ABP Cvoter Opinion Polls: మధ్యప్రదేశ్‌లో గెలుపెవరిది ? కమల్‌నాథ్ జాక్ పాట్ కొట్టబోతున్నారా ?
మధ్యప్రదేశ్‌లో ఏబీపీ , సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో కాంగ్రెస్‌కు్ మొగ్గు కనిపించింది. గతం కన్నా ఎక్కువ సీట్లు గెల్చుకోబోతోందని తేలింది.
ABP Cvoter Opinion Polls: మధ్యప్రదేశ్‌లో ఏపీబీ, సీఓటర్ తాజాగా నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టాలన్నదానిపై స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారని తేలింది. అధికారంలో ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. అయితే అది మరీ తీవ్రంగా లేనప్పటికీ అధికారం కోల్పోవడం మాత్రం ఖాయమని ప్రజలు చెబుతున్నారు. ఏబీపీ న్యూస్ - సీ ఓటర్ ఒపీనియన్ పోల్‌లో కాంగ్రెస్ పట్ల ప్రజలు ఆదరణ చూపించారు. ఓట్ల శాతం కూడా ఆ పార్టీకి మెరుగుపడింది.
బీపీ న్యూస్ - సీ ఓటర్ ఒపీనియన్ పోల్ ప్రకారం ఎవరికి ఎన్ని సీట్లు అంటే
మధ్యప్రదేశ్‌లో మొత్తం అసెంబ్లీ సీట్లు - 230
కాంగ్రెస్ పార్టీ - 124
బీజేపీ - 105
బీఎస్పీ - 01
ఇతరులు -00
115 సీట్లు వస్తే మెజార్టీ సాధించినట్లు. ఈ సారి మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు సాధారణ మెజార్టీ రానుంది. నిజానికి గత ఎన్నిక్లలో కాంగ్రెస్ పార్టీ 114 సీట్లు సాధించింది. సాధారణ మెజార్టీకి ఒక్క సీటే అవసరం కావడంతో బీఎస్పీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన జ్యోతిరాదిత్య సింధియా తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరిపోవడంతో ప్రభుత్వం కుప్పకూలిపోయింది. బీజేపీ తరపున శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆయన ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయిందని.. జ్యోతిరాదిత్య బీజేపీలో ఉన్నప్పటికీ.. ఈ సారి కాంగ్రెస్ పార్టీకే అడ్వాంటేజ్ ఉందని ఒపీనియన్ పోల్ చెబుతోంది. బీజేపీ గతంలో 109 స్థానాలను గెల్చుకుంది. ఈ సారి నాలుగు చోట్ల కోల్పోయే అవకాశం ఉంది.
ఓట్ల శాతం ఎవరికి ఎంత ?
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి అనూహ్యంగా ఓట్ల శాతం పెరనుంది. బీఎస్పీ గత ఎన్నికల్లో ఐదు శాతం ఓట్లు సాధించింది. ఈ సారి ఎక్కువ నష్టపోనుంది.
కాంగ్రెస్ పార్టీ - 44.3
బీజేపీ - 42.1
బీఎస్పీ - 2.2
ఇతరులు - 11.4
ఓటింగ్ ఎప్పుడు?
ఛత్తీస్ గఢ్ లో నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్ లో నవంబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 25న రాజస్థాన్ లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఐదు రాష్ట్రాల ఫలితాలు డిసెంబర్ 3న వెలువడనున్నాయి. నవంబర్ 7న పోలింగ్ జరిగే చోట రేపు సాయంత్రానికి ప్రచారం ముగియనుంది.
Disclaimer- 5 రాష్ట్రాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఛత్తీస్ గఢ్ లో తొలి దశ సీట్లతో మిజోరంలో ప్రచారం రేపు సాయంత్రం ముగియనుంది. ఏబీపీ న్యూస్ కోసం సీ ఓటర్ మొత్తం 5 రాష్ట్రాల్లో తుది ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఈ సర్వేలో సుమారు 63 వేల మందితో మాట్లాడారు. అక్టోబర్ 9 నుంచి నవంబర్ 3 వరకు ఈ చర్చలు జరిగాయి. సర్వేలో తప్పుల మార్జిన్ మైనస్ 3 నుంచి మైనస్ 5 శాతం వరకు ఉంది.