Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ అంటే ఫేకే - మోసగాళ్లను ఎలా పట్టుకోవాలో చూపించిన నెటిజన్ - పోస్టు వైరల్
Cyber fraud : డిజిటల్ అరెస్టు పేరుతో ఫ్రాడ్ చేయబోయిన వారికి షాకిచ్చాడు ఓ నెటిజన్ . ఆ డీటైల్స్ మొత్తం సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.
Digital Arrest : పోలీసులు వచ్చి యూ ఆర్ అండర్ అరెస్ట్ అని అరవడం చాలా సినిమాల్లో చూసి ఉంటాం. పోలీసులు గోడలు దూకి వెళ్లి ఇంట్లో ఉన్న నిందితుల్ని అరెస్టు చేసి తీసుకుపోవడం చూసి ఉంటాం. కానీ డిజిటల్ అరెస్టు అనేది ఎక్కడైనా చూశామా ?. చాలా మంది డిజిటల్ అరెస్ట్ అంటే మన ఫోన్లు, ల్యాప్ ట్యాప్‌లు అన్నీ బ్లాక్ చేసేసి..మనల్ని నిస్సహాయుల్ని చేయడమే డిజిటల్ అరెస్ట్ అనుకుంటారు. కానీ అసలు మోసగాళ్లు డిజిటల్ అరెస్ట్ అంటే ఫోన్‌లో వీడియో కాల్‌లోకి వచ్చి యూ ఆర్ అండర్ అరెస్ట్ అని బెదిరించడమే.
ఇటీవలి కాలంలో డిజిటల్ అరెస్ట్ అనే బూచి చూపించి పెద్ద ఎత్తున డబ్బులు కొట్టేస్తున్న మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా విజయ్ పటేల్ ఆనే వ్యక్తికి కూడా ఇలాంటి మోసగాళ్ల నుంచి కాల్ వచ్చింది. ఓ పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని ఆ పార్శిల్ మీ పేరు మీద ఉందని చెప్పి ప్రారంభించారు. తర్వాత డబ్బులు అడగడం ప్రారంభించారు. ఇందు కోసం వారు ఎంచుకున్న బెదిరింపుల మార్గం డిజిటల్ అరెస్ట్.
DIGITAL ARREST SCAM🚨
— Vijay Patel🇮🇳 (@vijaygajera) October 24, 2024
FIRST TIME LIVE RECORDING.
1. Please read, watch, and share this thread as much as possible so we can save more people from this fraud. pic.twitter.com/n6s0pEuYQu
ఎవరికీ చెప్పవద్దని.. ఇంటి బయట తాము పెట్టిన పోలీసులు ఉన్నారని బెదిరిస్తారు. ఎవరికీ తెలియకుండా లక్షలు బదిలీ చేయించుకుం టారు. ఇంత ఈజీగా ఎలా నమ్ముతారు అంటే.. వారు పోలీస్ స్టేషన్ సెటప్ వేసుకుని ఉంటారు. పక్కాగా నటిస్తారు. అందుకే భయపడిపోతున్నారు. విజయ్ పటేల్ అనే వ్యక్తి ఈ డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసం చేసే వాల్ల బండారాన్ని ప్రత్యేకంగా రికార్డు చేసి మరీ బయట పెట్టాడు. ]
5. To Ensure nobody was with me, he told me to show a 360-degree view with my back camera!
— Vijay Patel🇮🇳 (@vijaygajera) October 24, 2024
He didn't know that I am his father! 😉 pic.twitter.com/CsuhPR2BH2
విజయ్ పటేల్ బయట పెట్టిన వీడియోలను చూసి.. మరోసారి ఎవరూ డిజిటల్ అరెస్ట్ అంటే భయపడాల్సిన పనే ఉండదని అర్థం చేసుకోవచ్చు. సాధాణంగా పోలీసులు, చట్టాల్లో డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు. అందుకే ఎవరూ భయపడవద్దని విజయ్ పటేల్ సలహా ఇస్తున్నాడు.
8. Here is the fake letter in which they used my name and Aadhar card number, which they asked me for at the beginning of this call, but they still made a spelling mistake!
— Vijay Patel🇮🇳 (@vijaygajera) October 24, 2024
Kya Scammer Banenge ye log! pic.twitter.com/kE8QpV5d7E
విజయ్ పటేల్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఈ మోసం మొత్తం వీడియోను చూస్తే ఇక ఎవరూ మోసపోయేందుకు అవకాశం ఉండదు.