Pakistan Fear: మనకు 6 లక్షలే వాళ్లకు 16 లక్షలు - గెలవడం సాధ్యం కాదన్న మాజీ పాక్ ఆర్మీ ఆఫీసర్- మరేం చేస్తారు?
Pakistan: యుద్ధం అంటూ జరిగితే భారత్ పై గెలవడం సాధ్యం కాదని మాజీ ఆర్మీ ఆఫీసర్ ఒకరు ఆ దేశ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పాక్ కు ఆరు లక్షల మంది మాత్రమే సైన్యం ఉందని ఆయన గుర్తు చేశారు.

Pakistan 6 Lakh Soldiers: పాకిస్తాన్ కు ఉన్న ఆదాయ వనరులు మాత్రమే కాదు సైనిక వనరులు కూడా పరిమితమేనని పాకిస్తాన్ కు చెందిన వారే బయట పెడుతున్నారు. పాకిస్తాన్ కు కేవలం ఆరు లక్షల మంది మాత్రమే సైన్యం ఉందని కానీ భారత్ పదహారు లక్షల మంది ఉన్నారని పాకిస్తాన్ ఎయిర్ మార్షల్ మసూద్ అఖ్తర్ ఆందోళన వ్యక్తం చేశారు.
पाकिस्तानी सेना के रिटायर्ड अधिकारी बता रहे हैं इंडिया की 16 लाख की सेना के आगे हमारे मात्र 6 लाख सैनिक ज्यादा टिक नहीं पायेंगे।
— Ravi Bhadoria (@ravibhadoria) May 10, 2025
अब तो अमेरिका और चीन ही युद्ध रोककर हमें बचा सकते हैं इंडिया से। pic.twitter.com/RW83rMmrU2
భారత్‌తో పోలిస్తే సైనిక సామర్థ్యంలో గణనీయమైన అంతరం ఉందని ఆయన బయట పెట్టారు. మసూద్ అఖ్తర్ పాకిస్తాన్ నాయకులు కఠిన నిజాలను అంగీకరించాలని హెచ్చరించారు, భారత్‌కు 16 లక్షల సైనికులు ఉండగా, పాకిస్తాన్‌కు కేవలం 6 లక్షల మంది సైనికులు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. ఈ సంఖ్యా తేడా పాకిస్తాన్‌కు భారత్‌తో ఏ రంగంలోనూ సమానంగా పోటీపడే అవకాశం లేకుండా చేస్తుందని, ముఖ్యంగా దీర్ఘకాల యుద్ధంలో అసాధ్యమని ఆయన హెచ్చరించారు.
पाकिस्तानी एयर मार्शल(रि.) मसूद अख्तर ने एक इंटरव्यू में कहा कि हालात चिंताजनक होते जा रहे हैं। हमें सोचना होगा कि आगे क्या करना है। 🤭
— Dilip Kumar Singh (@DilipKu24388061) May 9, 2025
भारत के पास 16 लाख की सेना है और हमारे 6 लाख हमें नहीं बचा सकते। 🤗 pic.twitter.com/XG6GaLi0ip
భారత్-పాకిస్తాన్ మధ్య ఇటీవలి ఉద్రిక్తతలు, ముఖ్యంగా పహల్గాం ఉగ్రదాడి వంటి ఘటనలు, పాకిస్తాన్ సైనిక సామర్థ్యంపై ఒత్తిడిని మరింత పెంచాయి. మసూద్ అఖ్తర్ పాకిస్తాన్ పరిమిత సైనిక బలం.. సామర్త్యాన్ని బలహీనపరుస్తుందని, ఈ విషయంలో ఆశావాద ధోరణి లేదా తప్పుడు ఆత్మవిశ్వాసం ప్రమాదకరమని సూచించారు.
Pakistan’s Retired Air Marshal Masood Akhtar gives a wake up call to bosses running fake agenda:
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 10, 2025
“Our condition is very bad , India has a force of 16 lakh, our strength is of mere 6 lakh. Neither can be match them in other fields. We can’t fight for long with India.” pic.twitter.com/g7ZEDdOpts
పాకిస్తాన్ సైన్యం అంతర్గత సవాళ్లకు కూడా ఎదుర్కొంటోంది. బలూచిస్తాన్‌లో సవాళ్లు, ఆర్థిక అస్థిరత కూడా పాక్ సైన్యంపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇవి పాకిస్తాన్ సైన్యం బహుళ రంగాలలో పని చేయాల్సి వస్తుందని . దీని వల్ల సమర్థత తగ్గిపోతోందని అంటున్నారు.



















