కృతి సనన్‌కు 'మిమి'తో నేషనల్ అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఆరు డిజాస్టర్లతో చెత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ఆ సినిమాలేవో చూడండి. 'మిమి' తర్వాత కృతి సనన్ నటించిన 'హమ్ దో హమారా దో'లో రాజ్ కుమార్ రావు హీరో. ఇదీ డిజాస్టర్! అక్షయ్ కుమార్ జోడీగా నటించిన 'బచ్చన్ పాండే' కూడా ఫ్లాపే. ఇది 'గద్దలకొండ గణేష్' రీమేక్. వరుణ్ ధావన్ 'భేడియా' కొంతలో కొంత పర్వాలేదు. కానీ, అదేమీ సూపర్ హిట్ కాదు. 'అల వైకుంఠపురములో' హిందీ రీమేక్ 'షెహజాదే' అయితే ఘోరమైన ఫ్లాప్. హిందీలో పూజా హెగ్డే పాత్రను కృతి చేశారు. ప్రభాస్ సరసన సీత పాత్రలో కృతి సనన్ నటించిన 'ఆదిపురుష్' సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ కృతి సనన్ సినిమా 'గణపత్' కూడా భారీ డిజాస్టర్! కృతి సనన్ ఫోటోలు (all images courtesy : kritisanon / instagram)