India Pakistan Attack News: 'సిర్సా-సూరత్‌గఢ్ ఎయిర్‌బేస్, S-400 సేఫ్,' పాక్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టిన భారత్
India Pakistan Attack News: S-400 వ్యవస్థ, విమానాశ్రయాలపై దాడి జరిగిందని పాకిస్తాన్ చేసిన తప్పుడు వాదనలను భారత్ తిప్పికొట్టింది. జరగుతున్న పుకార్లను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తోసిపుచ్చారు.

India Pakistan Attack News భారతదేశం, పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పాకిస్తాన్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోందని అన్నారు. భారత S-400 వ్యవస్థ నాశనమైందని, సూరత్- సిర్సాలోని విమానాశ్రయాలు ధ్వంసమైనట్టు తప్పుడు వాదనలు చేసింది. పాకిస్తాన్ వ్యాప్తి చేస్తున్న ఈ తప్పుడు వాదనలను భారతదేశం నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తుంది. తమ సైన్యం నిర్వహిస్తున్న కార్యకలాపాల గురించి పాకిస్తాన్ ప్రభుత్వ సంస్థలు దుష్ప్రచారాన్ని ప్రోత్సహిస్తోందని విక్రమ్ మిస్రి అన్నారు. దేశంలోని వివిధ సైనిక స్థావరాలపై దాడి చేసి నాశనం చేస్తున్నారనే వాదన పూర్తిగా అబద్ధం. ఆధారాలతో స్పష్టం చేశారు.
News reports of destruction or any damage to an S-400 system are baseless, fake news: Defence officials pic.twitter.com/RrPOz5gAX1
— ANI (@ANI) May 10, 2025
విక్రమ్ మిస్రి విలేకరుల సమావేశం ప్రారంభంలో మాట్లాడుతూ, గత రెండు-మూడు బ్రీఫింగ్‌లలో పాకిస్తాన్ రెచ్చగొట్టే కార్యకలాపాలను నిర్వహిస్తోందని మేము చెప్పాము. పాకిస్తాన్‌కు భారతదేశం గట్టి జవాబు చెప్పింది. గత 2-3 రోజులుగా పాకిస్తాన్ కార్యకలాపాలు రెచ్చగొట్టేవిగా కనిపిస్తున్నాయి. కానీ భారత్ మాత్రం బాధ్యతాయుతంగా స్పందిస్తోంది అని అన్నారు.
🚨 S-400 Destroyed by Pakistan? Here's the Truth!
— PIB Fact Check (@PIBFactCheck) May 10, 2025
Posts circulating on social media claim that Pakistan has destroyed an Indian S-400 air defence system.#PIBFactCheck
❌ This claim is FAKE.
❌ Reports of destruction or any damage to an S-400 system are baseless.… pic.twitter.com/wPLKQSBAqe
భారత్ వైపు నుంచి చేస్తున్న దాడులన్నీ ఉగ్రవాద స్థావరాలు, సైనిక ఆస్తులపై మాత్రమేననే స్పష్టం చేసింది. అయితే పాకిస్తాన్ మాత్రం పౌరులను కవచాలుగా ఉపయోగించుకొని ప్రమాదంలో పడేస్తోంది. భారతదేశం ఈ మొత్తం ఆపరేషన్‌ను సంయమనంతో,కచ్చితత్వంతో, నైతిక సైనిక సూత్రాల ప్రకారం నిర్వహించింది.





















