అన్వేషించండి

Bomb Threat: అహ్మదాబాద్‌లో స్కూల్స్‌కి బాంబు బెదిరింపులు, పరుగులు పెట్టిన పోలీసులు

Ahmedabad Schools: అహ్మదాబాద్‌లో పలు స్కూల్స్‌కి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం అలజడి సృష్టించింది.

Ahmedabad Schools Gets Bomb Threat: ఇటీవలే దేశరాజధాని ఢిల్లీలో పలు స్కూల్స్‌కి బాంబు బెదిరింపు మెయిల్ రావడం సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి ఈ ఘటనపై విచారణ జరుగుతుండగానే అటు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కొన్ని స్కూల్స్‌కీ ఇవే బెదిరింపులు వచ్చాయి. 7 స్కూల్స్‌కి ఇలా ఈమెయిల్స్ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. ఈ మెయిల్స్ చూసిన వెంటనే యాజమాన్యాలు పోలీసులకు సమాచారం అందించాయి. హుటాహుటిన పోలీసు బృందాలతో పాటు బాంబ్ స్క్వాడ్స్‌ రంగంలోకి దిగాయి. ఆనంద్ నికేతన్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సహా మరి కొన్ని స్కూల్స్‌కీ ఈ మెయిల్స్ వచ్చాయి. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరక్కపోవడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇలా కొందరు దుండగులు పదేపదే స్కూల్స్‌కి మెయిల్స్ పంపించి బెదిరిస్తుండడాన్ని ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి. IP అడ్రెస్‌ల ఆధారంగా ఆ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నాయి. 

ఢిల్లీలో అలజడి..

గత వారమే ఢిల్లీలో దాదాపు 80 స్కూల్స్‌కి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఒక్కసారిగా పోలీసులు అన్ని చోట్లకూ పరుగులు పెట్టారు. బాంబ్ స్క్వాడ్స్‌ కూడా చాలా వేగంగా స్పందించి తనిఖీలు చేపట్టింది. అప్పటికప్పుడు విద్యార్థులందరినీ ఇళ్లకు పంపించేశాయి యాజమాన్యాలు. కొందరు కావాలనే ప్రజల్ని భయపెట్టేందుకు ఇలాంటివి చేస్తున్నారని, కచ్చితంగా వాళ్లని గుర్తిస్తామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అయితే...విదేశాల నుంచి కొందరు ఇలా మెయిల్స్ పంపిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. ఈ మేరకు భారత్ రష్యాకి సమాచారం అందించింది. విచారణకు సహకరించాలని కోరింది. ఇదంతా జరుగుతుండగానే అహ్మదాబాద్‌లో మళ్లీ ఇవే బెదిరింపులు రావడం అలజడి రేపుతోంది.

రష్యానుంచి బెదిరింపులు..?

ఢిల్లీలో స్కూల్స్‌కి బెదిరింపులు వచ్చిన సమయంలోనే లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కనుక్కోవాలని ఆదేశించారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. రష్యన్ డొమైన్ నుంచి ఈ మెయిల్స్ అన్నీ వస్తున్నాయని గుర్తించారు. అయితే..కచ్చితంగా అక్కడి నుంచే ఈ మెయిల్స్ వచ్చాయనుకోడానికి వీల్లేదని, దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని వివరిస్తున్నారు. ఇలాంటివి జరిగినప్పుడు పిల్లలు, తల్లిదండ్రులు ఆందోళనకు గురి కాకూడదని, ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకడం లేదని వెల్లడించారు పోలీసులు. కొందరు కావాలనే ఇలా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అసహనం స్పష్టం చేశారు. గతంలోనూ ఢిల్లీ సహా మరి కొన్ని చోట్ల ఇదే తరహా బెదిరింపులు వచ్చాయి. అయితే..ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువ కావడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని భయపడుతున్నారు. 

Also Read: LS Elections 2024: ఎన్నికలకు ఏనుగుల ఆటంకం, తరమలేక తల పట్టుకుంటున్న అధికారులు

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Fuel Price Hike India 2026: భారత్‌లో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు! సామాన్యులపై పెను భారం!
భారత్‌లో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు! సామాన్యులపై పెను భారం!
Viral Video: కైల్ జేమీసన్ అగ్రెసివ్ సెలెబ్రేషన్.. వైభవ్ సూర్యవంశీకి ఫైరీ సెండ్ ఆఫ్! ఫ్యాన్స్ ఫైర్
కైల్ జేమీసన్ అగ్రెసివ్ సెలెబ్రేషన్.. వైభవ్ సూర్యవంశీకి ఫైరీ సెండ్ ఆఫ్! ఫ్యాన్స్ ఫైర్
First Barrier-Free Toll System in Inida: హైవేలపై క్యూలకు స్వస్తి! భారత్‌లోనే తొలి బారియర్ లెస్‌ టోల్‌ ప్లాజా ప్రారంభం!
హైవేలపై క్యూలకు స్వస్తి! భారత్‌లోనే తొలి బారియర్ లెస్‌ టోల్‌ ప్లాజా ప్రారంభం!
Cell phone alert: శనివారం మీ మొబైల్‌కు అత్యవసర హెచ్చరికలు.. భయపడాల్సిన పనే లేదు - ఎందుకో తెలుసా?
శనివారం మీ మొబైల్‌కు అత్యవసర హెచ్చరికలు.. భయపడాల్సిన పనే లేదు - ఎందుకో తెలుసా?

వీడియోలు

Kieron Pollard Backs Jasprit Bumrah IPL 2026 | బుమ్రాపై పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు
RCB vs GT Highlights IPL 2026 | ఆర్‌సీబీ జోరుకు బ్రేక్ వేసిన గుజరాత్
Vaibhav Reply about AI Chip in Bat IPL 2026 | వైభవ్ బ్యాట్‌లో ఏఐ చిప్ ఉందా?
Virat Kohli Fielding Mistake vs GT IPL 2026 | విరాట్ చేసిన తప్పుతో గుజరాత్ ఖాతాలో 5 పరుగులు
RCB Batting Collapse vs GT IPL 2026 | గుజరాత్ బౌలర్ల ధాటికి ఆర్‌సీబీ క్లీన్ స్వీప్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fuel Price Hike India 2026: భారత్‌లో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు! సామాన్యులపై పెను భారం!
భారత్‌లో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు! సామాన్యులపై పెను భారం!
GST collections: ఒక్క నెలలో రెండున్నర లక్షల కోట్ల జీఎస్టీ కట్టిన ప్రజలు - ఇంత భారీ పన్ను వసూళ్లు దేనికి సంకేతం?
ఒక్క నెలలో రెండున్నర లక్షల కోట్ల జీఎస్టీ కట్టిన ప్రజలు - ఇంత భారీ పన్ను వసూళ్లు దేనికి సంకేతం?
CM alcohol test: సీఎం తాగి అసెంబ్లీకి వచ్చారని ఆరోపణలు - లైవ్‌లో ఆల్కహాల్ టెస్టుకు విపక్షాల డిమాండ్ - పంజాబ్‌లో ఓ రేంజ్ రాజకీయం
సీఎం తాగి అసెంబ్లీకి వచ్చారని ఆరోపణలు - లైవ్‌లో ఆల్కహాల్ టెస్టుకు విపక్షాల డిమాండ్ - పంజాబ్‌లో ఓ రేంజ్ రాజకీయం
First Barrier-Free Toll System in Inida: హైవేలపై క్యూలకు స్వస్తి! భారత్‌లోనే తొలి బారియర్ లెస్‌ టోల్‌ ప్లాజా ప్రారంభం!
హైవేలపై క్యూలకు స్వస్తి! భారత్‌లోనే తొలి బారియర్ లెస్‌ టోల్‌ ప్లాజా ప్రారంభం!
Peddi Release Date : పెద్ది కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది - సమ్మర్‌లో బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే...
పెద్ది కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది - సమ్మర్‌లో బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే...
Jetlee Review - 'జెట్లీ' రివ్యూ: 'మత్తు వదలరా' టైపులో నవ్వించారా? సత్య - రితేష్ సినిమా ఎలా ఉందంటే?
'జెట్లీ' రివ్యూ: 'మత్తు వదలరా' టైపులో నవ్వించారా? సత్య - రితేష్ సినిమా ఎలా ఉందంటే?
Nara Rohith : నారా వారి ఇంటికి త్వరలో కొత్త అతిథి - తండ్రి కాబోతోన్న నారా రోహిత్... ఒకేసారి గుడ్ న్యూస్‌లు
నారా వారి ఇంటికి త్వరలో కొత్త అతిథి - తండ్రి కాబోతోన్న నారా రోహిత్... ఒకేసారి గుడ్ న్యూస్‌లు
Affordable Mileage Bikes: మంచి మైలేజీ ఇస్తూ బడ్జెట్‌లో వచ్చే బైక్‌లు ఇవే! ధర, ఫీచర్స్‌ గురించి తెలుసుకోండి!
మంచి మైలేజీ ఇస్తూ బడ్జెట్‌లో వచ్చే బైక్‌లు ఇవే! ధర, ఫీచర్స్‌ గురించి తెలుసుకోండి!
Embed widget