అన్వేషించండి

Andhra Pradesh and Telangana Weather Updates: ఎండ దాటికి తెలుగు రాష్ట్రాల్లో పగులుతున్న రోళ్లు! రికార్డు స్థాయిలో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు!

Andhra Pradesh and Telangana Weather Updates: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తెలుగు రాష్ట్రాల్లో భరించలేని ఎండలు, రోళ్లు పగిలే స్థాయి ఉష్ణోగ్రతలు.
  • ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు.
  • తీవ్రమైన ఎండలు, వడగాలలతో తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న మరణాల సంఖ్య.
  • ప్రభుత్వాలు అత్యవసర హెచ్చరికలు జారీ, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన.

Andhra Pradesh and Telangana Weather Updates: తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారిపోతున్నాయి. సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగులుతాయనే సామెత నిజం అవుతోంది. చాలా ప్రాంతాల్లో రోళ్లు, రాళ్లు పలిగే ఎండలు ప్రజలను బెంబేలెత్తిస్తోంది. జనం విలవిలలాడిపోతున్నారు. చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. వేసవి మొదలు కాక ముందు నుంచే ఎండు ఠారెత్తించాయి. గతానికి కంటే భిన్నంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు అవి మరింత తీవ్ర స్థాయికి వెళ్లాయి. దీంతో అధికారులు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లో పిడుగురాళ్లలో ప్రళయం 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో ఎండలు అసాధారణంగా పెరిగాయి. బుధవారం నాటి గణాంకాల ప్రకారం పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో అత్యధికంగా 47. 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఈ వేసవిలో నమోదు అయిన అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. ఒక్క పల్నాడు జిల్లా మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. 28 జిల్లాలకు గాను, 23 జిల్లాల్లో ఎండలు మండిపోయాయి. 233 మండలాల్లో 41 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 11 జిల్లాల్లో 45 డిగ్రీలు దాటగా, 204 మండలాల్లో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు రిజిస్టర్ అయ్యాయి.  

పిడుగురాళ్ల తర్వాత నెల్లూరు జిల్లా గూడూరులో 44.9 డిగ్రీలు, కృష్ణా జిల్లా కంకిపాడులో 44.5 డిగ్రీలు, ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, మార్కాపురం జిల్లాల్లోని పెదచెర్లోపల్లిలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. 

తెలంగాణలో అదిరిపోతున్న ఎండలు 

తెలంగాణలో కూడా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బుధవారం నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌్లో 46.5 డగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యింది. గత  పదేళ్ల రికార్డులను తుడిచి కొత్త రికార్డును నమోదు చేసింది. ఈ ఒక్క ప్రాంతంలోనే కాదు దాదాపు రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. హనుమకొండలో 46.4, కరీంనగర్ జిల్లా చొప్పదండిలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 40.5 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

వడగాలులకు పోతున్న ప్రాణాలు 

తీవ్రమైన ఎండల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ బుధవారం ఒక్క రోజే వడదెబ్బకు పది మందికిపైగా మృతి చెందారు. మరణించిన వారిలో రైతులు, ఉపాధి కూలీలు, మున్సిపల్‌ కార్మికులు, దివ్యాంగులు ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో ముగ్గురు, కరీంనగర్‌, సూర్యాపేట, ములుగు, మహబూబాబాద్‌, జనగామ, రాజన్న సిరిసిల్ల ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. 

ఆంధ్రప్రదేశ్‌లో కూడా వడ దెబ్బ కారణంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో గీత కార్మికుడు చనిపోయాడు. కృష్ణా జిల్లా వణుకూరుకు చెందిన కౌలు రైతు చనిపోయాడు. మార్చి 1 నుంచి మే 19 వరకు 325 మంది వడదెబ్బకు ఏపీలో మృత్యువాత పడ్డారు. 

ప్రస్తుతం వాయవ్య భారతం నుంచి వేడిగాలులు కోస్తాంధ్ర, రాయలసీమవైపు వీస్తున్నాయి. దీనికి తోడు కర్ణాటక, రాయలసీమ మీదుగా దక్షి కోస్తాంధ్ర వరకు ఒక ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉండటంతో ఉష్ణోగ్రతల పెరుగుదలకు ప్రధాన కారణం. సాధారణం కంటే 4.5 నుంచి 6.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. 

Frequently Asked Questions

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు ఎక్కడ నమోదయ్యాయి?

ఆంధ్రప్రదేశ్​లో పిడుగురాళ్లలో 47.6 డిగ్రీలు, తెలంగాణలో నిర్మల్​ జిల్లా దిలావర్​పూర్​లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

ఈ వేడి వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా?

అవును, తీవ్రమైన ఎండల కారణంగా వడదెబ్బకు తెలంగాణలో పది మందికి పైగా, ఆంధ్రప్రదేశ్​లో మార్చి 1 నుంచి మే 19 వరకు 325 మంది మృతి చెందారు.

ఎన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి?

ఆంధ్రప్రదేశ్​లో 233 మండలాల్లో 41 డిగ్రీల కంటే ఎక్కువ, 11 జిల్లాల్లో 45 డిగ్రీలు దాటాయి. తెలంగాణలో 33 జిల్లాల్లో 40.5 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
వివేకా హత్య కేసులో లబ్ధిదారులెవరో తేలింది.. సుపారీపై జగన్ సమాధానం చెప్పాలి: చంద్రబాబు
Telangana Secretariat: తెలంగాణ సచివాలయానికి తాగునీటి సరఫరా బంద్! ఇదెక్కడి వింత సమస్య
తెలంగాణ సచివాలయానికి తాగునీటి సరఫరా బంద్! ఇదెక్కడి వింత సమస్య
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Amaravati Outer Ring Road: అమరావతి ఓఆర్ఆర్‌లో కీలక పరిణామం.. ఇంటర్‌ఛేంజ్‌లు కుదించడంతో తగ్గిన ప్రాజెక్టు వ్యయం
అమరావతి ఓఆర్ఆర్‌లో కీలక పరిణామం.. ఇంటర్‌ఛేంజ్‌లు కుదించడంతో తగ్గిన ప్రాజెక్టు వ్యయం

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court Notices To Gyanesh Kumar: సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
సీఈసీపై పిటిషన్ల విచారణ.. కేంద్రంతో పాటు జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు
Telangana Finances: బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
బకాయిల సుడిగుండంలో తెలంగాణ: రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు - రేవంత్ ప్రభుత్వానికి ఆర్థిక సవాల్!
Hyderabad Tank Bund Accident: ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
ట్యాంక్ బండ్‌పై పెను విషాదం.. పుట్టినరోజు నాడే ఆరేళ్ల చిన్నారి మృతి
Harish Rao Siddipet : సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
సిరిసిల్ల తర్వాత సిద్ధిపేటపై రేవంత్ కన్ను - హరీష్ రావు కోటలో కాంగ్రెస్ రణభేరి ఫలిస్తుందా?
YSRCP Local Elections Strategy: స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
స్థానిక ఎన్నికల్లో జగన్ మార్క్ క్లాస్ - కూటమి విభేదాలపై వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అటాక్ -
కియా కార్ల దసరా సేల్‌.. రూ.1.70 లక్షల వరకు ప్రయోజనాలు.. అక్టోబర్ ఆఫర్ల పూర్తి లిస్ట్
కియా కార్లపై దసరా ఆఫర్లు.. ఈ పండుగ టైమ్‌లో రూ.1.70 లక్షల వరకు ఆదా!
MLA Chintamaneni Prabhakar: వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
వెదురుపావులూరు టోల్ ప్లాజా ఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ఏ సంబంధం లేదు, అసలేం జరిగిందంటే
AP NTR Bharosa New Pensions: ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
ఏపీలో కొత్త పింఛన్ల చిక్కుముడి- 13 లక్షల దరఖాస్తులు - కూటమికి ఆర్థిక, రాజకీయ భారం - అసంతృప్తి తప్పదా?
Embed widget