Viral News: టేకాఫ్ అవుతుండగా పేలిన ఫ్లైట్ టైర్, ఒక్కసారిగా మంటలు - వీడియో వైరల్
Viral Video: అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఫ్లైట్ టేకాఫ్ అవుతుండగా టైర్ పేలిపోయింది. ఒక్కసారిగా మంటలు రావడం వల్ల రన్‌వేపైనే నిలిపివేయాల్సి వచ్చింది.
Flight Tyre Burst: అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఫ్లైట్ టేకాఫ్ అవుతుండగా అనూహ్య ఘటన జరిగింది. ఉన్నట్టుండి విమానం టైర్ పేలిపోయింది. మంటలు వచ్చాయి. ఫీనిక్స్‌కి వెళ్లాల్సి ఉండగా ఈ ప్రమాదంతో రన్‌వే పైనే ఫ్లైట్ నిలిచిపోయింది. ఫ్లోరిడా ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన జరిగింది. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ఫ్లైట్ టేకాఫ్‌కి సిద్ధమవుతుండగా కుడివైపున ఉన్న టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఆ తరవాత మంటలు చెలరేగాయి. పొగ కమ్ముకుంది. రన్‌వేపై కొంత దూరం వరకూ వెళ్లిన ఫ్లైట్ అక్కడే ఆగిపోయింది. అప్రమత్తమైన అధికారులు ఎమర్జెన్సీ వెహికిల్స్‌ని ఘటనా స్థలానికి పంపించారు.
JUST IN: American Airlines flight 590 out of Tampa, Florida narrowly avoids disaster after multiple tires blow out during takeoff.
— Collin Rugg (@CollinRugg) July 10, 2024
As the plane was picking up speed and seconds away from liftoff, the tires blew out.
The pilot slammed on the brakes as the plane barreled towards… pic.twitter.com/P5kZ3N6pUO
ఈ ప్రమాదం జరిగినప్పుడు ఫ్లైట్‌లో 174 మంది ప్రయాణికులున్నారు. వీళ్లతో పాటు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని అధికారులు వెల్లడించారు. వెంటనే విమానాన్ని టర్మినల్‌కి పంపించారు. ప్రయాణికులందరినీ మరో ఫ్లైట్‌లోకి తరలించారు. రన్‌వేపై నుంచి విమానాన్ని తొలగించడం వల్ల మిగతా విమానాల సర్వీస్‌లకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. మెకానికల్ ఇష్యూ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ల్యాండ్ అయ్యే టైమ్‌కి ఈ ప్రమాదం జరిగి ఉంటే నష్టం భారీగా ఉండేదని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.