అన్వేషించండి

ABP EXCLUSIVE: 'భయపడుతూ బతకలేను.. తాలిబన్లు చెప్పింది చేయలేను.. అందుకే పారిపోయా'

ఇటీవల తాలిబన్ నేతను ఇంటర్వ్యూ చేసిన అఫ్గాన్ మహిళా జర్నలిస్ట్ దేశం విడిచి వెళ్లిపోయారు. తాలిబన్ల భయంతో కుటుంబ సమేతంగా ఖతార్ కు వెళ్లిపోయినట్లు ఆమె చెప్పారు. ఈ మేరకు ABPతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడారు.

అమెరికా దళాలు పూర్తిగా వెనుదిరిగిన తర్వాత అఫ్గానిస్థాన్ ఎమైపోతుందోనని ప్రపంచం ఆందోళన చెందుతోంది. అమెరికా దళాలు ఉన్నప్పుడే తాలిబన్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. మరి ఇప్పుడు ఇంకెత్త రెచ్చిపోతారోనని అఫ్గాన్ వాసులు హడలిపోతున్నారు.

ముఖ్యంగా మహిళలపై మళ్లీ ఆంక్షలు తప్పవని ఇప్పటికే పలు సంఘటనలతో అర్థమైంది. ఇది ముందే గ్రహించిన అఫ్గాన్ వాసులు ఇప్పటికే చాలా మంది దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇటీవల తాలిబన్ నేతను ఇంటర్వ్యూ చేసి సంచలనం సృష్టించిన జర్నలిస్ట్ బెహెస్తా అర్ఘాంద్‌ కూడా అఫ్గాన్ ను విడిచి వెళ్లారు. అయితే ఆమె ABPతో ప్రత్యేకంగా మాట్లాడారు.

భయపడి వెళ్లిపోయాను..

" తాలిబన్లు చెప్పినట్లు తాను పనిచేయలేనని ఆమె అన్నారు. అందరిలానే తానూ తాలిబన్ల భయంతోనే దేశాన్ని విడిచి కుటుంబ సమేతంగా ఖతార్ వెళ్లిపోయినట్లు ఆమె తెలిపారు. తనతో పాటు పనిచేసిన చాలా మంది జర్నలిస్టులు దేశాన్ని విడిచి పారిపోయినట్లు స్పష్టం చేశారు. తాలిబన్లు చెప్పిన విధంగా పనిచేయడానికి నేను ఒప్పుకోలేదు. వారికి మద్దతుగా పనిచేయాలని నాపై ఒత్తిడి తెచ్చారు. నేను చాలా భయపడ్డాను. అందుకే కుటుంబంతో ఖతార్ వెళ్లిపోయాను. తాలిబన్లు తాము చెప్పిన మాటను నిలబెట్టుకొని జర్నలిస్టులు, మహిళలకు స్వేచ్ఛను ఇస్తే అప్పుడు దేశానికి తిరిగి వస్తాను.                                       "
-  బెహెస్తా అర్ఘాంద్‌, అఫ్గానిస్థాన్ జర్నలిస్ట్

మీడియా, అధికార యంత్రాంగంలో మహిళలు పనిచేయడానికి తాలిబన్లు అనుమతించరని ఆమె అన్నారు. మహిళా హక్కులు, మానవ హక్కులను తాలిబన్లు కాలరాస్తున్నారని బెహెస్తా అన్నారు. బాలికల విద్య కోసం తాలిబన్లు ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించారు.  

Also Read: Afganisthan Crisis Update: అఫ్గానిస్థాన్ కు అమెరికా బైబై.. తాలిబన్లు జాయ్ జాయ్

సంచలన ఇంటర్వ్యూ..

ఆగస్టు 17న అఫ్గాన్‌ చరిత్రలో తొలిసారి తాలిబన్‌ ప్రతినిధి టీవీ స్టూడియోలో కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చాడు. అది కూడా ఓ మహిళా యాంకర్‌కు ఇవ్వడం సంచలనమే. బెహెస్తా అర్ఘాంద్‌ ఈ ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా మహిళా హక్కులను తాము కాలరాయబోమని చెప్పేందుకు తాలిబన్లు ప్రయత్నించారు. అయితే ఇది జరిగిన కొన్ని రోజులకే మహిళలను ఉద్యోగాలకు రాకుండా అడ్డుకున్నారు. ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలిచ్చారు. పైకి మాత్రం మహిళా హక్కులను కాపాడతామని చెబుతున్నారు.

Also Read: Yohani De Silva: ‘మణికే మాగే హితే’.. ఈ వైరల్ సాంగ్ పాడిన యొహానీ ఎవరో తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ, టాప్ కంపెనీనే.. అయినా బ్లాస్ట్!ప్రసంగం మధ్యలోనే  ఏడ్చేసిన కాకినాడ కలెక్టర్పతనంతో ఆసీస్ పర్యటన ప్రారంభంబోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
'తెలంగాణలో అదానీకి సీఎం రేవంత్ రెడ్డి సహకారం' - ఆ ఒప్పందాలు రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్
CM Chandrababu: 'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
'వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అనేదే నినాదం' - జగన్ హయాంలో ఏపీ ప్రతిష్ట దెబ్బతీశారని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
AP Assembly PAC Issue: జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
జగన్ రాజకీయంతో సీనియర్ నేత పెద్దిరెడ్డికి అవమానం - పీఏసీ ఎన్నిక విషయంలో సలహాలు తిరగబడ్డాయా ?
TTD : టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్ - ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
టీటీడీ ఉద్యోగుల్లో అన్యమతస్తుల్ని గుర్తించేందుకు స్పెషల్ ఆపరేషన్- ఇళ్లకు వెళ్లి చెక్ చేస్తారా ?
AR Rahman Award: విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
విడాకులతో వార్తల్లో నిలిచిన రెహమాన్‌కు అవార్డు... అంత బాధలో చిరు ఊరట, ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే?
Devaki Nandana Vasudeva Review - దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
దేవకీ నందన వాసుదేవ రివ్యూ: కృష్ణుడు కంసుడి కథకు కొత్త టచ్ - మహేష్ మేనల్లుడి సినిమా ఎలా ఉందంటే?
Food Combinations to Avoid : ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
ఈ ఫుడ్ కాంబినేషన్స్​ని తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త, కలిపి తినకపోవడమే మంచిది
Embed widget