అన్వేషించండి

Ant Research: ఈ భూమి మీద మొత్తం ఎన్ని చీమలున్నాయో తెలుసా?

Ant Research: ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం చీమల సంఖ్య ఎంతో తెలుసా?

Ant Research: ఈ ప్రపంచంలో మొత్తం ఎన్ని చీమలు ఉన్నాయో తెెలుసా? మనుషుల గురించి పట్టించుకునే టైమే లేదు.. ఇక చీమల  సంగతెందుకు? అనుకోకండి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్న చీమల సంఖ్య తెలిస్తే అవాక్కవుతారు. 

పెద్ద సాహసమే

ఈ ప్రపంచంలో మనుషుల కంటే చీమల సంఖ్యే ఎక్కువ. ఇది ఎప్పుడో తెలిసిన విషయమే. అయితే వాటి సంఖ్య ఎంతో తెలుసుకునేందుకు హాంకాంగ్‌కు చెందిన కొందరు పరిశోధకులు ఓ సాహసం చేశారు. చీమల సంఖ్యను లెక్కగట్టే ప్రయత్నం చేశారు. ఏకంగా 489 అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం ద్వారా ఓ విషయాన్ని వెల్లడించారు.

భూమిపై 20,000,000,000,000,000 లేదా 20 క్వాడ్రిలియన్ల చీమలు ఉన్నాయని అంచనా వేశారు. అయితే వాటి సాంద్రత దృష్ట్యా కచ్చితమైన సంఖ్యను మాత్రం చెప్పలేకపోతున్నామన్నారు. ఈ పరిశోధనలు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

బయోమాస్

భూగోళం మీద చీమల బయోమాస్‌ 12 మిలియన్ టన్నులుగా అధ్యయన బృందం వెల్లడించింది. ఓ ప్రాంతం లేదా వాల్యూమ్‌లోని జీవుల మొత్తం పరిమాణం కానీ బరువును సూచించడాన్ని బయోమాస్ అంటారు. అడవిలో నివసించే పక్షులు, క్షీరదాల మొత్తం బరువు కలిపి సుమారు 2 మిలియన్ టన్నులు ఉంటుందని తెలిపింది.

ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

చీమలు ఒకే వరుసలో వెళ్లటం మనం చాలా సార్లు చూసే ఉంటాం. దీనికి ఓ సైంటిఫిక్ రీజన్ ఉందట. చీమలు నిత్యం Pheromones అనే కెమికల్ సెంట్‌ను తమ శరీరం నుంచి స్రవిస్తుంటాయి. చీమలు ఒకరితో ఒకటి ఇలా ఫెరోమోన్స్‌ ద్వారానే కమ్యూనికేట్ అవుతాయి. ఈ కెమికల్ ద్వారానే వెనకాల వచ్చే చీమలకు వార్నింగ్ ఇస్తుంటాయి. దగ్గర్లో శత్రువు ఉంటే అప్రమత్తం చేయాలన్నా, లేదంటే...ఆహారం దొరికే స్థలాన్ని కనుక్కోటానికైనా ఈ కెమికల్‌తోనే సిగ్నల్స్ ఇచ్చేస్తాయన్నమాట.

చీమలు నివసించే చోటుని ఓ కాలనీ అనుకుందాం. ఆ కాలనీ నుంచి కొన్ని చీమలు మాత్రమే ఆహార అన్వేషణకు బయల్దేరతాయి. ఓసారి ఫుడ్ సోర్స్‌ని కనుక్కోగానే...అక్కడి నుంచి మళ్లీ తమ కాలనీకి తిరుగు పయన మవుతాయి. ఈ వచ్చే క్రమంలో ఆ దారంతా ఫెరోమోన్స్‌ను విడుదల చేస్తాయి. నేరుగా తమ చోటుకి వెళ్లి మిగతా చీమలతో కమ్యూనికేట్ చేస్తాయి. అవి మళ్లీ కలిసి కట్టుగా ఫెరోమోన్స్‌ విడుదల చేసిన దారిలోనే ఫుడ్ సోర్స్‌ వద్దకు వెళ్తాయి. ఆహారం దొరికేంత వరకూ ఇలా అన్ని చీమలూ ఆ కెమికల్‌ను రిలీజ్ చేస్తూనే ఉంటాయి. వెనకాల వచ్చే చీమలు ఆ కెమికల్‌ను సెన్స్ చేస్తూ వచ్చేస్తాయి. ఆహారం అంతా ఆరగించాక మళ్లీ అవే ఫెరోమోన్స్‌ సాయంతో తమ సొంత చోటుకు వచ్చేస్తాయి. 

Also Read: Heroin Seized In Mumbai: 22 టన్నుల హెరాయిన్ స్వాధీనం- విలువ తెలిస్తే మైండ్ బ్లాక్ అవుద్ది!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Parliament Sessions: 25 నుంచి పార్లమెంట్ సమావేశాలు -  రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
25 నుంచి పార్లమెంట్ సమావేశాలు - రాజ్యాంగ సవరణల కోసమే ఉభయసభల సంయుక్త సమావేశం ?
US Presidential Election 2024: అమెరికాలో ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభం, తొలి ఫలితం రావడంతో పెరిగిన ఉత్కంఠ
Embed widget