Breaking News Telugu Live Updates: సర్వీసులను పునరుద్ధరించాలని విశాఖ రైల్వే అధికారులకు ఆదేశం
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
LIVE

Background
పట్టపగలే అత్యంత దారుణంగా స్నేహితుడి తండ్రిని హత్య చేసిన యువకుడు
చిత్తూరు జిల్లా, చౌడేపల్లె మండలం, పెద్దకంపల్లిలో ఓ యువకుడు పట్ట పగలే ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా నరికి చంపాడు.. అదే గ్రామానికి చేందిన శ్రీనివాసులు రావు తన ఇద్దరూ కుమారులతో కలిసి నివాసం ఉండేవాడు.. అయితే గత కొద్ది రోజులుగా తండ్రి మాటలను ఏమాత్రం లెక్క చేయకుండా చెడు తిరుగుళ్ళు తిరుగుతూ చుట్టు పక్కల గ్రామాల్లో అప్పులు చేసి జల్సాలు చేసేవారు.. ఇదే విషయంపై గత రెండు ఏళ్ళుగా తండ్రి, కుమారులకు తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి.. ఎప్పటికైనా తమ కుమారుల్లో మార్పు రాకుండా పోతుందా అనే ఆశతో శ్రీనివాసురావు తన కుమారులు చేసిన అప్పులు తీర్చేవాడు.. అయితే గ్రామంలో ఉంటున్న గిరిబాబు నాయుడు అనే యువకుడితో శ్రీనివాసురావు ఇద్దరు కుమారులు స్నేహంగా మెలుగుతున్నట్లు శ్రీనివాసురావు తెలుసుకున్నాడు.. వీరిపై శ్రీనివాసురావు ఆరా తీసేవాడు.. ముగ్గురు రోజు పీకల వరకూ తాగి, పేకాట ఆడుతూ కాలం గడిపేవారు.. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడి చేసి గాయ పరిచేవారు.. దీంతో గ్రామంలో ఎవరూ వీరిని పెద్దగా పట్టించుకునేవారు కాదు.. రోజు రోజుకి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న తన కుమారులను తలుచుకుని శ్రీనివాసురావు కుమిలి పోయేవాడు.. అనేక మార్లు గ్రామంలో పంచాయతీ పెట్టి ముగ్గరిని హెచ్చరించినా వారు తీరు మార్చుకోకుండా పుల్ గా మద్యం సేవించి గ్రామస్తుల గొడవకు ఈడ్చేవారు.. అయితే తన కుమారులు చెడి పోయేందుకు కారణంమైన గిరిబాబు నాయుడిని పిలిచిన శ్రీనివాసులు తన కుమారులతో చేరొద్దని, వారి భవిష్యత్తు నాశనం అవుతుందని పలుమార్లు హెచ్చరించాడు.. ఇవేవి పట్టించుకోని గిరిబాబు నాయుడు రోజులాగే మద్యం సేవించి శ్రీనివాసురావు కుమారులతో పేకాట ఆడేవాడు.. దీంతో ఆగ్రహించిన శ్రీనివాసు రావు ఈ రోజు మధ్యాహ్నం తన కుమారులతో చేరద్దని గిరిబాబు నాయుడు ఇంటి వద్దకు వెళ్ళి గొడవ పెట్టుకున్నాడు.. గిరిబాబు నాయుడు, శ్రీనివాసురావులు ఇద్దరూ ఒకరిని ఒకరు దూషించుకుని, వాగ్వాదంకు దిగ్గారు.. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన గిరిబాబు నాయుడు తన నివాసంలో ఉన్న కత్తిని తీసుకుని ఒక్కసారిగా శ్రీనివాసులరావుపై దాడి చేసి గ్రామస్తులు అందరూ చూస్తుండం గానే అతికిరాతకంగా నరికి చంపాడు.
Visakhapatnam Rail Service: సర్వీసులను పునరుద్ధరించాలని విశాఖ రైల్వే అధికారులకు ఆదేశం
విశాఖపట్నం: సర్వీసులను పునరుద్ధరించాలని విశాఖ రైల్వే అధికారులకు ఆదేశం
నగర సరిహద్దు స్టేషన్లలో ఆగి ఉన్న రైళ్ళను విశాఖ కు రప్పించే ప్రయత్నాలు ప్రారంభం
విశాఖ స్టేషన్ నుంచి రెండు గంటలకు ప్రారంభం కానున్న తిరుమల ఎక్స్ప్రెస్(17488)
విజయనగరం లో ఆగిఉన్న హౌరా - యశ్వంత్ పూర్, ప్రశాంతి ఎక్స్ప్రెస్ కు కూడా క్లియరెన్స్
మూడు గంటలకు మరోసారి భద్రతా ఏర్పాట్లను సమీక్షించి అన్ని ట్రైన్స్ ను పునరుద్ధరించాలని నిర్ణయం
Agnipath Protests Effect: కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్ నిలిపివేత.. కొత్తవలసలో ఒడిశా వాసి మృతి
విజయనగరం: కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్ కొత్తవలసలో నిలిపివేయడంతో చికిత్స కోసం ఒడిశా నుంచి వచ్చిన జోగేష్ బెహరా(70) మృతి చెందారు. గుండెజబ్బు చికిత్స కోసం విశాఖ వస్తుండగా అగ్నిపథ్ అల్లర్లతో విశాఖ వెళ్లాల్సిన రైలు కొత్తవలసలో నిలిపివేశారు. సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో కొత్తవలసలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స పొందుతూనే జోగేష్ బెహరా మృతిచెందారు.
Rakesh Last Journey: మధ్యాహ్నం దబీర్ పేటలో రాకేష్ అంత్యక్రియలు
అగ్నిపథ్ నిరసనలో భాగంగా జూన్ 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన కాల్పుల్లో మృతి చెందిన దామెర రాకేష్ అంత్యక్రియలు నేటి మధ్యాహ్నం ఖానాపురం మండలంలోని దబీర్ పేటలో నిర్వహించనున్నారు. ఇప్పటికే అంతిమయాత్ర 60 కిలోమీటర్ల మేర కొనసాగనున్నది.
Revanth Reddy Arrested: ఘట్‌కేసర్ వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అరెస్ట్
ఘట్కేసర్ వద్ద టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు..
నర్సంపేటకు వెళ్తుండగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. తను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడినని ఈ ప్రాంతం తన నియోజకవర్గంలో ఉందని ఎలా అడ్డుకుంటారని పోలీసులను నిలదీశారు రేవంత్ రెడ్డి. అన్యాయంగా తనను అరెస్ట్ చేయకూడదంటూ పోలీసులతో రేవంత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.
నిన్న సికింద్రాబాద్ ఘటనలో మృతి చెందిన రాకేష్ పరామర్శకు బయల్దేరిన టిపిసిసి అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్.
-బీబీనగర్ టోల్ గేట్ వద్ద రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసిన పోలీసులు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

