Pakistan Woman MP: ఇలాగైతే ఎలా గెలుస్తారు - పాక్ ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుకున్న మహిళా ఎంపీ - వైరల్ వీడియో
Pakistan parliament: పాకిస్తాన్ మహిళా ఎంపీ తమ ప్రభుత్వాన్ని పార్లమెంట్ లో కడిగి పారేశారు. యుద్ధ సన్నద్ధత లేకుండా ఎలా గెలుస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు.

Pakistani female MP: పాకిస్తాన్ ప్రభుత్వంపై అక్కడి ప్రజల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. పార్లమెంట్ ఎంపీలు ప్రభుత్వాన్ని చెడుగుడు ఆడుకుంటున్నారు. తాజాగా మహిళా ఎంపీ జరీన్ రియాజ్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆమె పాకిస్తాన్ పార్లమెంట్‌లో జరిగిన చర్చలో ఖ్వాజా ఆసిఫ్ చేతకాని తనాన్ని ప్రశ్నించారు. ప్రధానంగా భారత్-పాకిస్తాన్ మధ్య ఇటీవలి ఉద్రిక్తతలు, ముఖ్యంగా పహల్గాం దాడి , "ఆపరేషన్ సింధూర్" సందర్భంలో పాకిస్తాన్ రక్షణ వైఫల్యాలపై ఆమె ప్రభుత్వాన్ని నిలదీశారు.
"पाक संसद में हंगामा!
— Ashish Paswan (@ashishpaswan0) May 9, 2025
पाकिस्तान की महिला सांसद ने रक्षा मंत्री ख़्वाजा आसिफ की संसद में कर दी जबरदस्त बेइज्जती!
तेज आवाज़, तीखे शब्द और कड़वा सच — सुनिए इस वायरल वीडियो में क्या बोलीं ये बहादुर सांसद।#PakistanParliament #KhawajaAsif #ViralVideo #BoldMP #IndianNavy pic.twitter.com/cXzGmT8N4l
జరీన్ రియాజ్ తన ప్రసంగంలో తీవ్రమైన స్వరంతో కఠిన సత్యాలు చెప్పారని సోషల్ మీడియాలో ప్రశంసలువస్తున్నాయి. పాకిస్తాన్ సైనిక సామర్థ్యం భారత్‌తో పోలిస్తే బలహీనంగా ఉందని, దీర్ఘకాల యుద్ధంలో పాకిస్తాన్‌కు విజయావకాశాలు తక్కువని ఆమె స్పష్టం చేశారు.
పాకిస్తాన్ సైన్యం బలహీనతలు, ఆర్థిక అస్థిరత, మరియు బలూచిస్తాన్ వంటి అంతర్గత సమస్యలను ఆమె లేవనెత్తినట్లు తెలుస్తోంది. ఈ విషయాలు పాకిస్తాన్ పార్లమెంట్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ज़रा इन मोहतरमा का भी दुखड़ा सुना जाए !
— Rahul Shakya (@RahulShakya90) May 9, 2025
बेचारी को कौन समझाए ! उनका पाकिस्तान कितना खौफ में है,#PakistanParliament #KhawajaAsif #ViralVideo #PoliticalClash #PakistanNews #IndianNavy #IndiaPakistanWar2025 pic.twitter.com/6fHhOQq5sL
విపక్ష పార్టీలకు చెందిన వారు పాకిస్తాన్ ప్రధానిని తప్పు పట్టడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. షహబాజ్ షరీఫ్.. మోదీపేరు ఎత్తడానికి భయపడుతున్నారని మండిపడుతున్నారు. పిరికి ప్రధాని అని విమర్శలు గుప్పిస్తున్నారు.
भारताबद्दल पतंप्रधान नरेंद्र मोदींबद्दल एक वक्तव्य करण्याचं किंवा मोदींचं नाव घेऊन बोलण्याचं धाडस पाकिस्तानी पंतप्रधानांमध्ये का नाही? पाकिस्तानी संसदेत सरकारला मिळाला घरचा आहेर #ModiDominance#PakistanParliament#FearOfModi#indiavspakistan pic.twitter.com/3qPbvKZUyp
— महा MTB (@TheMahaMTB) May 9, 2025
మాజీ సైనికాధికారి అయిన ఎంపీ.. పాకిస్తాన్ ను దేవడే కాపాడాలని కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు ఇప్పటికే వైరల్ అయ్యాయి.
#WATCH |
— DD News Assamese (@ddnews_guwahati) May 8, 2025
Former Pakistani Major #TahirIqbal cries in the #PakistanParliament
'I pray that Allah protects Pakistanis: Tahir Iqbal#OperationSindoor #IndiaPakistanTensions #IndianArmy #IndianAirForce #OperationSindoor2 #Lahore #Pakistan #OperationSindoor pic.twitter.com/KhIvNd5Wd1
ఓ వైపు ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించలేకపోతోంది. ఉగ్రవాదులకు మద్దతుగా లేమని కూడా చెప్పలేకపోతున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ ప్రభుత్వ పరువు తీస్తున్నారు విపక్ష ఎంపీలు. సమాధానం చెప్పలేకపోతోంది అక్కడి ప్రభుత్వం.





















