News
News
X

Crime News: కూతుళ్లతోనే ప్రియుడి భార్య హత్యకు స్కెచ్‌- సీరియల్స్‌ విలన్స్‌కు మించిన కంత్రీ ప్లాన్‌ ఇది!

తెలుగు సీరియల్స్‌లో కనిపించే లేడీ విలన్స్‌ కంటే దారుణమైన మహిళ. ఆమె స్కెచ్‌ అచ్చం ప్రమాదంలా అనిపించింది. కానీ చివరకు లవ్‌లెటర్‌తో దొరికిపోయింది.

FOLLOW US: 

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం కొమరగిరిపట్నం ఆకుల వారి వీధిలో ఇల్లు దగ్ధమై ఇద్దరు సజీవ దహనమయ్యారు. ముందు ప్రమాదం అనుకున్నారు. కానీ పోలీసుల విచారణలో కళ్లుబైర్లకమ్మే వాస్తవాలు వెలుగు చూశాయి.  వివాహేతర సంబంధం కారణంగానే అదే గ్రామానికి చెందిన మహిళ ఈ దారుణానికి ఒడిగట్టిందని తేల్చారు. తన ఇద్దరి కుమార్తెలతో కలిసి కుట్ర చేసినట్టు విచారణలో వెల్లడైంది. 

కేసులో నిందితులుగా ఉన్న సుంకర నాగలక్ష్మి, ఆమె ఇద్దరు కుమార్తెలు సుంకర సౌజన్య, దివి హరితను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. వీరికి రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. 

ఈనెల రెండో తేదీ కొమరగిరి పట్నం గ్రామంలో సాధనాల మంగాదేవి, ఆమె కుమార్తె మేడిశెట్టి జ్యోతి ఒకే గదిలో నిద్రిస్తుండగా అగ్ని కీలలు అంటుకున్నాయి. వేరే గదిలో పడుకున్న మృతురాలు మంగాదేవి భర్త లింగయ్యలో ప్రాణాలతో బయటపడ్డాడు. చాలా మంది ఇది ప్రమాదమే అనుకున్నారు. కానీ ఫ్యామిలీ మెంబర్స్‌ మాత్రం అనుమానం వ్యక్తం చేశారు. 

మంగాదేవి భర్త లింగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించారు. సాక్ష్యుల చెప్పిన వివరాలతో జ్యోతి భర్త మేడిశెట్టి సురేష్‌ని విచారించారు పోలీసులు. అతను చెప్పిన మాటలకు పోలీసుల మైండ్ బ్లాంక్ అయింది. ఈ ఏడాది ఫిబ్రవరి 10న జ్యోతిని ప్రేమించి పెళ్లి తాను గోడితిప్ప గ్రామంలో కాపురం పెట్టామన్నాడు. అక్కడ తను ఆటోలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తన భార్య జ్యోతికి వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్లు అనుమానం కలిగేలా ప్రేమలేఖలు రాశారని చెప్పాడు. తాము ఉంటున్న ఇంటి పరిసరాల్లో కూడా పడేశారని వెల్లడించాడు. 

ఈ కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు విస్తుపోయి నిజాలు తెలిశాయి. మృతురాలు జ్యోతి భర్త సురేష్‌కి, సుంకర నాగలక్ష్మి అనే మహిళతో వివాహేతర సంబంధం ఉందని తేలింది. కుటుంబం అవసరాలకు సురేష్ డబ్బులు ఇచ్చే వాడని కూడా స్పష్టమైంది. జ్యోతితో పెళ్లైన తర్వాత ఈ సంబంధానికి బ్రేక్ పడింది. సుంకర నాగ లక్ష్మితో మాట్లాడటం మానేశాడు సురేష్. డబ్బులు కూడా ఇవ్వడం మానేశాడు. దీంతో సురేష్‌, జ్యోతి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసింది నాగలక్ష్మి. తన ఇద్దరు కుమార్తెలను అందుకు వాడుకుంంది. 

గ్రామంలో ఒక షాపులో కలర్స్ పేపర్లు కొని సురేష్‌కు జ్యోతిపై అనుమానం వచ్చేలా లెటర్స్‌ రాసింది. అయినా సురేష్‌ జ్యోతిపై అనుమానం రాలేదు... నాగలక్ష్మివైపు చూడటం లేదు. దీంతో జ్యోతిని ఎలిమినేట్ చేస్తే తప్ప తన లైన్‌ క్లియర్ కాదని భావించింది. ఈ నెల రెండున తెల్లవారుజామున కుమార్తెల సాయంతో పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. ఆ మంటల్లో సురేష్ భార్య జ్యోతి, జ్యోతి అమ్మ మంగాదేవి చనిపోయారు. ఇంటికి మంటలు అంటుకొన్నప్పుడు జ్యోతి తండ్రి లింగయ్య ఆ మంటలకు నిద్రలేచి తన భార్య కుమార్తెలను రక్షించే ప్రయత్నం చేసినప్పటికి ప్రయోజనం లేకుండా పోయింది.  అతను ప్రాణాపాయం తప్పించుకొని బయట పడ్డాడు. 

Published at : 06 Jul 2022 10:56 PM (IST) Tags: Crime News Konaseema news Ambedkar Konaseema District News

సంబంధిత కథనాలు

Mlc Anantababu : ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో ఎట్టకేలకు ఛార్జ్ షీట్, 88 రోజుల తర్వాత

Mlc Anantababu : ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో ఎట్టకేలకు ఛార్జ్ షీట్, 88 రోజుల తర్వాత

Crime News : బెదిరించడం కోసమే పెట్రోల్ కానీ తేడా కొట్టేసింది ! అంబర్ పేట కాలేజీలో జరిగింది ఇదే

Crime News : బెదిరించడం కోసమే పెట్రోల్ కానీ తేడా కొట్టేసింది ! అంబర్ పేట కాలేజీలో జరిగింది ఇదే

ఏలూరు జిల్లాలో సంచలనంగా మారిన వైసీపీ లీడర్ వీడియో!

ఏలూరు జిల్లాలో సంచలనంగా మారిన వైసీపీ లీడర్ వీడియో!

Bhadradri Kottagudem News : లవర్ ను గర్భవతి చేసిన యువకుడు, అబార్షన్ వికటించి యువతి మృతి

Bhadradri Kottagudem News :  లవర్ ను గర్భవతి చేసిన యువకుడు, అబార్షన్ వికటించి యువతి మృతి

విశాఖ వాసులను వణికిస్తున్న వరుస హత్యలు, సెటిల్‌మెంట్లు కొంపముంచుతున్నాయా !

విశాఖ వాసులను వణికిస్తున్న వరుస హత్యలు, సెటిల్‌మెంట్లు కొంపముంచుతున్నాయా !

టాప్ స్టోరీస్

Power Exchanges Ban : తెలుగు రాష్ట్రాలకు కేంద్రం 'విద్యుత్' షాక్, ఎక్స్ఛేంజీల్లో కొనుగోళ్లపై నిషేధం

Power Exchanges Ban : తెలుగు రాష్ట్రాలకు కేంద్రం 'విద్యుత్' షాక్, ఎక్స్ఛేంజీల్లో కొనుగోళ్లపై నిషేధం

Vijay Deverakonda: 'లైగర్'కి సీక్వెల్ - అసలు విషయం చెప్పిన విజయ్ దేవరకొండ

Vijay Deverakonda: 'లైగర్'కి సీక్వెల్ - అసలు విషయం చెప్పిన విజయ్ దేవరకొండ

ABP Desam Exclusive: రూ.800 యూపీఐ లావాదేవీకి ఎంత ఖర్చవుతోంది! మనకు ఉచితం, RBIకి ఎంత నష్టం!

ABP Desam Exclusive: రూ.800 యూపీఐ లావాదేవీకి ఎంత ఖర్చవుతోంది! మనకు ఉచితం, RBIకి ఎంత నష్టం!

Chandoo Mondeti: ఆ సినిమా పోతుందని ముందే నాకు ముందే తెలుసు - 'కార్తికేయ2' డైరెక్టర్ కామెంట్స్!

Chandoo Mondeti: ఆ సినిమా పోతుందని ముందే నాకు ముందే తెలుసు - 'కార్తికేయ2' డైరెక్టర్ కామెంట్స్!