X

Most Eligible Bachelor Review: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సమీక్ష: అయ్యగారు విపరీతంగా నవ్విస్తారు..

MEB Review: అఖిల్ అక్కినేని హీరోగా, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదల అయింది.

FOLLOW US: 

అఖిల్ అక్కినేని, పూజా హెగ్దే జంటగా.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తీసిన మూడు సినిమాలు నిరాశపరచడంతో హీరో అఖిల్‌కి, అప్పుడెప్పుడో తగిలిన ఆరెంజ్ దెబ్బ నుంచి ఇంకా కోలుకోని భాస్కర్‌కు ఈ చిత్రం ఎంతో కీలకం. గుచ్చే గులాబీ, లెహరాయీ పాటలు ఇప్పటికే సూపర్ హిట్టయి సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ సినిమా ట్రైలర్‌ను స్పైసీ డైలాగులతో యూత్‌ఫుల్‌గా నింపేసినా.. కుటుంబసమేతంగా చూడదగ్గ సినిమా అని హీరో అఖిల్ ప్రమోషన్‌లో చెప్పుకుంటూ వస్తున్నాడు. మరి వీరిద్దరికీ ఎంతో అవసరమైన హిట్ దొరికిందా?


కథ: హర్ష(అఖిల్) న్యూయార్క్‌లో బాగా సెటిలైన కుర్రాడు. 20 రోజులు సెలవు పెట్టుకుని ఈ గ్యాప్‌లోనే పెళ్లి చూపులు, పెళ్లి కూడా చేసుకోవాలనే లక్ష్యంతో ఇండియాకు వస్తాడు. ఉమ్మడి కుటుంబం, సంప్రదాయ బద్ధమైన బ్యాక్‌గ్రౌండ్ ఉండటంతో.. తనకు కాబోయే జీవిత భాగస్వామికి సర్దుకుపోయే మనస్తత్వం ఉంటే చాలు అనుకుంటాడు. అయితే అప్పుడు తనకి స్టాండప్ కమెడియన్ విభ(పూజా హెగ్దే) పరిచయం అవుతుంది. కాబోయే భర్త మీద తనకు ఉన్న ఆలోచనలు.. హర్షను కూడా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయి. దీంతో హర్ష.. విభను ఇష్టపడటం మొదలుపెడతాడు. విభ మాత్రం హర్ష తప్ప ఎవరైనా పర్లేదు అనుకుంటుంది. మరి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అని ఫీలయ్యే హర్ష తర్వాత ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే..


ముందుగా దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఇద్దరు భిన్న ధ్రువాల్లాంటి వ్యక్తుల మధ్య పరిచయం ఏర్పడి.. వారిలో అమ్మాయి ప్రభావం అబ్బాయి మీద పడితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఎంతో హిలేరియస్‌గా చూపించాడు. సినిమాలో చూపించిన ప్రతి పెళ్లిచూపుల ఎపిసోడ్ బాగా పేలింది. మురళీ శర్మ మందు కొట్టే సీన్, ఆ తర్వాత వచ్చే కోర్ట్ సీన్‌లో కూడా విపరీతంగా ఫన్ జనరేట్ అయింది. కామెడీ కోసం ప్రత్యేకమైన ట్రాక్‌లు పెట్టకుండా సిట్యుయేషనల్‌గా ఈ ఫన్ జనరేట్ అవ్వడం పెద్ద ప్లస్ పాయింట్. అలాగే ద్వితీయార్థంలో విభను హర్ష ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించే సీన్లు కూడా బాగా పండాయి. పెళ్లే వద్దనుకున్న అమ్మాయిలో హీరో ప్రేమను పుట్టించే సన్నివేశాలను ఎంతో కన్విన్సింగ్‌గా రాసుకున్నాడు. అంతే ఎఫెక్టివ్‌గా వాటిని తెరకెక్కించాడు కూడా. గుచ్చే గులాబీ, లెహరాయీ పాటల పిక్చరైజేషన్ కూడా అద్భుతంగా ఉంది. ఈ రెండు పాటలూ సినిమాకు పెద్ద ప్లస్ కూడా.


అయితే విపరీతమైన ఫన్‌తో ముగిసిన ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ కాస్త ఎమోషనల్‌గా సాగుతుంది. అదే సినిమాకు కాస్త మైనస్‌గా మారింది. ముఖ్యంగా క్లైమ్యాక్స్‌లో విభ తన ప్రేమను స్టాండప్ కామెడీ రూపంలో చెప్పడం, ఆ తర్వాత హర్ష రెండు కుటుంబాల పెద్దలను కన్విన్స్ చేసే సన్నివేశాలు అంత ఎఫెక్టివ్‌గా ఉండవు. ఆరెంజ్ సినిమాలో ప్రేమ ఎక్కువ కాలం ఒకేలా ఉండదు అని చెప్పిన భాస్కర్.. ఈ సినిమాలో పెళ్లి తర్వాత జీవితం గురించి చర్చించాడు. ఆరెంజ్‌లో లాగానే గొడవపడే హీరో అక్క, బావల ఎపిసోడ్ ఇందులో కూడా ఉంటుంది. ఆరెంజ్ తరహలోనే ప్రేమ లేకపోయినా ఉంది అనుకుంటూ సర్దుకుపోయే జంటలను ఇందులో కూడా చూపిస్తాడు. ఆరెంజ్‌లో ప్రేమకథ కాబట్టి.. హీరో, హీరోయిన్ల మధ్యే కథ తిరుగుతూ ఉంటుంది.. ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువగా ఉండవు, అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లో కథంతా పెళ్లి చుట్టూ తిరుగుతుంది కాబట్టి ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కూడా చూపించారు. ఇక ఈ సినిమాలో హ్యూమర్‌ను అద్భుతంగా పండించాడు కాబట్టి బొమ్మరిల్లు భాస్కర్ వైపు యువ హీరోలను మొగ్గు చూపే అవకాశం ఉంది.


గోపి సుందర్ అందించిన పాటల్లో గుచ్చే గులాబీ, లెహరాయీ పాటలు ఇప్పటికే సూపర్ హిట్ కాగా.. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. గీతా ఆర్ట్స్ 2 నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. ఖర్చుకి వెనకాడకుండా ఈ సినిమా తెరకెక్కిందని అర్థం చేసుకోవచ్చు.


ఇక నటీనటుల విషయానికి వస్తే.. అఖిల్ గత సినిమాల కంటే మెరుగైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ప్రథమార్థంలో పెళ్లి విషయంలో తను కన్ఫ్యూజన్‌లో ఉంటూ.. ద్వితీయార్థంలో హీరోయిన్ కన్ఫ్యూజన్‌ను పోగొట్టే పాత్రలో ఎంతో మెచ్యూర్డ్‌గా నటించాడు. ఇక పూజా హెగ్దే కూడా గత చిత్రాల కంటే విభిన్నమైన పాత్ర చేసింది. ప్రధానంగా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఇక మురళీ శర్మ, ప్రగతి పాత్రలు కొన్ని నవ్వులు పూయిస్తాయి. మిగతా నటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.


ఓవరాల్‌గా చూస్తే.. హిలేరియస్‌గా సాగిన ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ కొద్దిగా డౌన్ అవుతుంది. పాటలు వినడానికి, చూడటానికి కూడా బాగుండటం ఈ బ్యాచ్‌లర్‌కి కలిసొచ్చే అంశం. యువతను ఆకట్టుకునే ఈ సినిమాకి.. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్టయ్యారంటే మాత్రం అఖిల్ ఫస్ట్ హిట్ కొట్టేసినట్లే..

Tags: Pooja hegde Akhil Akkineni Bommarillu Bhaskar Most Eligible Bachelor Movie Review Most Eligible Bachelor Review Most Eligible Bachelor Review in Telugu Guche Gulabi Leharaayi MEB Review

సంబంధిత కథనాలు

Money Heist S5 Volume 2 Review: మనీ హెయిస్ట్ రివ్యూ: ఎండింగ్ ఇరగదీశారు.. మొదలెడితే ఆపడం కష్టమే!

Money Heist S5 Volume 2 Review: మనీ హెయిస్ట్ రివ్యూ: ఎండింగ్ ఇరగదీశారు.. మొదలెడితే ఆపడం కష్టమే!

SkyLab Movie Review: స్కైలాబ్ రివ్యూ: ఆకాశమంత తాపీగా సాగినా.. మంచి ప్రయత్నమే!

SkyLab Movie Review: స్కైలాబ్ రివ్యూ: ఆకాశమంత తాపీగా సాగినా.. మంచి ప్రయత్నమే!

Marakkar Review 'మరక్కార్' రివ్యూ: మనకు తెలియని యోధుడు... తెలిసిన సినిమా!

Marakkar Review 'మరక్కార్' రివ్యూ: మనకు తెలియని యోధుడు... తెలిసిన సినిమా!

Akhanda Review 'అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!

Akhanda Review 'అఖండ' రివ్యూ: జాతర... బాలకృష్ణ మాస్ జాతర!

Hellbound Review: హెల్‌బౌండ్ సిరీస్ రివ్యూ: స్క్విడ్ గేమ్‌ను మించే స్థాయిలో ఉందా?

Hellbound Review: హెల్‌బౌండ్ సిరీస్ రివ్యూ: స్క్విడ్ గేమ్‌ను మించే స్థాయిలో ఉందా?
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Gold-Silver Price: రూ.190 పెరిగిన బంగారం ధర.. రూ.600 ఎగబాకిన వెండి.. మీ ప్రాంతంలో ఇవాల్టి ధరలు ఇవీ..

Gold-Silver Price: రూ.190 పెరిగిన బంగారం ధర.. రూ.600 ఎగబాకిన వెండి.. మీ ప్రాంతంలో ఇవాల్టి ధరలు ఇవీ..

CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!

CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!

Margasira Masam: ఆర్థిక సమస్యలు తీరి ఐశ్వర్యాన్నిచ్చే వ్రతం ఇది..

Margasira Masam: ఆర్థిక సమస్యలు తీరి ఐశ్వర్యాన్నిచ్చే  వ్రతం ఇది..

Horoscope Today 9 December 2021: ఈ రాశివారు మంచి సలహాలు ఇస్తారు.. మీరు అందులో ఉన్నారా, ఈ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 9 December 2021: ఈ రాశివారు మంచి సలహాలు ఇస్తారు.. మీరు అందులో ఉన్నారా, ఈ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి