By: ABP Desam | Updated at : 07 Jul 2022 04:10 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
అనంతపురంలో ఉన్నతాధికారి ఆత్మహత్య(ప్రతీకాత్మక చిత్రం)
Anantapur News : అనంతపురం జిల్లా కేంద్రంలోని పశుసంవర్థక శాఖ అతిథి గదిలో ఆ శాఖలో పనిచేస్తున్న డాక్టర్ రాము ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉన్నతాధికారి ఆత్మహత్య చేసుకున్న వార్త ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతోంది. బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలుసుకున్న వెంటనే ఉన్నతాధికారుల వేధింపులే కారణమై ఉంటాయని మొదట అందరూ భావించారు. అయితే సూసైడ్ నోట్ లభ్యమైన తర్వాత పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. సుమారు 50 లక్షల రూపాయల కోసం పుట్టపర్తి, ధర్మవరానికి చెందిన కొంతమంది తనను బెదిరిస్తున్నారంటూ సూసైడ్ నోట్లో రాశారు డా. రాము. గెజిటెడ్ అధికారి కావడంతో తన వద్ద ఉన్న గ్రీన్ పెన్నుతో సూసైడ్ నోట్ రాసి అందులో తనను వేధిస్తున్న వారి పేర్లను కూడా పేర్కొన్నారు. తన వద్ద ఆల్రెడీ డబ్బు తీసుకొని మోసం చేశారని తిరిగి 50 లక్షల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తుండటంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్ లో రాశారు.
ఒంటరిగా ఉంటూ
గతంలో పుట్టపర్తి స్పెషల్ ఆఫీసర్ గా డా.రాము విధులు నిర్వహించారు. ఆయన భార్య కర్నూలు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. కుటుంబం కర్నూలు ప్రాంతంలో ఉండడంతో తన మాతృశాఖ అయిన పశుసంవర్ధక శాఖకు చెందిన అతిథి గదిలో ఆయన ఒంటరిగా ఉంటున్నారు. ఉదయం ఎంతసేపటికి విధులకు హాజరు కాకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది గదికి వెళ్లి చూడగా తలుపులు లోపల నుంచి వేసి ఉన్నాయి. అది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల సమక్షంలో తలుపులు బద్దలు కొట్టి చూస్తే డా.రాము ఉరివేసుకుని చనిపోయిన స్థితిలో మృతదేహాన్ని గుర్తించారు. అనంతపురం ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత కుటుంబీకులకు అప్పచెప్పారు.
వేధింపులు తాళలేక
ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు పూర్తిస్థాయిలో విశ్లేషిస్తున్నారు. ఆయనను బెదిరించిన వారి వివరాలు సేకరిస్తు్న్నారు పోలీసులు. ఆన్లైన్ బిజినెస్ కు సంబంధించిన వివరాలను కూడా సమగ్రంగా సేకరిస్తున్నారు. జిల్లా స్థాయి ఉన్నతాధికారి కొంతమంది వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడడం ఇప్పుడు అనంతపురం జిల్లాలో తీవ్ర దుమారం రేపింది.
Also Read : Hyderabad: హైదరాబాద్‌లో చైల్డ్ పోర్న్ ముఠాలు, ఈ 3 ప్రాంతాల నుంచి వీడియోలు అప్‌లోడ్! అదుపులోకి ముగ్గురు?
Also Read : Crime News: కూతుళ్లతోనే ప్రియుడి భార్య హత్యకు స్కెచ్- సీరియల్స్ విలన్స్‌కు మించిన కంత్రీ ప్లాన్ ఇది!
Indian Navy Jobs: ఇండియన్ నేవీలో ఇంజినీరింగ్, ఆపై ఉన్నత హోదా ఉద్యోగం!
Indian Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు, నెలకు రూ.56 వేల జీతం, పూర్తి వివరాలివే!
Weather Updates: ఏపీలో మరో 24 గంటలు వర్షాలు - తెలంగాణలో వాతావరణం ఇలా
Gold-Silver Price: బంగారం, వెండి కొనాలా? నేటి ధరలు ఇక్కడ తెలుసుకోండి, ప్లాటినం కూడా
Dogfishing : అమ్మాయిలతో డేటింగ్‌కు కుక్క పిల్ల రికమండేషన్
Horoscope Today 16th August 2022: ఈ రెండు రాశులవారికి అదృష్టం, ఆ రాశివారికి విజయం, ఆగస్టు 16 రాశిఫలాలు
Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి
Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ
ఈ విమానం రెప్పపాటులో గమ్యానికి చేరుస్తుంది, టికెట్ జస్ట్ రూ.1,645 మాత్రమే!