Amazon India Head Resigns: అమెజాన్ ఇండియా చీఫ్ రాజీనామా, త్వరలో కొత్త కంపెనీలోకి మనీష్ తివారీ
Manish Tiwary Amazon: 2016లో మనీష్ తివారీ అమెజాన్ ఇండియా కంట్రీ మేనేజర్ గా చేరారు. మనీష్ తివారీ త్వరలో మరో కొత్త కంపెనీలో చేరబోతున్నట్లుగా చెబుతున్నట్లుగా కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు.
Amazon news: భారత్‌లో అమెజాన్ ఇండియా కార్యకలాపాలకు చీఫ్ అయిన మనీష్ తివారీ రాజీనామా చేశారు. అమెరికాకు చెందిన ఈ ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీకి భారత్‌లో అధిపతిగా ఆయన దాదాపు ఎనిమిదిన్నరేళ్ల నుంచి పని చేస్తున్నారు. మనీష్ తివారీ త్వరలో మరో కొత్త కంపెనీలో చేరబోతున్నట్లుగా చెబుతున్నారు. భారత్‌లో అమెజాన్‌కు చెందిన కన్జూమర్, సెల్లర్స్ సర్వీసెస్ అధిపతిగా మనీష్ తివారీ కొనసాగారు. దేశంలో వస్తువుల అమ్మకాలు, కొనుగోళ్లు ఆన్ లైన్ ద్వారా జరగడంలో కీలక పాత్ర పోషించారు.
యూనిలివర్‌ను 2016లో మనీష్ తివారీ అమెజాన్ ఇండియాలో చేరారు. అమెజాన్ కు చెందిన అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘‘అమెజాన్ ఇండియాకు కంట్రీ మేనేజర్ అయిన మనీష్ తివారీ మరిన్ని అవకాశాల కోసం కంపెనీని వదిలివెళ్తున్నారు. గత ఎనిమిదేళ్లుగా మనీష్ లీడర్‌షిప్ అమ్మకందారులు తమ కస్టమర్లకు డెలివరీ చేయడంలో కీలకపాత్ర పోషించింది.
Amazon.in ను దేశంలో అందరూ ఇష్టపడే మార్కెట్ ప్లేస్‌గా మార్చింది. ఆయన అక్టోబరు వరకు అమెజాన్‌లోనే కొనసాగి తర్వా రిలీవ్ అవుతారు. అమెజాన్‌కు భారత్ చాలా ప్రాధాన్యం ఉన్న మార్కెట్. మేం ఇప్పటికే సాధించిన వ్యాపార ఫలితాలతో చాలా సంతోషిస్తున్నాం. భవిష్యత్తును మరింత డిజిటల్‌గా మార్చడానికి మేం రెడీగా ఉన్నాం” అని అధికార ప్రతినిధి తెలిపారు.