Territorial Army: దేశం కోసం మేము సైతం - టెరిటోరియల్ ఆర్మీలో ఇలా చేరవచ్చు - ఈ సెలబ్రిటీలు చాలా మంది సైనికులే
Civil defence volunteers : పాకిస్తాన్ తో యుద్ధం వచ్చే పరిస్థితులతో టెరిటోరియల్ ఆర్మీని ఉపయోగించుకోవాలని భారత్ నిర్ణయించుకుంది. తాము రెడీ అని యువత ముందుకు వస్తోంది.

Massive crowd shows up as civil defence volunteers: భారత టెరిటోరియల్ ఆర్మీ (TA) రెగ్యులర్ ఇండియన్ ఆర్మీ తర్వాత రెండవ రక్షణ విభాగంగా పనిచేసే స్వచ్ఛంద సైనిక బలం. ఇది పౌరులకు వారి ప్రధాన వృత్తిని వదులుకోకుండా సైనిక సేవలు అందించే అవకాశం కల్పిస్తుంది.
టెరిటోరియల్ ఆర్మీలో చేరేందుకు అర్హతలు
టెరిటోరియల్ చేరేందుకు భారత పౌరుడై ఉండాలి. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా ప్రభుత్వ/ప్రైవేట్ సెక్టార్‌లో ఉద్యోగం లేదా స్వయం ఉపాధి కలిగి ఉండాలి. స్వయం ఉపాధి కలిగినవారు నాన్-జుడిషియల్ స్టాంప్ పేపర్‌పై అఫిడవిట్ సమర్పించాలి, ఇందులో వారి ఉపాధి స్వభావం, వార్షిక ఆదాయం తెలపాలి. అభ్యర్థి శారీరకంగా మరియు వైద్యపరంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి. రిజిస్టర్డ్ MBBS డాక్టర్ నుండి తాజా ఫిట్‌నెస్ సర్టిఫికేట్ సమర్పించాలి. సెంట్రల్/స్టేట్ గవర్నమెంట్, PSU, లేదా ప్రైవేట్ సెక్టార్‌లో ఉద్యోగం చేస్తున్నవారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) సమర్పించాలి.
ఆన్‌లైన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (CBT) నిర్వహించి ఎంపిక చేసుకుంది. రీజనింగ్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్‌పై ప్రశ్నలు ఉంటాయి. ప్రిలిమినరీ ఇంటర్వ్యూ బోర్డ్ (PIB) ద్వారా రాత పరీక్షలో అర్హత సాధించినవారికి ఇంటర్యూ నిర్వహిస్తారు. తర్వతా సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (SSB) ద్వారా సైకలాజికల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇంటెలిజెన్స్ టెస్ట్ పెడతారు. మెడికల్ ఎగ్జామినేషన్ , పోలీస్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రతి సంవత్సరం 2 నెలలు తప్పనిసరి శిక్షణ ఉంటుంది. TA అధికారులు రెగ్యులర్ ఆర్మీ అధికారులతో సమానమైన వేతనం, భత్యాలు, ప్రివిలేజ్‌లను పొందుతారు. పెన్షన్ హామీ లేదు ఇది ఎంబాడీడ్ సర్వీస్‌పై ఆధారపడి ఉంటుంది. లెఫ్టినెంట్ ర్యాంక్‌తో ప్రారంభమై, లెఫ్టినెంట్ కల్నల్ వరకు టైమ్ స్కేల్ ఆధారంగా పదోన్నతులు. కల్నల్, బ్రిగేడియర్ ర్యాంక్‌లకు సెలక్షన్ ఆధారంగా నిర్ణయిస్తారు.
అవును, భారత టెరిటోరియల్ ఆర్మీలో పలువురు ప్రముఖ వ్యక్తులు మరియు సెలబ్రిటీలు గౌరవ ర్యాంకులు పొంది సేవలు అందించారు. దోనీ 2011లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ పొందారు. పారాచూట్ రెజిమెంట్‌లో చేరారు. ఆగ్రాలో రెండు వారాల శిక్షణలో పాల్గొన్నారు కపిల్ దేవ్ 2008లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ పొందారు. TA బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు, యువతలో సైన్యం పట్ల ఆసక్తిని పెంచడానికి సహాయపడ్డారు. షూటర్ అభినవ్ బింద్రా, రాజకీయ నేత సచిన్ పైలట్, కేరళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ విశ్వనాథన్ నాయర్ కూడా టెరిటోరియల్ ఆర్మీలో భాగమే. 2009లో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ పొందిన తొలి నటుడు కూడా. కాన్పూర్‌లోని 122 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్ (TA)లో శిక్షణ పొందారు. అాలాగే కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ 2016లో గౌరవ లెఫ్టినెంట్ ర్యాంక్ పొందారు.
अब #भारत के रक्षा मंत्रालय ने #IndianArmy की सहायता के लिए Notification जारी करके सेना प्रमुख को Territorial Army बुलाने का अधिकार दे दिया है।
— मृगांका सिंह (Political Critic and Writer) (@reach2msingh) May 9, 2025
तो उम्मीद है कि Territorial Army में Captain @ianuragthakur भी #IndiaPakistanWar में भारत माता के प्रति अपने कर्तव्य का पालन करेंगे🤔 pic.twitter.com/TTeRtgkQXq
భారత్ – పాక్ మధ్య యుద్దమేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో ఈ టెరిటోరియల్ ఆర్మీ సేవలను వాడుకోవాలని సైన్యం భావిస్తే వీరంతా వార్ జోన్ లోకి వెళ్లే అవకాశం ఉంది. గతంలో 1962లో చైనాతో యుద్ధం సమయంలో, 1999కార్గిల్ యుద్ధంలో ఈ టెరిటోరియల్ ఆర్మీ పాల్గొంది. మరోసారి భారత్ – పాక్ మధ్య యుద్ధం తలెత్తితే వీరు యుద్ధంలో పాల్గొనే అవకాశం ఉంది.





















