అన్వేషించండి

Lingocha Review - లింగోచ్చా రివ్యూ : హైదరాబాద్ నేపథ్యంలో హిందూ ముస్లిం ప్రేమకథ - కార్తీక్ రత్నం సినిమా ఎలా ఉందంటే?

Lingocha Movie Review In Telugu : 'కేరాఫ్ కంచరపాలెం'తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు కార్తీక్ రత్నం. 'నారప్ప'లో వెంకటేష్ తనయుడిగా కనిపించారు. ఆయన హీరోగా నటించిన తాజా సినిమా 'లింగోచ్చా'

సినిమా రివ్యూ : లింగోచ్చా 
రేటింగ్ : 2.25/5
నటీనటులు : కార్తీక్ రత్నం, సుప్యర్ధ సింగ్, ఉత్తేజ్, 'తాగుబోతు' రమేష్, కునాల్ కౌశిక్, 'పటాస్' సద్దాం, ఫిష్ వెంకట్, కళా సాగర్, శరత్ కుమార్ తదితరులు
మాటలు : ఉదయ్ మదినేని
సంగీతం : బికాజ్ రాజ్!
సమర్పణ : జె నీలిమ
నిర్మాత : యాదగిరి రాజు
కథ, కథనం, దర్శకత్వం : ఆనంద్ బడా 
విడుదల తేదీ: అక్టోబర్ 27, 2023  

Karthik Rathnam's Lingocha Review : 'కేరాఫ్ కంచరపాలెం' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు కార్తీక్ రత్నం. నితిన్ 'చెక్', 'రౌడీ బాయ్స్' తదితర సినిమాలతో పాటు వెబ్ సిరీస్ 'వ్యవస్థ'లో కీలక పాత్రలు పోషించారు. 'నారప్ప'లో వెంకటేష్ తనయుడిగా కనిపించారు. 'అర్ధ శతాబ్దం', 'చాంగురే బంగారు రాజా' సినిమాల్లో హీరోగానూ నటించారు. కార్తీక్ రత్నం హీరోగా రూపొందిన 'లింగోచ్చా' తాజాగా థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే?

కథ (Lingocha Movie Story) : శివ (కార్తీక్ రత్నం) హైదరాబాద్ పాతబస్తీ కుర్రాడు. చిన్న వయసులో నూర్ జహా (సుప్యర్థ సింగ్)ని చూసి ప్రేమలో పడతాడు. శివ అంటే నూర్ జహాకూ ఇష్టం. అయితే... పైకి చెప్పదు. అమ్మాయి ఇంట్లో ఇద్దరి ప్రేమ విషయం తెలిసి గొడవలు అవుతాయి. ఆమెకు పెళ్లి సంబంధం చూస్తారు. 

ఎంబిబిఎస్ చదివే అమ్మాయి పాతబస్తీలో ఆవారాగా తిరిగే కుర్రాడిని ఎలా ఇష్టపడింది? ఇంట్లో పెళ్లి నిశ్చయించిన తర్వాత లేచిపోదామంటే ఓకే చెప్పిన శివ, దుబాయ్ టికెట్స్ తీసి నూర్ జహాను మాత్రమే పంపించి అతడు ఎందుకు ఆగాడు? నూర్ జహా ప్రేమ కోసం పరితపించిన శివ... ఆమె ఫోన్స్ ఎందుకు అవాయిడ్ చేశాడు? దుబాయ్ నుంచి నూర్ జహా తిరిగి వచ్చిన తర్వాత ఏమైంది? వీళ్ళ ప్రేమ కథ ఏ తీరాలకు చేరింది? ప్రేమికులు ఇద్దరూ కలిశారా? లేదా? చివరకు ఏం జరిగింది? అనేది మిగతా సినిమా. 

విశ్లేషణ (Lingocha Movie Review) : సినిమా కంటే ముందు 'లింగోచ్చా' టైటిల్ గురించి చెప్పాలి. తెలంగాణలో వాడుక పదమిది. కొందరికి తెలియకపోవచ్చు. ఏడు పెంకుల ఆటను 'లింగోచ్చా' అంటారు. ఆ ఆట ఆడే సమయంలో అమ్మాయిని చూసి హీరో ప్రేమలో పడటంతో ఆ టైటిల్ పెట్టారు. అసలు కథకు, ఆ పేరుకు సంబంధం లేదు. ఈ కథకు ఒక రకంగా ఆ టైటిల్ మైనస్ కూడా!

'లింగోచ్చా' సినిమా విషయానికి వస్తే... మణిరత్నం 'బొంబాయి' నుంచి మొదలు పెడితే హిందూ, ముస్లిం నేపథ్యంలో ప్రేమ కథలు కొన్ని తెరపై వచ్చాయి. అయితే హైదరాబాద్ నేపథ్యంలో హిందూ యువకుడు, ముస్లిం అమ్మాయి కథను చెప్పడం సినిమాకు కొత్తదనం తీసుకు వచ్చింది. 

నేటివిటీలో ఉన్న కొత్తదనం కథ, కామెడీ సన్నివేశాల్లో లేకపోవడం, రెగ్యులర్ & రొటీన్ కామెడీ సీన్స్ ఉండటంతో ఫస్టాఫ్ సోసోగా వెళుతుంది. కథతో పాటు సాగే పాటలు కొంత వరకు ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ తర్వాత కూడా చాలా సేపు సినిమా సాదాసీదాగా ఉంటుంది. అయితే... పతాక సన్నివేశాల్లో హృదయాలను కదిలించే సన్నివేశాలతో బరువెక్కిన మనసుతో ప్రేక్షకులు బయటకు వచ్చేలా చేశారు దర్శకుడు ఆనంద్ బడా.  

ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన అమ్మాయిని దుబాయ్ ఎందుకు పంపించాడు? హీరో ఎందుకు ఆగాడు? అనే విషయం చెప్పడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. దాంతో సినిమా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ ఆ ల్యాగ్ ఫీలింగ్ పోయేలా చేస్తుంది. పాటలు, కెమెరా వర్క్ బావున్నాయి. కామెడీపై మరింత వర్క్ చేస్తే బావుండేది. ఇటీవల తెలంగాణ నేపథ్యంలో సినిమాలు అంటే మందు మాత్రమే అన్నట్లు చూపించారు. ఆ ఆల్కహాలిక్ సీన్స్ లేకుండా సినిమా తీయడం మంచి విషయం. 

నటీనటులు ఎలా చేశారంటే : శివ పాత్రలో కార్తీక్ రత్నం నటన సహజంగా ఉంది. హైదరాబాదీ యాస నుంచి యువత బాడీ లాంగ్వేజ్ వరకు బాగా పట్టుకున్నారు. ఆవారాగా తిరిగే యువకుడి పాత్రకు పర్ఫెక్ట్ సెట్. అతనికి జోడీగా నూర్ జహా పాత్రలో సుప్యర్థ సింగ్ క్యూట్ & బబ్లీ లుక్స్‌తో ఆకట్టుకున్నారు. ముస్లిం యువతి పాత్రలో ఒదిగిపోయారు. కార్తీక్, సుప్యర్థ జోడీ బావుంది. 

హీరో స్నేహితులుగా నటించిన వాళ్ళలో యాదవ్ పాత్రలో బల్వీర్ సింగ్ రెండు మూడు సన్నివేశాల్లో బాగా నవ్వించారు. 'పటాస్', 'జబర్దస్త్' కార్యక్రమాలతో గుర్తింపు తెచ్చుకున్న సద్దాంకు నవ్వించే సీన్లు అంతగా పడలేదు. మిగతా నటీనటులు ఓకే. పెద్దగా ఆకట్టుకునే వాళ్ళు ఎవరూ కనిపించలేదు. ఉత్తేజ్, 'తాగుబోతు' రమేష్ పాత్రలకు, ఈ కథకు సంబంధం లేదు. వారి ద్వారా ఈ కథను చెప్పించారు. తమ పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారు. అయితే... వాళ్లిద్దరి స్థాయికి తగ్గ పాత్రలు కావు. 

Also Read : నవంబర్‌లో క్రేజీ క్రేజీ ఫిలిమ్స్ - థియేటర్లలో సందడి చేసే సినిమాలు

చివరగా చెప్పేది ఏంటంటే : హైదరాబాదీ లోకల్ ఫ్లేవర్ సిల్వర్ స్క్రీన్ మీద ఆవిష్కరించిన సినిమాలు తక్కువ. 'హైదరాబాద్ నవాబ్స్', 'అంగ్రేజ్' వంటివి వచ్చాయి. 'లింగోచ్చా' ఆ లిస్టులో సినిమాయే. హైదరాబాదీలకు నచ్చే అంశాలు సినిమాలో చాలా ఉన్నాయి. సగటు ప్రేక్షకులను ఫస్టాఫ్ కామెడీ కొంత నవ్వించినా ఇంటర్వెల్ తర్వాత సీన్స్ డిజప్పాయింట్ చేస్తాయి. అయితే... ప్రతి ఒక్కరూ బరువెక్కిన మనసుతో బయటకు వచ్చేలా చేస్తుంది క్లైమాక్స్.   

Also Read ఏవయ్యా అట్లీ - నీకు హీరోయిన్లను చంపే శాడిజం ఏంటయ్యా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

విజయవాడ హైదరాబాద్ మధ్యలో త్వరలో హైపర్‌లూప్‌ ట్రైన్ఇండీ కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న వైసీపీరాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి, త్వరలోనే నామినేషన్!ప్రియుడిని పెళ్లి చేసుకున్న కీర్తి సురేశ్, ఫొటోలు వైరల్

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srivivas Reddy: ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
ఈ నెలాఖరులోగా తెలంగాణ కేబినెట్ విస్తరణ - మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Amaravati: రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
రాజధాని అమరావతికి గుడ్ న్యూస్ - రూ.15 వేల కోట్ల రుణాల మంజూరుకు ఏడీబీ క్లియరెన్స్
Instagram Reels Tips: ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ చేయడం ఎలా? - ఈ ఆరు టిప్స్ ఫాలో అయితే చాలు!
Mohanbabu New Audio: టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
టీవీ9 రిపోర్టరే తప్పు చేశాడు - అయినా కొట్టినందుకు చింతిస్తున్నా - మరో సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు
Sai Durgha Tej: ‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
‘సంబరాల ఏటిగట్టు’పై పారుతున్న నెత్తురు - సాయి దుర్గా తేజ్ మారణ హోమం!
Allu Arjun: రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
రాజకీయాల్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్లారిటీ వచ్చేసింది
World Chess Champion: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ విజేతగా యువ కెరటం గుకేశ్ - అతిపిన్న వయస్కుడిగా రికార్డు
Viral News: ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ !  వీడియో
ఒక్క రోజులో 100 మంది మగాళ్లతో శృంగారం - మోడల్ సాహసం - యూట్యూబ్‌లో కూడా పెట్టిందోచ్ ! వీడియో
Embed widget