X

Yorkshire: చదువు మానేసి ట్రక్కు కొన్నాడు.. కోటీశ్వరుడయ్యాడు, ఇతడిది బుర్రే బుర్ర!

కరోనా చాలామందిని రోడ్డున పడేసింది. కానీ, ఇతడిని రోడ్డెక్కెలా చేసి లాభాలు తెచ్చిపెట్టింది. చదువులేని ఆ వ్యక్తి ఇప్పుడు ఏడాదికి రూ.450 కోట్లు చొప్పున సంపాదిస్తున్నాడు.

FOLLOW US: 

జీవితంలో ఎదగాలంటే చదువు ఎంత ముఖ్యమో తెలిసిందే. చదువుకు తెలివి తేటలు తోడైతే సక్సెస్ కూడా మన వెంటే ఉంటుంది. మంచి ఉద్యోగం, గౌరవం, హోదా లభిస్తుంది. చదువుంటే ఎక్కడైనా సరే ఏదో ఒకలా బతికేయొచ్చు. కానీ, అందరికీ చదువు మీద శ్రద్ధ ఉండదు. వారి అభిరుచులు, లక్ష్యాలు వేరుగా ఉంటాయి. తమకు నచ్చిన రంగంలో రాణించాలని కోరుకుంటారు. అయితే, ఇందుకు చాలా ధైర్యం కావాలి. తెలివితేటలు, ప్లానింగ్ కావాలి. ఎలాంటి సవాళ్లు ఎదురైనా సులభంగా ఎదుర్కొనే సత్తా ఉండాలి. ఇవన్నీ ఉన్నవాళ్లు తప్పకుండా విజయం సాధిస్తారు. ఇందుకు ఈ మిలీనియర్ ఒక ఉదాహరణ. 

అతడి పేరు స్టీవ్ పార్కిన్. యూకేలోని యార్క్‌షైర్‌కు చెందిన స్టీవ్ 1992లో 16 ఏళ్ల వయస్సులో అతడు చదువు మానేశాడు. బతుకుతెరువు కోసం ఒక హెవీ గూడ్స్ వెహికల్ (HGV) లైసెన్స్ తీసుకున్నాడు. ముందుగా అతడు హడర్స్‌ఫీల్డ్ సంస్థకు చెందిన దుస్తుల కంపెనీలో పనిచేశాడు. ట్రక్కు నడుపుతూ సంపాదించిన మొత్తాన్ని జాగ్రత్తగా బ్యాంకులో దాచుకున్నాడు. అదే ఏడాది మరో ఇద్దరు సభ్యులతో ‘క్లిప్పర్’ అనే ఆన్‌లైన్ లాజిస్టిక్స్ కంపెనీని ప్రారంభించాడు. ఆ కంపెనీకి వచ్చే ఆర్డర్లను స్టీవ్ స్వయంగా డ్రైవింగ్ చేస్తూ డెలివరీలు చేసేవాడు. అలా వచ్చిన సొమ్ముతో మరికొన్ని లారీలను, డ్రైవర్లను పెట్టుకున్నాడు. ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్లు స్వీకరించడం మొదలుపెట్టాడు. అది సక్సెస్ కావడంతో.. స్వీట్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పుడు ఆ కంపెనీ టర్నోవర్ ఏడాదికి £45 మిలియన్ (రూ. 450 కోట్లు)కు పెరిగింది. 

కలిసొచ్చిన కరోనా: బిజినెస్ ఇన్‌సైడర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం..  ‘మ్యాన్ విత్ ఏ వ్యాన్’గా గుర్తింపు పొందిన స్టీవ్ పార్కిన్ ఇప్పుడు యార్క్‌షైర్‌లోని అత్యంత ధనవంతుల జాబితాలో 10వ స్థానంలో ఉన్నాడు. అయితే, ఇతడి వ్యాపారానికి కరోనా వైరస్‌తో కలిసి వచ్చిందనే చెప్పుకోవచ్చు. ప్రపంచంలో చాలామంది కోవిడ్-19 వల్ల ఉపాధి కోల్పోతే.. స్టీవ్ కంపెనీకి మాత్రం లాభాలు వచ్చాయి. లాక్‌డౌన్‌లో ఇళ్లల్లో చిక్కుకున్న ప్రజలకు నిత్యవసర వస్తువులను తరలించేందుకు ప్రభుత్వం క్లిప్పర్ సంస్థనే ఉపయోగించింది. అంతేగాక యూకే నలుమూలల నుంచి కూడా వీరి సంస్థకు ఆన్‌లైన్లో ఆర్డర్లు వచ్చేవి. ఫలితంగా క్లిప్పర్ సంస్థ ఆదాయం గణనీయంగా పెరిగింది.  

ఈ సంస్థ టర్నోవర్ 39.1 శాతానికి పెరిగి.. దాదాపు £700 మిలియన్లకు చేరుకున్నట్లు కంపెనీ పేర్కొంది. అంతేగాక ఈ సంస్థలో పనిచేసే సిబ్బంది సంఖ్య కూడా అదనంగా 2 వేలకు పెరిగింది. దీంతో స్టీవ్ సంస్థలో ఇప్పుడు 10,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పార్కిన్ తన సంస్థలో 10 శాతాన్ని విక్రయించి.. 20 కోట్ల విలువైన షేర్లను క్యాష్ చేసుకున్నాడు. ఇప్పుడు క్లిప్పర్ సంస్థ.. ఇ-కామర్స్ లాజిస్టిక్స్ మార్కెట్‌లో ప్రముఖ స్థానానికి చేరుకుంది. పార్కిన్‌కు గుర్రపు స్వారీలంటే చాలా ఇష్టం. 2020లో అతని గుర్రం ఈగల్స్ బై డే యార్క్‌లో జాన్ స్మిత్స్ కప్‌ను గెలుచుకుంది. పార్కిన్.. ‘లీడ్స్ యునైటెడ్’ ఫుట్‌బాల్ క్లబ్ అభిమాని. గతంలో చాలాసార్లు అతడు ఆ క్లబ్‌ను సొంతం చేసుకోవాలని ఆలోచించాడట. 

Also Read: చింపాంజీలకు మనుషుల వీర్యం.. రష్యా శాస్త్రవేత్త ప్రయోగం ఫలించిందా? ‘హ్యూమాన్జీ’ ఏమైంది?

Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!

Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..

Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
Tags: Yorkshire Steve Parkin Clipper Yorkshire Company యార్క్‌షైర్

సంబంధిత కథనాలు

Sleep Apnea: నిద్రలోనే ప్రాణాలు తీసే మహమ్మారి ఇది... లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయద్దు

Sleep Apnea: నిద్రలోనే ప్రాణాలు తీసే మహమ్మారి ఇది... లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయద్దు

Tomato: వంటలక్కలు, వంటలయ్యలూ.. టమోటా ధరలు చూస్తున్నారుగా? ఇలా ఇంట్లోనే పెంచేస్తే పోలా..

Tomato: వంటలక్కలు, వంటలయ్యలూ.. టమోటా ధరలు చూస్తున్నారుగా? ఇలా ఇంట్లోనే పెంచేస్తే పోలా..

Wedding: ఒకే వేదికపై ఆరుగురు అక్కచెల్లెళ్ల పెళ్లి... ఊరంతా సందడే

Wedding: ఒకే వేదికపై ఆరుగురు అక్కచెల్లెళ్ల పెళ్లి... ఊరంతా సందడే

Paneer in America: మన దేశీ పనీర్ అమెరికన్లకు తెగ నచ్చేసింది... ఇప్పుడదే అక్కడ పాపులర్ వంటకం, చెబుతున్న డేటా

Paneer in America: మన దేశీ పనీర్ అమెరికన్లకు తెగ నచ్చేసింది...  ఇప్పుడదే అక్కడ పాపులర్ వంటకం, చెబుతున్న డేటా

Silent Killers: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త

Silent Killers: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త

టాప్ స్టోరీస్

Balakrishna Speech: సినిమాకు ప్రభుత్వాలు సహకరించాలి.. అఖండ వేదికపై బాలయ్య స్పీచ్.. మరో సినిమాపై హింట్.. దర్శకుడు ఎవరంటే?

Balakrishna Speech: సినిమాకు ప్రభుత్వాలు సహకరించాలి.. అఖండ వేదికపై బాలయ్య స్పీచ్.. మరో సినిమాపై హింట్.. దర్శకుడు ఎవరంటే?

Sirivennela: సిరివెన్నెలకి అస్వస్థత.. కిమ్స్ లో ట్రీట్మెంట్.. స్పందించిన కుటుంబసభ్యులు

Sirivennela: సిరివెన్నెలకి అస్వస్థత.. కిమ్స్ లో ట్రీట్మెంట్.. స్పందించిన కుటుంబసభ్యులు

Nothing Ear 1: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?

Nothing Ear 1: ఈ సూపర్ ఇయర్‌బడ్స్ ధర భారీ తగ్గింపు.. ఏకంగా రూ.వేయికి పైగా.. ఇప్పుడు ఎంతంటే?

Akhanda Trailer 2: థియేటర్లలో మాస్ జాతర ఖాయం.. తల తెంచుకుని వెళ్లిపోవడమే.. రెండో ట్రైలర్ వచ్చేసింది!

Akhanda Trailer 2: థియేటర్లలో మాస్ జాతర ఖాయం.. తల తెంచుకుని వెళ్లిపోవడమే.. రెండో ట్రైలర్ వచ్చేసింది!