI) May 9, 2025
తాజాగా శనివారం తెల్లవారుజాము 1:44 గంటలకు పాకిస్తాన్‌లో 4.0 మాగ్నిట్యూడ్ తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) ప్రకారం ఈ భూ కంపం వల్ల ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం నమోదు కాలేదు ఈ భూకంపం ఎక్కువ లోతు లేనిది కావడంతో ఉపరితలంపై ఎక్కువ ప్రభావం చూపుతాయి, కానీ ఈ భూకంపం తీవ్రత సాపేక్షంగా తక్కువగా ఉండటం పెద్ద నష్టం జరగలేదని భావిస్తున్నారు.
మే 5, 202 4.2 మాగ్నిట్యూడ్ భూకంపం, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలోని చిత్రాల్ జిల్లా సమీపంలో, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వద్ద సంభవించింది. ఈ భూకంపం వల్ల కూడా నష్టం నమోదు కాలేదు, కానీ స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గత 25 సంవత్సరాలలో, పాకిస్తాన్‌లో సగటున సంవత్సరానికి 314 భూకంపాలు నమోదవుతున్నాయి, వీటిలో 4.0 మాగ్నిట్యూడ్‌కు పైగా 172, 5.0 మాగ్నిట్యూడ్‌కు పైగా 11.8 భూకంపాలు ఉన్నాయి. 7.0 మాగ్నిట్యూడ్‌కు పైగా భూకంపాలు సగటున ప్రతి 7.8 సంవత్సరాలకు ఒకసారి సంభవిస్తాయి.
2005లో సంభవించిన 7.6 మాగ్నిట్యూడ్ భూకంపం 74,000 మంది మరణాలకు కారణమైంది, ఇది అత్యంత వినాశకరమైన భూకంపాలలో ఒకటి. 1945లో 8.1 మాగ్నిట్యూడ్ భూకంపం తుర్బత్ సమీపంలో సంభవించింది, ఇది 1900 నుండి అత్యంత తీవ్రమైనది. తాజా భూకంపం తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ, పాకిస్తాన్‌లోని భూకంప ప్రమాదం ఎప్పటికీ ఉంటుంది. లోతులేని భూకంపాలు తరచూ ఆఫ్టర్‌షాక్‌లకు దారితీస్తాయి.
అయితే ఈ భూప్రకంపనలను కొంత మంది భారత్ చేసిన దాడులే కారణం అని చెబుతున్నారు కానీ ఎలాంటి ఆధారాలు లేవు.
BIG BREAKING: India has launched a crushing strike on Pakistan's Kahuta nuclear facility! Brigadier Raja Rizwan executed for espionage, he provided information about Kahuta and GHQ to the CIA Game over Earthquake in Rawalpindi #OperationSindoor3 begins! 🔥 India's decisive… pic.twitter.com/UN0vRTMAKA
— Shivlal Patel (@shivlalpatel18) May 10, 2025





















