News
News
X

African Pastor Resurrection: నేను దేవుడిని.. బతికుండగానే పాస్టర్‌ను పూడ్చేశారు, 3 రోజుల తర్వాత తవ్వి చూస్తే..

ఆ పాస్టర్‌ను బతికుండగానే గొయ్యి తీసి సజీవ సమాధి చేశారు. మూడు రోజుల తర్వాత అతడు ప్రాణాలతో తిరిగి వస్తాడని భావించి సమాధి తవ్వితే..

FOLLOW US: 
 
మానవ అవతారం దాల్చిన దేవుళ్లకు చావు ఉండదని, సజీవంగా సమాధిలోకి వెళ్లిపోతారని కొంతమంది నమ్ముతారు. సమయం వచ్చినప్పుడు మళ్లీ సమాధి నుంచి ప్రాణాలతో బయటకు వస్తారని అనుకుంటారు. ఆఫ్రికాకు చెందిన ఓ పాస్టర్ కూడా ఇదే అనుకున్నాడు. ‘‘నేను దేవుడి.. బతికుండగానే నన్ను సమాధి చేయండి. మూడు రోజుల తర్వాత జీసస్‌లా ప్రాణాలతో తిరిగి వస్తా..’’ అని తన అనుచరులకు చెప్పాడు. అది నిజమే కాబోలు అనుకుని వారు అతడు చెప్పినట్లే చేశారు. మరి, అతడు మూడు రోజులైనా సమాధిలో బతికే ఉన్నాడా? ప్రాణాలతో బయటకు వచ్చాడా? 

జాంబియన్ పట్టణంలోని జియోన్ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తున్న 22 ఏళ్ల జేమ్స్ సకారా.. తనని తాను దైవం పంపిన దూతగా భావించేవాడు. జీసస్ తర్వాత తానే అన్నట్లుగా వ్యవహరించేవాడు. అయితే, ప్రజల్లో నమ్మకం కలగడం లేదనే కారణంతో సజీవ సమాధిలోకి వెళ్లాలని ప్లాన్ చేశాడు. తన అనుచరులు వద్దని వారిస్తున్నా.. అతడు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. పిక్నిక్ వెళ్లిన ఈజీగా మూడు రోజులు సమాధిలో ఉండి వచ్చేస్తానని చెప్పాడు. 

‘‘ఆ దేవుడి బిడ్డలా నేను నేను కూడా మూడు రోజుల తర్వాత ప్రాణాలతో బయటకు వచ్చేస్తాను. మీరెవరూ ఆందోళన చెందవద్దు’’ అని తెలిపాడు. అయితే, ఈ విషయాన్ని ప్రజలకు చెప్పలేదు. ముగ్గురు చర్చి సిబ్బందితో కలిసి ఈ ప్లాన్ చేశాడు. సుమారు నాలుగు అడుగుల గొయ్యి తవ్వారు. ఆ తర్వాత జేమ్స్ చేతులను వెనక్కి కట్టేసి బతికుండగానే అతడిని పూడ్చిపెట్టేశారు. మూడు రోజుల తర్వాత.. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పారు. పాస్టర్ జేమ్స్ సమాధి నుంచి బయటకు రానున్నారని చెప్పారు. దీంతో జనమంతా అక్కడ గుమిగూడారు. 

చర్చి సిబ్బంది సమాధి తవ్వారు. జేమ్స్ బతికి ఉంటాడని భావించారు. బ్యాడ్ లక్.. అప్పటికే జేమ్స్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అతడు గాఢ నిద్రలో ఉన్నాడని, తప్పకుండా బతుకుతాడంటూ అతడి అనుచరులు ప్రార్థనలు చేశారు. కానీ, జేమ్స్ బతకలేదు. అతడిని సమాధిలో పడుకోబెట్టిన ముగ్గురు సిబ్బందిలో ఒకరు పోలీసులకు లొంగిపోయాడు. మిగతా ఇద్దరు పరారిలో ఉన్నారు. అయితే, ఇలాంటి స్టంట్లు ఆఫ్రికాలో సర్వసాధారణమే. అక్కడి ప్రజలను నమ్మించేందుకు కొంతమంది ఇలాంటి స్టంట్లు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. విశ్వాసం ఉండవచ్చు.. కానీ, మూఢ విశ్వాసం ఉండకూడదని పలువురు హితవు పలుకుతున్నారు. 

News Reels

Also Read: ఈ స్కూల్‌లో ముగ్గురే విద్యార్థులు.. వీరికి చదువు చెబితే రూ.57 లక్షలు జీతం, ఎక్కడో తెలుసా?

ముఖాల మీద పిత్తుతూ..: కొంతమంది పాస్టర్లు చాలా వింతగా ప్రవర్తిస్తుంటారు. కొద్ది రోజుల కిందట లింపొపోలోని సియాందానీ గ్రామంలో సెవెన్‌ఫోల్డ్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్‌కు చెందిన పాస్టర్ క్రిస్ట్ పెనేలోప్ ప్రజల ముఖాల మీద కూర్చొని పిత్తుతూ వార్తలకెక్కాడు. చర్చిలో అతడి అరాచకాన్ని చూసి హడలిపోయిన ఓ వ్యక్తి ఫిర్యాదుతో ఈ విషయం బయటపడింది. దీనిపై పాస్టర్ క్రిస్ట్ స్పందిస్తూ.. తాను దేవుడి శక్తిని ప్రదర్శిస్తున్నానంతే అని తెలిపాడు. వ్యక్తి ముక్కు వద్ద పిత్తినట్లయితే హీలింగ్ పవర్ పెరుగుతుందని, అనారోగ్య సమస్యలు తీరిపోతాయని తెలిపాడు. 

Also Read: హిమాలయన్ సాల్ట్ అంటే ఏమిటీ..? ఇది ఆరోగ్యానికి మంచిదేనా?

Also Read: వేడి నీళ్లు vs చన్నీళ్లు.. ఏ నీటితో స్నానం చేస్తే ఆరోగ్యం?

Published at : 28 Aug 2021 03:38 PM (IST) Tags: African Pastor Resurrection African Pastor African Pastor Dies African Pastor Emulate Jesus African Pastor Three-Day Resurrection Resurrection ఆఫ్రికా పాస్టర్

సంబంధిత కథనాలు

TRS To BRS: ఇక భారత రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్, జెండా ఆవిష్కరణ - ఈసీకి కేసీఆర్ సంతకం చేసిన లేఖ

TRS To BRS: ఇక భారత రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్, జెండా ఆవిష్కరణ - ఈసీకి కేసీఆర్ సంతకం చేసిన లేఖ

Hyderabad Crime News: ఇష్టపడ్డ పాపానికి బ్లేడు దాడికి గురైన యువకుడు

Hyderabad Crime News: ఇష్టపడ్డ పాపానికి బ్లేడు దాడికి గురైన యువకుడు

Himachal Congress Meet: హిమాచల్ సీఎం పీఠంపై ఇంకా వీడని చిక్కుముడి, షిమ్లాలో ఎమ్మెల్యేల మీటింగ్

Himachal Congress Meet: హిమాచల్ సీఎం పీఠంపై ఇంకా వీడని చిక్కుముడి, షిమ్లాలో ఎమ్మెల్యేల మీటింగ్

BSNL 5G Service: 5 నెలల్లో 5జీకి అప్‌గ్రేడ్‌ - టీసీఎస్‌ను సాయం కోరిన బీఎస్ఎన్ఎల్!

BSNL 5G Service: 5 నెలల్లో 5జీకి అప్‌గ్రేడ్‌ - టీసీఎస్‌ను సాయం కోరిన బీఎస్ఎన్ఎల్!

Hyderabad Racing: రేపటి నుంచి హైదరాబాద్‌లో ఇండియన్ రేసింగ్ లీగ్ - ఈ రోడ్లు మూసివేత

Hyderabad Racing: రేపటి నుంచి హైదరాబాద్‌లో ఇండియన్ రేసింగ్ లీగ్ - ఈ రోడ్లు మూసివేత

టాప్ స్టోరీస్

CM KCR Speech: పవర్ ఐల్యాండ్‌గా హైదరాబాద్‌, న్యూయార్క్‌లో కరెంటు పోవచ్చేమో! ఇక్కడ అస్సలు పోదు: కేసీఆర్

CM KCR Speech: పవర్ ఐల్యాండ్‌గా హైదరాబాద్‌, న్యూయార్క్‌లో కరెంటు పోవచ్చేమో! ఇక్కడ అస్సలు పోదు: కేసీఆర్

షర్మిల పాదయాత్రకు నో పర్మిషన్- తేల్చి చెప్పిన వరంగల్ పోలీసులు

షర్మిల పాదయాత్రకు నో పర్మిషన్- తేల్చి చెప్పిన వరంగల్ పోలీసులు

JD Waiting For Party : విశాఖ నుంచి పోటీ ఖాయం - సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఏ పార్టీలోకి ?

JD Waiting For Party :  విశాఖ నుంచి పోటీ ఖాయం - సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఏ పార్టీలోకి ?

Sonu Sood New Car: సోనూసూద్ గ్యారేజీలోకి మరో లగ్జరీ కారు, కాస్ట్ ఎంతో తెలుసా?

Sonu Sood New Car: సోనూసూద్ గ్యారేజీలోకి మరో లగ్జరీ కారు, కాస్ట్ ఎంతో తెలుసా?