అన్వేషించండి

Paneer: మీరు కిలో పనీర్ ఎంతకి కొన్నారు? ఇక్కడ కనిపిస్తున్న పనీర్ ధర వింటే వామ్మో అంటారు

పనీర్ ఇప్పుడు ఎక్కువమంది ఇళ్లల్లో కనిపిస్తుంది. ప్రపంచంలోనే ఖరీదైన పనీర్ గురించి తెలుసా?

మనం పనీర్ అంటాం, కొన్ని పాశ్చాత్యదేశాల్లో కాటేజ్ చీజ్ అంటారు. రెండూ ఒక్కటే. వెజిటేరియన్లు చాలా ఇష్టంగా తినే పదార్థాలలో పనీర్ ముందుంటుంది. సాధారణ పనీర్ కిలో అయిదు వందల రూపాయల వరకు ఉంటుంది. ఇంకా లేదంటే ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉండొచ్చు. కానీ ప్రపంచంలోనే ఖరీదైన పనీర్ ఎంతో తెలుసా కిలో డబ్బై వేల రూపాయలు. దీని పేరు సెర్బియన్ చీజ్.పేరులో చీజ్ ఉన్న ఇది పనీర్ కిందకే వస్తుంది. 

ఎందుకంత ఖరీదు?
మనం కొనుక్కునే పనీర్‌ను ఆవు పాలతోనో, గేదె పాలతోనే తయారుచేస్తారు.కానీ సెర్బియన్ చీజ్ ను మాత్రం గాడిద పాలతొ తయారు చేస్తారు. గాడిద పాలు ఎంత ఖరీదో తెలుసు కదా. కిలో పనీర్ తయారు కావాలంటే బోలెడన్ని పాలు కావాలి. ఒక అంచనా ప్రకారం 25 లీటర్ల గాడిద పాలను విరక్కొడితే కానీ కిలో పనీర్ తయారవదు. ఈ పనీర్ ను సెర్బియాలోని ప్రసిద్ధ సహజ నిల్వ ప్రాంతమైన జసావికాలో ఉత్పత్తి చేస్తారు. ఈ పనీర్ ను ‘పూలే’ అని కూడా పిలుస్తారు. 

గాడిద పాలతో ఎన్నో లాభాలు...
గేదె పాలతో పోలిస్తే గాడిద పాలు ఖరీదైనవి. అంతేకాదు అందులో పోషక విలువలు కూడా అధికం. అధ్యయనాల ప్రకారం గాడిద పాలు ప్రొటన్ తో నిండి ఉంటాయి. దీనిలో యాంటీ మైక్రోబయల్ ప్రభావాలను కలిగి ఉంటాయి. గాడిద పాలను, ఆ పాల ఉత్పత్తులను తాగడం వల్ల వైరస్‌లు, బ్యాక్టిరియా వల్ల వచ్చే పొట్ట సమస్యలు తగ్గిపోతాయి. గాడిద పాలు ఎముకలకు చాలా మేలు చేస్తాయి. పొట్టలోని మంచి బ్యాక్టిరియాను పెంచడంలో సహాయపడుతుంది. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గాడిద పాలు పడకపోవడమనేది ఉండదట. ఎలాంటి వారికైనా ఇవి పడతాయి. అందుకే వీటి ఖరీదు ఎక్కువని చెబుతారు. 

పాలు దొరకవా?
గేదు, ఆవుల సంఖ్యతో పోలిస్తే ప్రపంచంలోని గాడిదల సంఖ్య చాలా తక్కువ. అలాగే ఇవి లీటర్ల కొద్దీ పాలను ఇవ్వవు. ఒక్కో గాడిద రోజుకు ఒక లీటరు పాలను మాత్రమే ఇస్తుంది. అంటే పాతిక గాడిదలు పెంచితే రోజుకు పాతిక లీటర్లు పాలు వస్తాయి. ఆ పాతిక లీటర్ల పాలతో కిలో పనీర్ తయారవుతుంది. అందుకే గాడిద పాలు, పనీర్ అంత ఖరీదు. గాడిద పాలలో  అందాన్ని పెంచే గుణాలు కూడా ఉన్నాయి. కొన్ని కాస్మోటిక్స్ తయారీలో గాడిద పాలను వినియోగిస్తారు. 

Also read: మనదేశంలో అబార్షన్ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఎన్ని వారాల వరకు గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది?

Also read: బిర్యానీ మసాలా కొంటున్నారా? ఇంట్లో ఇలా చేసుకుంటే ఏడాదైనా నిల్వ ఉంటుంది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
Mohanbabu House: అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
Veera Dheera Sooran: గన్నులు, బాంబులతో చెలరేగుతున్న విక్రమ్ - ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ టీజర్ చూశారా?
గన్నులు, బాంబులతో చెలరేగుతున్న విక్రమ్ - ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ టీజర్ చూశారా?
Pushpa 2 Collection: ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో కేటీఆర్, ఆత్మీయ ముచ్చట - వైరల్ వీడియోబంగ్లాదేశ్ జెండా  చించేసిన రాజా సింగ్ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
పవన్ కల్యాణ్‌ను చంపేస్తాం - డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్
Mohanbabu House: అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
అది ఇల్లు కాదు ప్యాలెస్‌ కంటే ఎక్కువ - మోహన్ బాబు ఇంటిని స్వయంగా చూపిస్తున్న మంచు లక్ష్మి - చూస్తారా ?
Veera Dheera Sooran: గన్నులు, బాంబులతో చెలరేగుతున్న విక్రమ్ - ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ టీజర్ చూశారా?
గన్నులు, బాంబులతో చెలరేగుతున్న విక్రమ్ - ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ టీజర్ చూశారా?
Pushpa 2 Collection: ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
ఊహకందని ఊచకోత కోస్తున్న బన్నీ - మొదటి వీకెండ్ అయ్యేసరికి ఒక్క రికార్డూ మిగల్లేదు!
RBI New Governor: ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా - కేంద్రం కీలక నియామకం !
ఆర్బీఐ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా - కేంద్రం కీలక నియామకం !
Rains Update: అల్పపీడనంతో ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన - తెలంగాణలో తగ్గిన చలి, IMD అలర్ట్
అల్పపీడనంతో ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన - తెలంగాణలో తగ్గిన చలి, IMD అలర్ట్
Asha Worker Protest: సీఐపై చేయి చేసుకున్న ఆశా కార్యకర్త, తమ నిరసనలో పోలీసుల తీరుపై ఆగ్రహం
సీఐపై చేయి చేసుకున్న ఆశా కార్యకర్త, తమ నిరసనలో పోలీసుల తీరుపై ఆగ్రహం
MLC By Poll: ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపీమూర్తి జయకేతనం
ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక - స్వతంత్ర అభ్యర్థి బొర్రా గోపీమూర్తి జయకేతనం
Embed widget