Bathing Habits: భోజనం తర్వాత స్నానం చేస్తున్నారా? సూర్యస్తమయం తర్వాత చేస్తే ఏమవుతుంది?
భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తే వచ్చే అనార్థాల గురించి చాలా మందికి అవగాహన ఉండదు. అందుకే తిన్న వెంటనే కొంతమంది స్నానం చేస్తారు. అలా చేస్తే ఏమవుతుందో తెలుసా?
మనలో చాలా మంది భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తుంటారు. అలా చేయకూడదని ఇంట్లో పెద్ద వాళ్ళు చెబుతూ ఉంటారు. ఆయుర్వేద శాస్త్రం కూడా ఇదే విషయాన్ని గట్టిగా నొక్కి మరి చెప్తుంది. అందుకు కారణం లేకపోలేదు. భోజనం తర్వాత స్నానం చేస్తే అది జీర్ణవ్యవస్థకే కాదు మొత్తం ఆరోగ్యం మీద ప్రభావం చూపే సామర్థ్యం కలిగి ఉందని నిపుణులు అంటున్నారు. శరీరంలోని జరిగే చర్యలన్నీ సక్రమంగా జరగాలంటే స్నానపు ఆచారం కూడా సరైన విధంగా ఉండాలని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం గురించి ప్రముఖ ఆయుర్వేద నిపుణులు స్నానం చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన మూడు విషయాల గురించి వెల్లడించారు.
స్నానం చేసే ముందు గ్లాసు నీళ్ళు తాగాలి
స్నానం చేసే ముందు ఒక గ్లాసు వెచ్చని లేదా గది ఉష్ణోగ్రత ఉన్న నీళ్ళు తాగడం వల్ల శరీరంలోని రక్తపోటు సంబంధిత సమస్యలని తగ్గించడంలో సహాయపడుతుంది. వెచ్చని నీరు తాగడం వల్ల శరీరం లోపలు నుంచి వేడి వస్తుంది. ఫలితంగా రక్త నాళాలు విస్తరిస్తాయి. వాటి ద్వారా రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. తద్వారా రక్తపోటు తగ్గుతుంది. చర్మం ఉపరితల మీద ఇదే విధంగా ప్రసరణ వ్యవస్థ విస్తరణకు దారితీస్తుంది.
పూర్తిగా భోజనం చేసిన తర్వాత ఎప్పుడు స్నానం వద్దు
కడుపు నిండిన తర్వాత అసలు స్నానం చెయ్యకూడదు. ఇలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థని బలహీనపరుస్తుంది. ఇది జీర్ణక్రియ, శోషణ, పోషకాలని సమీకరించడం మందగించేలా చేస్తుంది. జీర్ణక్రియ ప్రక్రియకి సహాయపడతానికి శరీరం జీర్ణవ్యవస్థకి రక్తాన్ని పంపుతుంది. కానీ స్నానం చేయడం వల్ల పొట్ట నుంచి రక్తప్రవాహాన్ని చెడగొట్టి చాహం ఉపరితలం మీదకి పంపిస్తుంది. అన్నం తిన్న తరవాత స్నానం చేస్తే అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలు వస్తారయి. అందుకే స్నానం చెయ్యడానికి ముందు లేదా తిన్న తర్వాత 30-45 నిమిషాల పాటు చేయకపోవడం మంచిది.
సూర్యాస్తమయం తర్వాత తలస్నానం చెయ్యొద్దు
సూర్యాస్తమయం తర్వాత మన శరీరం చల్లబడుతుంది. శరీరంలో జరిగే చర్యలు వేగం తగ్గుతుంది.. అంటే విశ్రాంతి తీసుకునే సమయం ఆసన్నమైంది అనేందుకు సూచిక. పడుకునే ముందు తలస్నానం చేయడం వల్ల చర్మ రంథ్రాలు శరీరంలోని వేడిని బంధించకుండా నిరోధిస్తాయి. ఇది రాత్రి నిద్రకి భంగం కలిగిస్తుంది.
తల స్నానానికి ఇలా..: తల స్నానం చేసేటప్పుడు రక్తప్రసరణ మెరుగుపరచడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. సున్నితమైన జ్ఞాన అవయవాలని రక్షించుకోవడానికి ముఖానికి గది ఉష్ణోగ్రత నీటిని ఉపయోగించాలి. గాయాల నుంచి కోలుకున్నప్పుడు చల్లని నీటి స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల వాపు తగ్గుతుంది. శరీరం నుండి లాక్టిక్ యాసిడ్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది. రక్త నాళాలు బిగుతుగా మారేలా చేస్తుంది. చన్నీటి స్నానం చేయడం వల్ల కొవ్వు కూడా కరిగిపోతుంది. కొల్లాజెన్, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి స్నానం చేసే ముందు పూర్తిగా ఆయిల్ మసాజ్ కూడా చేసుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.