షారుక్ ఖాన్ ‘జవాన్’ థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఏడు వారాలుగా ‘జవాన్’ బాక్సాఫీస్ వద్ద సత్తా చూపిస్తూనే ఉంది. మొదటి వారంలోనే ‘జవాన్’ రూ.389.88 కోట్ల నెట్ సాధించింది. రెండో వారంలో రూ.136.1 కోట్లు కలెక్ట్ చేసింది. మూడో వారంలో కూడా రూ.55.9 కోట్ల వసూళ్లతో దుమ్ము రేపింది. ఇక నాలుగో వారంలో రూ.35.63 కోట్లు సాధించింది. ఐదో వారంలో రూ.9.71 వసూళ్లు వచ్చాయి. ఇక ఆరో వారంలో ఐదో వారానికి మించి రూ.10.79 కోట్లు వచ్చాయి. మొత్తంగా ఏడు వారాల్లో దేశంలో అన్ని భాషల్లో రూ.639.75 కోట్ల నెట్ సాధించింది.