Russia-Ukraine War: ఆ దేశాలకు పుతిన్ వార్నింగ్- ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరఫున బరిలోకి 'రిజర్వ్స్'!
Russia-Ukraine War: పశ్చిమ దేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. అలానే ఉక్రెయిన్ యుద్ధంలో తమ 'రిజర్వ్స్'ను వినియోగించాలని నిర్ణయించారు.

Russia-Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు 7 నెలలు పూర్తవుతోంది. అయితే ఇప్పటికే రష్యా తన లక్ష్యాన్ని చేరుకోలేదు. దీంతో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా సైన్యంలోకి 3 లక్షల మంది 'రిజర్వ్స్' తిరిగి పిలుస్తున్నారు.
రిజర్వ్స్ అంటే?
గతంలో సైన్యంలో పని చేసి ప్రస్తుతం పౌర జీవితంలో ఉన్నవారిని 'రిజర్వ్స్' అంటారు. వీరి సేవలను ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో ఉపయోగించుకోనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో పుతిన్ అన్నారు.
⚡️President Putin Address - Key Points:
— RT (@RT_com) September 21, 2022
- West is calling to weaken, divide and destroy Russia
- Support for compatriots to determine their own futures pic.twitter.com/qdB92XSCSG
వార్నింగ్
ఇటీవల
సుదీర్ఘ సాగుతోన్న రష్యా- ఉక్రెయిన్ ఘర్షణపై ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు పుతిన్. రష్యా అనుకున్నది సాధించే వరకు వెనక్కి తగ్గేదే లేదన్నారు.
" లక్ష్యం సాధించే వరకు ఉక్రెయిన్‌పై సైనిక చర్య కొనసాగుతుంది. ఆంక్షల ద్వారా రష్యాను ఒంటిరిని చేయలేరు. సైనిక చర్యను ప్రారంభించింది మేం కాదు. దాన్ని అంతం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. మా చర్యలన్నీ డాన్‌బాస్ వాసులకు సహాయం చేయడమే లక్ష్యంగా ఉన్నాయి. ఇది మా కర్తవ్యం. ఈ లక్ష్యాన్ని సాధించే వరకు మా చర్యలు కొనసాగుతాయి. "
Also Read: SC Constitution Bench: ఇక నుంచి సుప్రీం కోర్టు విచారణలు ప్రత్యక్ష ప్రసారం!
Also Read: Lawsuit Against Trump: 'డ్రెస్సింగ్ రూమ్‌లో నన్ను రేప్ చేశాడు'- డొనాల్డ్ ట్రంప్‌పై సంచలన ఆరోపణలు





















