Nikocado Avocado : రెండేళ్లలో 114 కేజీల బరువు తగ్గాడు - ఆపరేషన్లతో కాదు ఎలాగో తెలుసా ?
YouTuber : ఘటోత్కచుడు తిన్నట్లుగా తినే వీడియోలు చేసే ఓ యట్యూబర్ .. రెండు వందల కేజీల వరకూ బరువు పెరిగేదాకా వెళ్లాడు. కదల్లేకుండా ఆయన భారీ కాయం ఉండేది.కానీ ఇప్పుడెలా ఉన్నారో తెలుసా ?
Nicholas Perry Lost 114 Kg In Two Years : నికాకాడో అవకాడో.. పేరుతో యూట్యూబ్‌లో తిండి తినడంలో తనదైన ప్రత్యేకత చూపించేవాడు నికోలస్ పెర్రీ అనే యువకుడు. తన భారీ కాయం ముందు కుప్పలు కుప్పలుగా పిజ్జాలు, బర్గర్లు.. జ్యూలు పెట్టుకుని అన్నింటినీ క్షణాల్లో ఖాలీ చేసేవాడు. అతని వీడియోలను విపరీతంగా వైరల్ అయ్యేవి. మన సినిమాల్లో ఘటోత్కచుడు ఎలా తింటాడో అలా ఖాళీ చేస్తాడు. ఆ వీడియోలు వైరల్ అయ్యేవి. అలా తిని తిని చివరికి అతని బరువు రెండు వందల కేజీల వరకూ వెళ్లింది.
Mukbang blogger Nikocado Avocado, who was filmed eating huge amounts of food on camera, was able to lose 113kg of weight.
— LIVE LEAK OFFICIAL ®️ (@Daily_News86) September 10, 2024
The man revealed that he suffers from erectile dysfunction and loss of libido as a result of overeating, he said. pic.twitter.com/R2cATG8Jdp
హఠాత్తుగా వీడియోలు ఆపేసిన ఆయన .. రెండేళ్ల తర్వాత అందర్నీ ఆశ్చర్య పరుస్తూ.. వీడియో రిలీజ్ చేశాడు. ఈ సారి ఆయనను చూసిన వారు ఎవరూ పోల్చుకోలేకపోయారు. ఎందుకంటే ఆ భారీ కాయం లేదు. సోషల్ మీడియాలో ఓ వీడియో పంచుకున్న నికోలస్ పెర్రి.. రెండేళ్లలో ఎంతో కష్టపడి 114 కేజీలు తగ్గానని ప్రకటించుకున్నాు. ప్రస్తుతం ఉన్న అవతారంతో పోలిస్తే.. ఆయన పూర్తిగా తన బరువు.. ఫ్యాట్ ను కోల్పోయాడు.
YouTuber Nikocado Avocado has completed one of the most compelling social experiments on the internet.
— Dudes Posting Their W’s (@DudespostingWs) September 7, 2024
While publishing pre-recorded videos, he lost 250 pounds, uploaded a shocking video, and looks like a completely new person. pic.twitter.com/Lk2IhKOiyR
యూట్యూబర్ ఎలా తన బరువును కోల్పోయారో చెప్పాలని చాలా మంది అతన్ని అడిగారు. అయితే దాని కోసం ప్రైవేటు ప్రయత్నాలు.. అలాగే డైటింగ్ చేశానని చెబుతున్నారు కానీ.. ఏం చేశారో మాత్రం చెప్పలేదు. అందరూ అవకాడో జర్నీని స్ఫర్తిగా తీసుకుని బరువు తగ్గుతామని.. అంటున్నారు. టూ స్టెప్స్ పేరుతో ఆయన రిలజ్ చేసిన వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.
కొసమెరుపేమిటంటే.. ఆయన తిండిని మాత్రం తగ్గించలేదు. వీడియోలో తన పెంపుడు చిలుకతో కలిసి నూడిల్స్ తింటున్న వీడియోలను పోస్టు చేస్తున్నారు.
lo del Nikocado Avocado es una absoluta locura, es literalmente un capítulo de black mirror. Me estás contando que engordaste como para estar en mi vida con 300 kilos por un experimento y en 1 año has bajado 113 kg. Con las enfermedades que tendrá debido a eso¿? para nada. pic.twitter.com/Yf6LeGIhQT
— Nova (@Haakttdy) September 7, 2024
కొంత మంది మాత్రం అవకాడో ఫేక్ అంటున్నారు.