ABP Cvoter Exit Poll 2024: బెంగాల్‌లో దీదీకి పరాభవం, బీజేపీదే హవా - ABP Cvoter ఎగ్జిట్ పోల్ అంచనా
Lok Sabha Election Exit Poll Results 2024: పశ్చిమ బెంగాల్‌లో దీదీకి లోక్‌సభ ఎన్నికల్లో పరాభవం తప్పదని ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు అంచనా వేశాయి.
ABP Cvoter Exit Poll Results 2024: లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ABP Cvoter Exit Poll 2024 అంచనాలు వెలువడ్డాయి. మోదీ సర్కార్ హ్యాట్రిక్ కొడుతుందని ఈ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్‌కి సంబంధించిన అంచనాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య పొలిటికల్‌గా ఎంత శత్రుత్వం ఉంటుందో తెలియంది కాదు. పోలింగ్ జరుగుతుండగానే అక్కడక్కడా బీజేపీ, టీఎమ్‌సీ కార్యకర్తల మధ్య గొడవలు జరిగాయి.
కేంద్రం పశ్చిమ బెంగాల్‌కి ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వడం లేదని చాలా సార్లు మమతా బెనర్జీ నినదించారు. అటు బీజేపీ తాము ఇవ్వాల్సింది ఇచ్చేశామని లెక్కలు చెబుతోంది. ఇలాంటి కీలక సమయంలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఈ వ్యవహారాలన్నీ పక్కన పెడితే...ఈ ఎన్నికల్లో బీజేపీదే పైచేయి అని ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్ 2024 వెల్లడించింది. అక్కడ 27 ఎంపీ స్థానాలు ఉండగా...NDA కూటమి 23-27 స్థానాలు గెలుచుకుంటుందని తెలిపింది. ఇతర పార్టీలు 13-17 స్థానాలు గెలుచుకుంటాయని స్పష్టం చేసింది.
ఇక ఇండీ కూటమి మాత్రం 1-3 స్థానాలకే పరిమితం కానుంది. ఓటు శాతం పరంగా చూసినా ఇండీ కూటమికి 13.2% మాత్రమే ఓట్లు పోల్ అయ్యాయని ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. NDA కూటమికి 42.5% మేర ఓట్లు పోల్ నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి 41.5% ఓట్లు పోల్ అయ్యాయని తెలిపింది. పోలింగ్ శాతం పరంగా చూస్తే పెద్దగా తేడా లేకపోయినా...సీట్ల పరంగా చూస్తే మాత్రం తృణమూల్ బాగా వెనకబడిపోయినట్టుగా ఈ అంచనాలే చెబుతున్నాయి.