By: ABP Desam | Updated at : 11 May 2023 10:38 AM (IST)
Edited By: jyothi
నష్టపోయిన రైతులకు సర్కారు సాయం, 5 రోజుల్లోనే జమ చేసిన రాష్ట్ర సర్కారు
AP News: అకాల వర్షాలు రైతులను కుంగదీశాయి. చేతికి అందివచ్చిన పంట అకాల వానలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. దెబ్బతిన్న పంటలకు సాయం అందిస్తామని వైసీపీ సర్కారు హామీ ఇచ్చింది. రికార్డు సమయంలోనే ఆ సాయం అందించినట్టు ప్రభుత్వం చెబుతోంది. కేవలం ఐదు రోజుల్లోనే ధాన్యం డబ్బుల్ని నష్టపోయిన రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు పేర్కొంది. ఒక్కరోజే 32,558 రైతుల ఖాతాల్లో రూ. 474 కోట్లు జమ చేసింది ఏపీ సర్కారు. దీనిపై ఏపీ పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఏపీ రాష్ట్ర సర్కారు నష్టపరిహార డబ్బు జమ చేసినట్లు వెల్లడించారు. రికార్డు సమయంలో రైతులకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు సాయం అందించిందని పేర్కొన్నారు. కేవలం 5 రోజుల్లోనే డబ్బులు జమ చేసిందని చెప్పారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం 5 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో ధాన్యం కొనుగోళ్ల డబ్బులు జమ చేసిన సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం. ఇప్పటి వరకు రూ.1277 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం#YSJaganWithFarmers #YSJaganCares pic.twitter.com/FIisien01E
— YSR Congress Party (@YSRCParty) May 10, 2023
రబీలో ఇప్పటి వరకు రూ. 1,277 కోట్ల ధాన్యం డబ్బులను ఏపీ సర్కారు రైతుల ఖాతాల్లో జమ చేసింది. మొత్తంగా 82.58 శాతం రైతులకు డబ్బులు జమ చేసింది ప్రభుత్వం. పరిహారం డబ్బులు ఖాతాల్లో జమ చేసేందుకు 21 రోజులు సమయం ఉన్నప్పటికీ కేవలం 5 రోజులకే పూర్తిగా చెల్లింపులు చేసింది వైఎస్సార్ సర్కారు. అందులో పశ్చిమ గోదావరి జిల్లా రైతులకు 527 కోట్ల రూపాయలు, ఏలూరు జిల్లా రైతులకు రూ. 296 కోట్లు, తూర్పు గోదావరి జిల్లా రైతులకు రూ. 258 కోట్లు, కోనసీమ జిల్లా రైతులకు రూ. 100 కోట్లు జమ చేసినట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ తెలిపారు.
Tamil Nadu Crime: అత్తను దారుణంగా హత్య చేసిన కోడలు, సీసీటీవీ ఫుటేజీ చూసి పోలీసులు షాక్!
PSTU Admissions: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన విడుదల, కోర్సుల వివరాల ఇలా!
APPSC Group1 Mains: జూన్ 3 నుంచి 'గ్రూప్-1' మెయిన్స్ పరీక్షలు! హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?
Hayath Nagar Deaths Case: రాజేశ్, టీచర్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి! అసలు విషయం తేల్చిన పోలీసులు
IBPS RRB XII Recruitment 2023: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ నోటిఫికేషన్ విడుదల - ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలు ఎప్పుడంటే?
TSPSC Paper Leak Case: మరో 13 మంది అభ్యర్థులకు టీఎస్ పీఎస్సీ షాక్, జీవితాంతం ఎగ్జామ్ రాయకుండా డీబార్
Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు
Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?
Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!