Upcoming Telugu Movies Nov'2023 : నవంబర్‌లో క్రేజీ క్రేజీ ఫిలిమ్స్ - థియేటర్లలో సందడి చేసే సినిమాలు
Telugu Upcoming Movies 2023 : నవంబర్ నెలలో థియేటర్లలోకి వస్తున్న సినిమాలు ఏవి? అందులో స్ట్రయిట్ తెలుగు సినిమాలు ఏం ఉన్నాయి? తమిళ, హిందీ, కన్నడ భాషల నుంచి అనువాదం అవుతున్నవి ఏవి?
Upcoming Telugu Movies In November 2023 : సెప్టెంబర్ ముగిసినట్టే! ఈ నెలలో థియేటర్లలోకి వచ్చిన భారీ సినిమాలు కొన్ని మాత్రమే! దసరా సందర్భంగా గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ 'భగవంత్ కేసరి', తమిళ స్టార్ విజయ్ 'లియో', మాస్ మహారాజా రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' విడుదల అయ్యాయి. మరి, నవంబర్ పరిస్థితి ఏంటి? థియేటర్లలోకి వస్తున్న సినిమాలు ఏవి? అందులో స్ట్రయిట్ తెలుగు సినిమాలు ఎన్ని? హిందీ, తమిళ, కన్నడ భాషల నుంచి వస్తున్నవి ఎన్ని?
November 2023 Telugu movies : నవంబర్‌లో భారీ సినిమాలు రావడం లేదు కానీ కొన్ని క్రేజీ క్రేజీ ఫిలిమ్స్ థియేటర్లలో సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి. తాము వస్తున్నామంటూ సిగ్నల్స్ పంపించారు దర్శక నిర్మాతలు. డిఫరెంట్ & వెరైటీ జానర్ సినిమాలతో పాటు మాస్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్లు కూడా ఉన్నాయి. ఆ సినిమాలు ఏవో చూడండి.
తొలి వారంలో 'పొలిమేర 2' & 'కీడా కోలా'
నవంబర్ తొలి వారంలో... 3వ తేదీన అరడజనుకు పైగా సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. అందులో ముఖ్యమైన సినిమాలు రెండు మూడు ఉన్నాయి. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన 'కీడా కోలా' క్రైమ్ కామెడీ ఫిల్మ్. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ డార్క్ హ్యూమర్ గ్యారెంటీ అనే ఫీలింగ్ కలిగించింది. 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది' సినిమాలతో న్యూ ఏజ్ ఆడియన్స్‌లో తరుణ్ భాస్కర్ మీద మంచి ఇంప్రెషన్ ఉంది. దాంతో 'కీడా కోలా' మీద అంచనాలు ఉన్నాయి. మరి, ఈ సినిమా ఎటువంటి విజయం సాధిస్తుందో చూడాలి.
నవంబర్ 3న వస్తున్న మరో సినిమా 'మా ఊరి పొలిమేర 2'. 'సత్యం' రాజేష్ హీరోగా నటించిన చిత్రమిది. 'మా ఊరి పొలిమేర' ఓటీటీలో విడుదలైంది. అయితేనేం? చాలా మందిని ఆకట్టుకుంది. ముఖ్యంగా భయపెట్టింది. కాన్సెప్ట్ మెచ్చిన జనాలు ఎంతో మంది! ఈసారి ఓటీటీలో కాకుండా థియేటర్లలో 'మా ఊరి పొలిమేర 2'ను విడుదల చేస్తున్నారు. దీనిపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక... 'పలాస' సినిమాతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న రక్షిత్ అట్లూరి 'నరకాసుర' అంటూ నవంబర్ 3న వస్తున్నారు. ఈ మూడు సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు వస్తున్నాయి.
దీపావళికి 'ఆదికేశవ' & తమిళ్ ధమాకా!
నవంబర్ రెండో వారంలో దీపావళి. ఆ పండక్కి థియేటర్లలోకి రావడానికి మూడు నాలుగు సినిమాలు రెడీగా ఉన్నాయి. అందులో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ నటించిన 'ఆదికేశవ' ఉంది. కార్తీ 'జపాన్', రాఘవా లారెన్స్ & ఎస్.జె. సూర్య నటించిన 'జిగర్తాండ డబుల్ ఎక్స్' కూడా ఉన్నాయి.
'ఉప్పెన' తర్వాత వైష్ణవ్ తేజ్ సినిమాలేవీ బాక్సాఫీస్ బరిలో ఆశించిన విజయాలు అందుకోలేదు. అవనీ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలే. 'ఆదికేశవ'తో ఫస్ట్ టైమ్ మాస్ కమర్షియల్ జానర్ టచ్ చేశారు వైష్ణవ్. ఆయనకు జోడీగా శ్రీ లీల నటించారు. ఆల్రెడీ విడుదలైన సాంగ్స్ హిట్ అయ్యాయి. సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా విడుదల నవంబర్ 10న! 'బాహుబలి', 'ఎవరికీ చెప్పొద్దు' ఫేమ్ రాకేశ్ వర్రీ హీరోగా రూపొందిన 'జితేందర్ రెడ్డి' బయోపిక్ దీపావళికి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ దీపావళికి కాకపోతే... నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.
తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ 'పిజ్జా'తో తెలుగులో విజయం అందుకున్నారు. వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్'కు స్ఫూర్తి ఆయన తీసిన 'జిగర్తాండ'. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ వస్తోంది. అందులో రాఘవా లారెన్స్, ఎస్.జె. సూర్య నటించారు. దీపావళికి థియేటర్లలోకి రావడం కన్ఫర్మ్. అయితే... విడుదల తేదీ ఇంకా అనౌన్స్ చేయలేదు. కార్తీ 'జపాన్' కూడా దీపావళికి రిలీజ్ కానుంది. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ రెండు సినిమాలను భారీ ఎత్తున విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు.
ఆదివారం వస్తున్న సల్మాన్ ఖాన్ 'టైగర్ 3'
సాధారణంగా శుక్రవారం నాడు సినిమాలను విడుదల చేయడం ఆనవాయితీ. కానీ, సల్మాన్ ఖాన్ ఓ రెండు రోజులు వెనక్కి వెళ్లారు. ఆదివారం 'టైగర్ 3'ని విడుదల చేస్తున్నారు. నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై' సినిమాల తర్వాత సల్మాన్ ఖాన్, కత్రీనా కైఫ్ జంటగా నటించిన సినిమా కావడం... YRF Spy Universe ఫిల్మ్ కావడంతో దీనిపై అంచనాలు బావున్నాయి.
'ఆర్ఎక్స్ 100' కాంబోలో 'మంగళవారం'...
'సప్త సాగరాలు దాటి'న తర్వాత యాక్షన్!
'ఆర్ఎక్స్ 100' సినిమాతో తెలుగులో పాయల్ ఫుల్ పాపులర్ అయ్యారు. దర్శకుడు అజయ్ భూపతి కొత్త ట్రెండ్ స్టార్ట్ కావడానికి కారణమయ్యారు. కథలు చెప్పే తీరులో 'ఆర్ఎక్స్ 100' తర్వాత మార్పు కనిపించింది. ఆ సినిమా తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ నటించిన సినిమా 'మంగళవారం'. నవంబర్ 17న విడుదల అవుతోంది. ట్రైలర్స్, సాంగ్స్ ఇదొక కొత్త సినిమా అనే నమ్మకాన్ని కలిగించాయి. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఎవరూ చేయనటువంటి ప్రయోగం చేశానని అజయ్ భూపతి చెబుతున్నారు. సినిమా ఎలా ఉంటుందో చూడాలి. విక్రాంత్, మెహరీన్, రుక్సార్ థిల్లాన్ హీరో హీరోయిన్లుగా నటించిన 'స్పార్క్' కూడా నవంబర్ 17న విడుదల కానుంది.
Also Read : ఏవయ్యా అట్లీ - నీకు హీరోయిన్లను చంపే శాడిజం ఏంటయ్యా?
నవంబర్ 17న థియేటర్లలోకి వస్తున్న మరో సినిమా 'సప్త సాగరాలు దాటి - సైడ్ బి'. కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించడంతో పాటు నిర్మించిన సినిమా. నిజానికి, విజయ దశమికి సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, కుదరలేదు. దాంతో దీపావళి తర్వాత తీసుకు వస్తున్నారు. 'సప్త సాగరాలు దాటి - సైడ్ ఏ' మొదట కన్నడలో విడుదలైంది. విమర్శకుల ప్రశంసలతో పాటు కర్ణాటకలో మంచి వసూళ్లు సాధించింది. దాంతో తెలుగులో విడుదల చేశారు. ఇక్కడ ప్రశంసలు అయితే వచ్చాయి కానీ వసూళ్లు రాలేదు. మరి, సీక్వెల్ ఎలా ఆడుతుందో చూడాలి. 'సైడ్ ఎ'లో ప్రేమ కథ చూపిస్తే... 'సైడ్ బి'లో ఇంటెన్స్ యాక్షన్ ఉంటుందని క్లైమాక్స్‌లోని చూపించిన గ్లింప్స్‌తో క్లారిటీ వచ్చింది.
నవంబర్ నెలాఖరున కళ్యాణ్ రామ్ 'డెవిల్'
నవంబర్ నెలాఖరున... 24వ తేదీన నందమూరి కళ్యాణ్ రామ్ 'డెవిల్' విడుదలకు సిద్ధమైంది. అభిషేక్ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది. 'పుష్ప'తో పాటు రవితేజ సినిమాలు కొన్నిటికి రచయితగా పని చేసిన శ్రీకాంత్ విస్సా కథ, మాటలు అందించారు. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్... అనేది ఉప శీర్షిక! కళ్యాణ్ రామ్ గూఢచారి రోల్ చేశారు. నవంబర్ మొత్తం మీద భారీ తెలుగు సినిమా అంటే ఇదొక్కటే. ఎలా ఉంటుందో చూడాలి. వీటితో పాటు మరికొన్ని సినిమాలు విడుదల కానున్నాయి.
Also Read : 'యాత్ర 2'లో చంద్రబాబు నాయుడిగా ఎవరు నటిస్తున్నారో తెలుసా? మహేష్...
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial