News
News
X

Hit 2 Review - 'హిట్ 2' రివ్యూ : అడివి శేష్ హీరోగా నాని తీసిన సినిమా ఎలా ఉందంటే?

Hit 2 Movie Review : అడివి శేష్ కథానాయకుడిగా నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిర్‌నేని నిర్మించిన సినిమా 'హిట్ 2'. విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'హిట్' ఫ్రాంచైజీలో రెండో చిత్రమిది.

FOLLOW US: 
Share:

సినిమా రివ్యూ : హిట్ 2
రేటింగ్ : 2.75/5
నటీనటులు : అడివి శేష్‌, మీనాక్షి చౌద‌రి, రావు ర‌మేష్‌, పోసాని కృష్ణ ముర‌ళి, త‌నికెళ్ల భ‌ర‌ణి, శ్రీనాథ్ మాగంటి, కోమ‌లి ప్ర‌సాద్ త‌దిత‌రులు
ఛాయాగ్రహణం : మ‌ణి కంద‌న్‌ ఎస్‌
నేపథ్య సంగీతం : జాన్ స్టీవార్ట్ ఏడూరి
స్వరాలు : ఎం.ఎం. శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి
సమర్పణ : నాని 
నిర్మాత : ప్రశాంతి త్రిపిర్‌నేని
రచన, దర్శకత్వం : శైలేష్ కొలను 
విడుదల తేదీ: డిసెంబర్ 2, 2022

నిర్మాతగా నాని తీసిన విజయవంతమైన సినిమాల్లో 'హిట్' ఒకటి. శైలేష్ కొలను దర్శకుడిగా పరిచయమైన ఆ సినిమాలో విశ్వక్ సేన్ హీరో. 'హిట్' సూపర్ హిట్ కావడంతో ఆ ఫ్రాంచైజీలో ఏడు సినిమాలు తీయాలని నిర్ణయించారు. హిట్ సినిమాటిక్ యూనివర్స్‌లో రెండో సినిమా 'హిట్ 2' (Hit 2 Movie)లో అడివి శేష్ (Adivi Sesh) హీరో. మీనాక్షి చౌదరి హీరోయిన్. దర్శక నిర్మాతలు సేమ్. ఈ సినిమా ఎలా ఉందంటే? (Hit 2 Review Telugu)

కథ (Hit 2 Movie Story) : కేడీ అలియాస్ కృష్ణదేవ్ (అడివి శేష్) విశాఖలో ఎస్పీ. ఓ మర్డర్ కేసును సాల్వ్ చేసిన తర్వాత క్రైమ్స్ చేసేవాళ్లను 'కోడి బుర్రలు' అంటాడు. వాళ్ళను పట్టుకోవడానికి పెద్ద టైమ్ అవసరం లేదని  చెబుతాడు. అటువంటి కేడీకి ఓ సీరియల్ కిల్లర్ సవాల్ విసురుతాడు. నగరంలో సంజన అనే అమ్మాయిని హత్య చేస్తాడు సీరియల్ కిల్లర్. తల, మొండెం, కాళ్ళు, చేతులు... నాలుగు భాగాలుగా బాడీని సపరేట్ చేస్తాడు. తల మాత్రమే సంజనాది అని... మొండెం, కాళ్ళు, చేతులు మరో ముగ్గురు అమ్మాయిలవి అని ఫోరెన్సిక్ టెస్టులో తెలుస్తుంది. ఈ కేసును కేడీ ఎలా సాల్వ్ చేశాడు? కేసును ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో అతడి గాళ్ ఫ్రెండ్ ఆర్య (మీనాక్షి చౌదరి) కి ఎందుకు సెక్యూరిటీ ఇచ్చారు? ఈ కథలో లేడీ పోలీస్ వర్ష (కోమలీ ప్రసాద్), కేడీ పైఅధికారి నాగేశ్వరారావు (రావు రమేష్) పాత్ర ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.    

విశ్లేషణ (Hit 2 Movie Telugu Review) : థ్రిల్లర్ సినిమాలతో ఓ సమస్య ఉంటుంది. ట్విస్ట్ చెబితే ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్ పోతుంది. చెప్పకుండా ఎక్కువసేపు కథను ముందుకు నడిపితే సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. పైగా, పాత సినిమాలతో పోలికలు రాకుండా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడం దర్శకులకు కత్తి మీద సాము లాంటి వ్యవహారమే. యాసిడ్ టెస్ట్ లాంటిది. 'హిట్' విషయంలో దర్శకుడు శైలేష్ కొలను ఆ టెస్ట్ పాస్ అయ్యారు. దాంతో 'హిట్ 2' మీద అంచనాలు పెరిగాయి. 

'హిట్'లో ఎవరు హత్యలు చేశారో చెప్పకుండా చివరి వరకూ కథను నడిపారు. 'హిట్ 2' విషయంలో అలా కాదు... సీరియల్ కిల్లర్ ఎవరో చెప్పేశారు. కథలో కంటెంట్ ఉంది. అయితే... కంటిన్యూగా ఎంగేజ్ చేయడంలో మాత్రం కాస్త తడబడ్డారు. 'హిట్ 2' స్టార్టింగ్ బావుంటుంది. కాసేపటి తర్వాత కిల్లర్ ఎవరనేది ప్రేక్షకుడి ఊహకు అందుతూ ఉంటుంది. అందువల్ల, సస్పెన్స్ ఫ్యాక్టర్ ఎక్కువ లేదు. సీరియల్ కిల్లర్ ఫ్లాష్ బ్యాక్ విన్న తర్వాత అప్పటి వరకు ఉన్న ఇంపాక్ట్ పోతుంది.    

కథలో ట్విస్టులు కూడా ఊహించేలా ఉన్నాయి. లాజిక్స్ పక్కన పెట్టి మేజిక్ మీద నమ్మకం ఉంచారు. నిడివి తక్కువ అయినప్పటికీ ఎక్కువసేపు చూసిన ఫీలింగ్ ఉంటుంది. టెక్నికల్‌గా సినిమా హై స్టాండర్డ్స్‌లో ఉంది. ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించగా... సిద్ శ్రీరామ్ పాడిన 'ఉరికే ఉరికే...' పాట బావుంది. జాన్ స్టీవార్ట్ ఏడూరి నేపథ్య సంగీతం కథలో మూడ్ క్యారీ చేసింది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. 

నటీనటులు ఎలా చేశారు? : అడివి శేష్‌కు థ్రిల్లర్ జానర్ ఫిల్మ్స్ చేయడం బాగా అలవాటు. ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే ఎక్కువ థ్రిల్లర్స్ ఉంటాయి. అందువల్ల, ఈజీగా చేసుకుంటూ వెళ్ళారు. అడివి శేష్ నటనకు వంక పెట్టడానికి ఏమీ లేదు. అలాగని కొత్తగానూ లేదు. కథకు ఆయన పర్ఫెక్ట్ యాప్ట్. మీనాక్షి చౌదరి ఓ పాటలో లిప్ లాక్స్, రొమాంటిక్ సీన్స్ చేశారు. పతాక సన్నివేశాల్లో ఎమోషనల్ సీన్ కూడా బాగా చేశారు. క్యారెక్టర్‌కు అవసరమైన ఇంటెన్స్‌ను కోమలీ ప్రసాద్ క్యారీ చేశారు. లేడీ పోలీస్‌గా ఆమె డ్రస్సింగ్, యాక్టింగ్ బావున్నాయి. శ్రీనాథ్ మాగంటి, రావు రమేష్ పాత్రల పరిధి మేరకు నటించారు. సుహాస్ ప్రత్యేక పాత్రలో సర్‌ప్రైజ్ చేస్తారు.  
   
Also Read : 'మట్టి కుస్తీ' రివ్యూ : భార్యాభర్తలు ఇంట్లో కాకుండా మట్టిలో కుస్తీ పోటీకి రెడీ అయితే?

ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే? : 'హిట్ 2' డీసెంట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఫస్టాఫ్‌లో కథ కంటే కథనం ఉత్కంఠ కలిగిస్తుంది. సెకండాఫ్ స్టార్ట్ అయిన తర్వాత, అసలు కథలోకి వెళ్ళాక... సాగదీసిన ఫీలింగ్ ఉంటుంది. నార్మల్ థ్రిల్లర్‌ను అడివి శేష్ సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చూడబుల్‌గా మార్చింది. థ్రిల్లర్ జానర్ ఆడియన్స్ ఓసారి ట్రై చేయవచ్చు. మిగతావాళ్ళు ఆలోచించాలి. 

Also Read : వదంది రివ్యూ: అమెజాన్ ప్రైమ్‌లో కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ - థ్రిల్ చేసిందా? బోర్ కొట్టించిందా?

Published at : 02 Dec 2022 11:38 AM (IST) Tags: ABPDesamReview Hit 2 Review Hit 2 Review In Telugu Hit 2 Telugu Review Adivi Sesh's Hit 2 Review

సంబంధిత కథనాలు

Sidharth Kiara Wedding: సిద్ధార్థ్, కియారా పెళ్లికి ముహూర్తం ఫిక్స్ - జైసల్మేర్‌లో వెడ్డింగ్, ముంబై రిసెప్షన్!

Sidharth Kiara Wedding: సిద్ధార్థ్, కియారా పెళ్లికి ముహూర్తం ఫిక్స్ - జైసల్మేర్‌లో వెడ్డింగ్, ముంబై రిసెప్షన్!

Monica Barbaro: ‘RRR’ తెలుగులోనే చూస్తా - ‘నెట్‌ఫ్లిక్స్’కు ప్రముఖ హాలీవుడ్ నటి రిక్వెస్ట్, ‘ఎత్తర జెండా’కు ఫిదా!

Monica Barbaro: ‘RRR’ తెలుగులోనే చూస్తా - ‘నెట్‌ఫ్లిక్స్’కు ప్రముఖ హాలీవుడ్ నటి రిక్వెస్ట్, ‘ఎత్తర జెండా’కు ఫిదా!

Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?

Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?

‘దసరా’ సినిమా నిర్మాతకు ఊహించని నష్టాలు?

‘దసరా’ సినిమా నిర్మాతకు ఊహించని నష్టాలు?

Project K Movie: ‘బాహుబలి’ బాటలో ‘ప్రాజెక్ట్-K’, రెండు పార్టులుగా విడుదల కాబోతోందా?

Project K Movie: ‘బాహుబలి’ బాటలో ‘ప్రాజెక్ట్-K’, రెండు పార్టులుగా విడుదల కాబోతోందా?

టాప్ స్టోరీస్

Hyderabad Traffic: బడ్జెట్ సమావేశాల ఎఫెక్ట్ - అసెంబ్లీ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు

Hyderabad Traffic: బడ్జెట్ సమావేశాల ఎఫెక్ట్ - అసెంబ్లీ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు

Budget 2023: ఇన్‌కం టాక్స్‌లో మోదీ సర్కార్‌ అతిపెద్ద కనికట్టు ఇదే - మీకు లాభమో, నష్టమో ఇలా తెలుసుకోండి!

Budget 2023: ఇన్‌కం టాక్స్‌లో మోదీ సర్కార్‌ అతిపెద్ద కనికట్టు ఇదే - మీకు లాభమో, నష్టమో ఇలా తెలుసుకోండి!

Vande Bharat Metro: త్వరలోనే వందేభారత్ మెట్రో రైళ్లు,కీలక నగరాల్లో సర్వీస్‌లు - రైల్వే మంత్రి ప్రకటన

Vande Bharat Metro: త్వరలోనే వందేభారత్ మెట్రో రైళ్లు,కీలక నగరాల్లో సర్వీస్‌లు - రైల్వే మంత్రి ప్రకటన

Suspicious Drone in Srikakulam : భావనపాడు తీరంలో మత్య్సకారులకు దొరికిన డ్రోన్ | DNN | ABP Desam

Suspicious Drone in Srikakulam : భావనపాడు తీరంలో మత్య్సకారులకు దొరికిన డ్రోన్ | DNN | ABP Desam